మరికొద్దిసేపట్లో తెలంగాణలోని పలు జిల్లాల్లో మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని తెలంగాణ వెదర్ మ్యాన్ సోషల్ మీడియా వేదికన హెచ్చరిస్తున్నారు. ఇంతకూ ఏఏ జిల్లాల్లో వర్షం కురిసే అవకాశం ఉందంటే…
Telangana and Andhra Pradesh Weather Updates : తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ వర్షాలు మొదలవుతున్నాయి. ఇటు తెలంగాణతో పాటు అటు ఆంధ్ర ప్రదేశ్ లోనూ గత కొద్దిరోజులుగా వర్షాలు తగ్గుముఖం పట్టిన విషయం తెలిసిందే. అయితే మళ్లీ వాతావరణ పరిస్థితులు వర్షాలకు అనుకూలంగా మారడంతో జోరందుకుంటున్నాయి. మెల్లిగా ప్రారంభమైన ఈ వర్షాలు రెండుమూడు రోజుల్లో మరింత ఊపందుకుంటాయని... ఇక సెప్టెంబర్ సెకండాఫ్ లో కుండపోత వానలుంటాయని వాతావరణ శాఖ చెబుతోంది.
26
రెండు గంటల్లో ఈ జిల్లాల్లో వర్షాలు...
ప్రస్తుతం తెలంగాణవ్యాప్తంగా కాకపోయినా కొన్నిచోట్ల మోస్తరు నుండి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ నిపుణులు తెలంగాణ వెదర్ మ్యాన్ హెచ్చరించారు. ముఖ్యంగా కరీంనగర్, మహబూబాబాబాద్, ఆదిలాబాద్, నిర్మల్, నల్గొండ, సూర్యాపేటతో పాటు యాదాద్రి భువనగిరి, హన్మకొండ, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హెచ్చరించారు. రాబోయే రెండు గంటల్లో మోస్తరు నుండి అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలంగాణ వెదన్ మ్యాన్ ఎక్స్ వేదికన ప్రకటించారు.
36
హైదరాబాద్ లో పరిస్థితేంటి?
హైదరాబాద్ విషయానికి వస్తే వాతావరణ పరిస్థితిలో ఏమాత్రం మార్పు ఉండదని... పొడి వాతావరణం కొనసాగుతుందని తెలంగాణ వెదర్ మ్యాన్ తెలిపారు. అంటే రాజధాని నగరంలో వర్షం కురిసే అవకాశాలు లేవని చెబుతున్నారు. అయితే రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు జోరందుకోగానే హైదరాబాద్ పరిస్థితి కూడా మారుతుంది... ఇక్కడ కూడా భారీ వర్షాలకు అవకాశం ఉంటుంది.
రేపు మంగళవారం (సెప్టెంబర్ 10న) తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. భూపాలపల్లి, ఆసిఫాభాద్, మహబూబాబాద్, మంచిర్యాల, ములుగు జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని హెచ్చరించారు. దీంతో ఈ జిల్లాలకు ఐఎండి ఎల్లో అలర్ట్ జారీచేసింది.
56
ఏపీలో కూడా వర్షాలు
ఆంధ్ర ప్రదేశ్ విషయానికి వస్తే దక్షిణ ఒడిషా-ఉత్తరాంధ్ర తీరాలను ఆనుకుని బంగాళాఖాతో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని APSDMA (ఆంధ్ర ప్రదేశ్ స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ) వెల్లడించింది. దీంతో మంగళవారం పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు నుండి భారీ వర్షం కురిసే అవకాశం ఉందట. బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి ఆయా జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని డిజాస్టర్ మేనేజ్మెంట్ విభాగం సూచించింది.
66
బంగాళాఖాతంలో మరో అల్పపీడనం
ఇక ఈ నెలలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ చెబుతోంది. ప్రస్తుతం బంగాళాఖాతంలో అల్పపీడనానికి అనుకూల వాతావరణం ఏర్పడుతోందని... సెప్టెంబర్ 13న అది బలపడే అవకాశాలున్నాయిని ఇండియన్ మెటలర్జికల్ డిపార్ట్ మెంట్ (IMD) వెల్లడించింది. ఇది క్రమంగా ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ దిశగా కదులుతూ వస్తుందని... దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు జోరందుకుంటాయని ఐఎండి భావిస్తోంది. ఇలా సెప్టెంబర్ నెలంతా భారీ వర్షాలు కొనసాగుతాయని... కొన్ని ప్రాంతాల్లో రికార్డు స్థాయిలో వర్షాలు కురిసి వరదలు సంభవించే అవకాశాలున్నాయని హెచ్చరించింది. కాబట్టి తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు, ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది.