హైదరాబాద్‌లో మ‌రో కొత్త షాపింగ్ మాల్‌.. న‌గ‌రం న‌డిబొడ్డున దేశంలోనే తొలి ఏఐ మాల్‌, ఎక్క‌డో తెలుసా.?

Published : Jan 11, 2026, 07:22 AM IST

Hyderabad: హైద‌రాబాద్‌లో మ‌రో కొత్త షాపింగ్ మాల్ వ‌చ్చేసింది. న‌గ‌రంలో సినిమాల‌కు పెట్టింది పేరైన ఆర్టీసీ క్రాస్ రోడ్డులోని ఓడియ‌న్ థియేట‌ర్ స్థ‌లంలో ఈ మాల్‌ని నిర్మించారు. ఈ మాల్ విశేషాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. 

PREV
15
హైదరాబాద్ నడిబొడ్డున కొత్త వినోద కేంద్రం

హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్‌రోడ్స్ ప్రాంతంలో మరో ఆధునిక మాల్ ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. చరిత్రాత్మక ఓడియన్ థియేటర్ స్థలంలో నిర్మించిన ఓడియన్ మాల్‌ను తెలంగాణ‌ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శ‌నివారం ప్రారంభించారు. నగరం న‌డిబొడ్డున ఈ స్థాయి మాల్ ప్రారంభం కావడం హైదరాబాద్‌కు మరో ప్రత్యేకతగా మారింది. ప్రారంభ కార్యక్రమంలో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు సహా పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

25
దేశంలోనే తొలి ఏఐ ఆధారిత మల్టీప్లెక్స్

ఓడియన్ మాల్ దేశంలోనే తొలి కృత్రిమ మేథస్సు ఆధారిత మల్టీప్లెక్స్‌గా గుర్తింపు పొందింది. టికెట్ ధృవీకరణకు ఫేస్ రికగ్నిషన్ టెక్నాలజీ వినియోగిస్తున్నారు. సందర్శకులకు అవసరమైన సమాచారం అందించేందుకు రోబోటిక్ సర్వీసులు ఏర్పాటు చేశారు. టికెటింగ్ నుంచి ఫుడ్ ఆర్డర్ల వరకూ టెక్నాలజీ కీలక పాత్ర పోషిస్తోంది.

35
సినిమాలకు కొత్త అనుభూతి

సినిమా ప్రదర్శనకు ఇక్కడ అత్యాధునిక సాంకేతికతను అందించారు. 4కే లేజర్ ప్రొజెక్షన్ స్క్రీన్లు, డాల్బీ అట్మోస్ సౌండ్ సిస్టమ్ ద్వారా ప్రేక్షకులకు మ‌రింత మెరుగైన‌ థియేటర్ అనుభూతి ఇవ్వ‌నుంది. మల్టీప్లెక్స్‌లో సీటింగ్ సౌకర్యాలు కూడా అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా రూపొందించారు.

45
షాపింగ్, ఫుడ్, గేమింగ్ అన్నీ ఒకేచోట

ఈ మాల్ కేవలం సినిమాలకే పరిమితం కాదు. ఇత‌ర షాపింప్ మాల్‌ తరహాలో అంతర్జాతీయ బ్రాండ్ల షోరూమ్‌లు అందుబాటులోకి వచ్చాయి. విస్తృతమైన ఫుడ్ కోర్ట్‌లో విభిన్న రకాల వంటకాలు లభిస్తాయి. చిన్నారుల కోసం ప్రత్యేకంగా గేమింగ్ జోన్ ఏర్పాటు చేశారు. కుటుంబమంతా ఒకేచోట సమయం గడిపేలా ఈ మాల్ రూపకల్పన చేశారు.

55
భారీ పార్కింగ్ సౌకర్యం

ఆర్టీసీ క్రాస్‌రోడ్స్ రద్దీని దృష్టిలో ఉంచుకుని భారీ మల్టీ లెవల్ పార్కింగ్ సదుపాయం కల్పించారు. దీని వల్ల ట్రాఫిక్ సమస్య కొంతవరకు తగ్గే అవకాశం ఉంది. పాత ఓడియన్ థియేటర్ గుర్తింపును కొనసాగిస్తూ ఆధునిక రూపం ఇవ్వడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

Read more Photos on
click me!

Recommended Stories