Telangana: తెలంగాణ రాజకీయాల్లో సంచలనం.. పవన్ కళ్యాణ్ టార్గెట్ అదేనా.?

Published : Jan 11, 2026, 09:38 AM IST

Telangana: తెలంగాణ రాజ‌కీయాల్లో మ‌రో సంచ‌ల‌నానికి తెర లేస్తోంది. ఆంధ్ర‌ప్ర‌దేశ్ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఊహించ‌ని విజ‌యం అందుకున్న జ‌న‌సేన పార్టీ ఇప్పుడు తెలంగాణ‌లో ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధ‌మ‌వుతోంది. 

PREV
15
తెలంగాణ రాజకీయాల్లో జనసేన ఎంట్రీ..

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో అద్భుత విజయంతో రాజకీయంగా బలపడిన జనసేన పార్టీ ఇప్పుడు తెలంగాణ రాజకీయాల వైపు అడుగులు వేస్తోంది. రానున్న మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తామని అధికారికంగా ప్రకటించడం ద్వారా పవన్ కళ్యాణ్ కొత్త రాజకీయ సందేశం ఇచ్చినట్టు రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఇది కేవలం స్థానిక ఎన్నికల పోటీ మాత్రమేనా..? లేక తెలంగాణలో దీర్ఘకాలిక రాజకీయ వ్యూహానికి తొలి అడుగేనా..? అన్న ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి.

25
మున్సిపల్ ఎన్నికల ద్వారా పార్టీ విస్తరణ

మున్సిపల్ ఎన్నికలను జనసేన ఒక అవకాశంగా మలుచుకోవాలని చూస్తోంది. తక్కువ సమయంలో సాధ్యమైనన్ని స్థానాల్లో అభ్యర్థులను బరిలోకి దింపి, తెలంగాణలో పార్టీ ఉనికిని ప్రజల్లోకి తీసుకెళ్లడమే ప్రాథమిక లక్ష్యంగా కనిపిస్తోంది. ఎన్నికల ఫలితాలకన్నా పార్టీ సంస్థాగత నిర్మాణంపైనే ఎక్కువ దృష్టి పెట్టినట్టు జనసేన వర్గాలు చెబుతున్నాయి. పవన్ కళ్యాణ్ భావజాలం, సిద్ధాంతాలను తెలంగాణ ప్రజలకు పరిచయం చేయడమే ఈ అడుగులో ప్రధాన ఉద్దేశంగా తెలుస్తోంది.

35
పవన్ కళ్యాణ్ టార్గెట్ ఎవ‌రు.?

తెలంగాణ రాజకీయాల్లో ఇప్పటికే కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ మధ్య ట్రైయాంగిల్‌ పోటీ కొనసాగుతోంది. ఈ సమయంలో జనసేన ఎంట్రీ ఏ పార్టీ ఓటు బ్యాంక్‌పై ప్రభావం చూపుతుందనే చర్చ మొదలైంది. రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం.. జనసేన ప్రత్యక్షంగా ఏ పార్టీని లక్ష్యంగా చేసుకోకుండా, అసంతృప్త వర్గాలు, యువత, కొత్త రాజకీయ ప్రత్యామ్నాయం కోరుకునే ఓటర్లపై దృష్టి పెట్టే అవకాశం ఉంది. దీర్ఘకాలంలో ఇది ప్రధాన పార్టీలకు హెచ్చరికగా మారవచ్చని అంటున్నారు.

45
బీజేపీతో సంబంధాలు ఎలా ఉండబోతున్నాయి?

ఆంధ్రప్రదేశ్‌లో మిత్రులుగా ఉన్న బీజేపీ, జనసేన పార్టీలు తెలంగాణలో కలిసి పోటీ చేస్తాయా..? లేక విడివిడిగా బరిలోకి దిగుతాయా..? అన్నది కీలక ప్రశ్నగా మారింది. ప్రస్తుతం జనసేన ఒంటరిగా పోటీ చేయడంపైనే దృష్టి పెట్టినట్టు సంకేతాలు కనిపిస్తున్నాయి. బీజేపీ కూడా తెలంగాణలో స్వతంత్రంగా బలం పెంచుకునే ప్రయత్నంలో ఉంది.

55
తెలంగాణలో దీర్ఘకాల రాజకీయ ప్లాన్‌కు బీజం

పవన్ కళ్యాణ్ ఇటీవల కొండగట్టులో పర్యటించి జనసేన కేడర్‌లో ఉత్సాహం నింపారు. అప్పుడే తెలంగాణపై తన దృష్టిని స్పష్టంగా చూపించినట్టు భావిస్తున్నారు. మున్సిపల్ ఎన్నికల ద్వారా పార్టీ శ్రేణులను యాక్టివ్ చేయడం, నాయకత్వాన్ని తయారు చేయడం, భవిష్యత్తులో అసెంబ్లీ స్థాయి రాజకీయాలకు పునాది వేయడమే అసలు టార్గెట్‌గా కనిపిస్తోంది. ఈ కోణంలో చూస్తే.. జనసేన ఎంట్రీ తెలంగాణ రాజకీయాలను వచ్చే రోజుల్లో మరింత ఆసక్తికరంగా మార్చడం ఖాయమనే అభిప్రాయం వినిపిస్తోంది.

Read more Photos on
click me!

Recommended Stories