ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో వాతావరణ పరిస్థితులు ఆగస్ట్ లో ఉన్నట్లే సెప్టెంబర్ లోనూ ఉండేలా కనిపిస్తోంది. ఈ నెలలోనూ భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండి హెచ్చరిస్తోంది.
Telangana and Andhra Pradesh Weather : ఆగస్ట్ నెలంతా తెలుగు రాష్ట్రాలను వర్షాలు ముంచెత్తిన విషయం తెలిసిందే... అత్యంత భారీ వర్షాలతో వరదలు సంభవించాయి. అయితే సెప్టెంబర్ లో ఇప్పటివరకు చెదురుమదురు జల్లులు మినహా భారీ వర్షాలు లేవు. కానీ ఇవాళ్టి(సోమవారం) నుండి మళ్ళీ వర్షాలు మొదలవుతాయని... క్రమక్రమంగా తీవ్రత పెరుగుతూ చిరుజల్లులు కాస్త భారీ వర్షాలుగా మారతాయని వాతావరణ శాఖ చెబుతోంది. భారీ నుండి అతిభారీ వర్షాలకు అనుకూల వాతావరణం ప్రస్తుతం ఏర్పడుతోందని ప్రకటించింది.
25
బంగాళాఖాతంలో మరో అల్పపీడనం
సెప్టెంబర్ 13న అంటే ఈ వీకెండ్ కు బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశాలున్నాయని ఇండియన్ మెటలర్జికల్ డిపార్ట్ మెంట్ (IMD) వెల్లడించింది. ఇది క్రమంగా బలపడి ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ దిశగా కదులుతుందని... దీని ప్రభావంతో వర్షాలు జోరందుకుంటాయని తెలిపింది. ఇక సెప్టెంబర్ నెలంతా భారీ వర్షాలు కొనసాగుతాయని... కొన్ని ప్రాంతాల్లో రికార్డు స్థాయిలో వర్షాలు కురిసి వరదలు సంభవించే అవకాశాలున్నాయని హెచ్చరించింది. కాబట్టి తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు, ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది.
35
నేడు తెలంగాణలో వర్షాలు
సెప్టెంబర్ 8 నుండి అంటే ఇవాళ్టి నుండి తెలంగాణలో వర్షాలు మొదలవుతాయని వాతావరణ శాఖ ప్రకటించింది. ముఖ్యంగా ఆదిలాబాద్, భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, కొమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, ములుగు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశాలున్నాయని తెలిపారు. అలాగే జయశంకర్ భూపాలపల్లి, ఖమ్మం, సూర్యాపేట, సిరిసిల్ల, కరీంనగర్, వరంగల్, హన్మకొండ, సిద్దిపేట, జనగామ, భువనగిరి జిల్లాల్లో కూడా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే ఛాన్సెస్ ఉన్నాయట. కాబట్టి ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ.
ఇవాళ(సోమవారం) ప్రారంభమయ్యే వర్షాలు మెళ్లిగా జోరందుకుంటాయని వాతావరణ నిపుణులు తెలంగాణ వెదర్ మ్యాన్ సోషల్ మీడియా ద్వారా హెచ్చరిస్తున్నారు. ప్రెషర్ కుక్కర్ రెడీ అవుతోంది… ఒక్కసారిగా అది పేలిపోయినట్లుగా సెప్టెంబర్ 9 నుండి 13 లోపు భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించారు. హైదరాబాద్ లో కూడా మంగళవారం నుండి వర్షాలు జోరందుకుంటాయని తెలంగాణ వెదర్ మ్యాన్ ప్రకటించారు.
55
నేడు ఆంధ్ర ప్రదేశ్ లో వర్షాలు
ఆంధ్ర ప్రదేశ్ లో నేడు(సోమవారం) మోస్తరు నుండి అక్కడక్కడ కాస్త గట్టిగానే వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావం పలు జిల్లాలపై ఉండనుందని... ఆయా జిల్లాలో అక్కడక్కడ భారీ వర్షాలు కూడా కురిసే అవకాశాలున్నాయట. ఇలా ఉత్తరాంధ్ర జిల్లాలైన విజయనగరం, శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురవొచ్చని... ఉరుములు మెరుపులతో పాటు ఈదురుగాలులు కూడా వీస్తాయని... ఈ జిల్లాల ప్రజలు కాస్త అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.