ల‌క్ష‌ల్లో జీతం వ‌చ్చే కోర్సులు.. ప‌దో త‌ర‌గ‌తి పాస్ అయితే చాలు. ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం

Published : Aug 21, 2025, 03:51 PM IST

సాధార‌ణంగా ల‌క్ష‌ల్లో జీతాలు వ‌చ్చే ఉద్యోగాల‌ను పొందాలంటే బీటెక్‌, ఎంటెక్‌లు వంటి కోర్సులు చేయాల‌ని భావిస్తారు. కానీ తెలంగాణ ప్ర‌భుత్వం పదో త‌ర‌గ‌తి పూర్తి చేసిన వారికి కూడా అత్యాధునిక కోర్సులు చేసే అవ‌కాశం క‌ల్పిస్తోంది. వివ‌రాల్లోకి వెళితే.. 

PREV
16
తెలంగాణలో అత్యాధునిక కోర్సులు

పదో తరగతి పూర్తి చేసిన తర్వాత చదువు కొనసాగించలేకపోయినా, భవిష్యత్తుపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలంగాణ ప్రభుత్వం చెబుతోంది. రాష్ట్రంలో పరిశ్రమల అవసరాలకు తగ్గ నైపుణ్యాలను కల్పించేందుకు టాటా గ్రూప్‌ సహకారంతో 65 అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్లు (ATCs) ఏర్పాటు చేసింది. ఈ ప్రాజెక్టు కోసం దాదాపు రూ.5 వేల కోట్లు ఖ‌ర్చు చేయ‌నున్నారు.

26
ఆధునిక సెంటర్లలో ప్రత్యేక శిక్షణ

ఈ ఏటీసీల్లో కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వాలు, టాటా గ్రూప్‌ కలిసి రూపొందించిన ఆరు ప్రపంచ స్థాయి కోర్సులు అందుబాటులో ఉన్నాయి. పదో తరగతి అర్హత ఉన్నవారు ఎవరైనా ఈ కోర్సులకు దరఖాస్తు చేసుకోవచ్చు. టాటా మాస్టర్ ట్రైనర్లు, ప్రభుత్వ ఐటీఐ ట్రైనింగ్ ఆఫీసర్లు కలిసి శిక్షణ ఇస్తారు. విద్యార్థులు నూతన యంత్రాలపై ప్రాక్టికల్ ట్రైనింగ్ పొందే అవకాశం ఉంటుంది.

36
శిక్షణతో పాటు ఉద్యోగ భరోసా

కోర్సు సమయంలోనే ఆన్-జాబ్ ట్రైనింగ్, స్టైపెండ్, అప్రెంటీషిప్ వంటి ప్రయోజనాలు ఉంటాయి. శిక్షణ పూర్తయిన తర్వాత ప్రముఖ పరిశ్రమల్లో 100% ప్లేస్‌మెంట్ భరోసా కల్పిస్తామని ప్రభుత్వం హామీ ఇస్తోంది.

46
రెండు సంవత్సరాల కోర్సులు

* అడ్వాన్స్‌డ్ CNC మెషినింగ్ టెక్నీషియన్ – CNC మెషిన్ల ఆపరేషన్, ప్రోగ్రామింగ్, ప్రొడక్ట్ డెవలప్‌మెంట్‌పై శిక్షణ. తయారీ రంగంలో విస్తృత అవకాశాలు ఉంటాయి.

* మెకానిక్ ఎలక్ట్రిక్ వెహికల్ – టూ వీలర్స్‌ నుంచి హెవీ వాహనాల వరకు అసెంబ్లింగ్, రిపేర్, ట్రబుల్‌షూటింగ్‌పై శిక్షణ. ప్రముఖ EV కంపెనీల్లో ఉద్యోగ అవకాశాలు పొందొచ్చు.

* బేసిక్ డిజైనర్ & వర్చువల్ వెరిఫయర్ – B.Tech స్థాయి కోర్సు. ANSYS, CAE సాఫ్ట్‌వేర్‌లతో డిజైనింగ్, ప్రొడక్ట్ వెరిఫికేషన్ శిక్షణ. ఈ కోర్సు చేసిన వారికి ఆటోమొబైల్, మ్యానుఫ్యాక్చరింగ్ రంగాల్లో అవకాశాలు ల‌భిస్తాయి.

56
ఒక సంవత్సరం కోర్సులు

* ఇంజినీరింగ్ డిజైన్ టెక్నీషియన్ – 3D ప్రింటింగ్, CAD/CAM, CNC మిల్లింగ్, ఆర్టిస్టిక్ డిజైన్‌ శిక్షణ. ఆటోమొబైల్, ఆర్కిటెక్చర్, ప్యాకేజింగ్, టెక్స్‌టైల్, ఎయిరోస్పేస్ రంగాల్లో డిమాండ్ ఉంటుంది.

* ఇండస్ట్రియల్ రోబోటిక్స్ & డిజిటల్ మాన్యుఫ్యాక్చరింగ్ – రోబోటిక్ మెషిన్ల ప్రోగ్రామింగ్, ఆటోమేషన్‌పై శిక్షణ. అన్ని రకాల తయారీ సంస్థల్లో అవకాశాలు ల‌భిస్తాయి.

* మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ కంట్రోల్ & ఆటోమేషన్ – PLC, SCADA, HMI సాఫ్ట్‌వేర్‌లపై శిక్షణ. ఈ కోర్సు చేసిన వారికి ఆహార పరిశ్రమ, ప్యాకేజింగ్ రంగాల్లో మంచి ఉద్యోగ అవకాశాలు ల‌భిస్తాయి.

66
అడ్మిషన్ల వివరాలు

* పూర్తి వివ‌రాల కోసం అధికారిక వెబ్‌సైట్‌ను సంద‌ర్శించండి. 

* లేదా దగ్గరలోని ప్రభుత్వ ఐటీఐ/ఏటీసీ సెంటర్‌లో నేరుగా స్పాట్ అడ్మిషన్లు అందుబాటులో ఉన్నాయి.

* దరఖాస్తులకు చివరి తేదీ ఆగస్టు 28.

* మరిన్ని వివరాల కోసం 08069434343 ఈ నెంబ‌ర్‌కి కాల్ చేయండి. 9703331914 ఈ నెంబ‌ర్ ద్వారా వాట్సాప్‌లో సంప్ర‌దించండి.

Read more Photos on
click me!

Recommended Stories