Hyderabad: 100 ఎక‌రాల్లో రూ. 2580 కోట్ల ఖ‌ర్చుతో.. హైద‌రాబాద్‌లో మ‌రో అద్భుత నిర్మాణం.

Published : May 27, 2025, 06:08 PM IST

ఎన్నో చారిత్ర‌క‌, అధునాత‌న క‌ట్ట‌డాల‌కు నెల‌వైన హైద‌రాబాద్‌లో మ‌రో అద్భుత నిర్మాణం దిశ‌గా అడుగులు పప‌డుతున్నాయి. ఇందులో భాగంగానే తాజాగా ఈ నిర్మాణం దిశ‌గా కీల‌క ముంద‌డుగు ప‌డింది.

PREV
15
కొత్త హైకోర్ట్ భ‌వ‌నం:

తెలంగాణ‌లో కొత్త హైకోర్ట్ భ‌వ‌న నిర్మాణం దిశగా కీలక ముందడుగు పడింది. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌లోని వ్యవసాయ విశ్వవిద్యాలయం భూమిలో 100 ఎకరాలను ఈ ప్రాజెక్ట్‌కు కేటాయించారు. ఈ భారీ నిర్మాణానికి రూ.2,583 కోట్ల అంచనా వ్యయంతో డీఈసీ ఇన్ ఫ్రా సంస్థ కాంట్రాక్టు దక్కించుకుంది.

25
టెండర్‌ ద‌క్కించుకున్న డీఈసీ:

గత సంవత్సరం డిసెంబరులో లా సెక్రటరీ తిరుపతి జీవో విడుదల చేయడంతో, నిర్మాణానికి అడ్మినిస్ట్రేటివ్ అనుమతి లభించింది. ఆ తర్వాత ఆర్‌అండ్‌బీ శాఖ టెండర్లు పిలిచింది. అందులో డీఈసీ ఇన్ ఫ్రా, ఎన్సీసీ మాత్రమే దరఖాస్తు చేయగా, కమిషనర్ ఆఫ్ టెండర్స్ ముందు డీఈసీ అర్హత సాధించి కాంట్రాక్టును పొందింది.

35
నిర్మాణ వ్యయం:

సివిల్ నిర్మాణం కోసం రూ.1,980 కోట్లు. ఫర్నిచర్, ఇతర సదుపాయాల కోసం రూ.603 కోట్లు కేటాయించున‌న్నారు. ఈ టెండర్‌ను రూ.1,443 కోట్లకు (GST మినహాయించి) పిలవగా, డీఈసీ 4.95% అధికంగా కోట్ చేసి టెండర్ గెలుచుకుంది. తెలంగాణ సచివాలయ నిర్మాణానికి రూ. 600 కోట్లు ఖర్చు చేసిన విషయం తెలిసిందే.

డిజైన్ తుది ఎంపిక:

నిర్మాణానికి సంబంధించిన వివరాల ప్రణాళిక (DPR) తయారీ బాధ్యతను వన్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ చేపట్టింది. వారు రూపొందించిన పలు డిజైన్లను హైకోర్టు చీఫ్ జస్టిస్ ఆధ్వర్యంలోని జడ్జిల కమిటీ ముందు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. కమిటీ ఒక డిజైన్‌ను తుదింగా ఎంపిక చేసింది.

45
అత్యాధునిక స‌దుపాయ‌ల‌తో:

* ప్రధాన కోర్టు భవనం: 6 అంతస్తులు, 8.4 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణం

* జడ్జిల కోర్టులు: ప్రస్తుతం 29 మంది ఉన్నా, భవిష్యత్తు అవసరాల కోసం 60 మందికి సరిపడా కోర్టులు

* ప్రధాన న్యాయమూర్తి బంగ్లా, జడ్జిల నివాసాలు, స్టాఫ్ క్వార్టర్లు, అడ్మిన్ బ్లాకులు

* బార్ కౌన్సిల్ భవనం, లైబ్రరీలు, రికార్డుల భద్రతకోసం ప్రత్యేక బ్లాకులు

* ఆడిటోరియం: 42,500 చదరపు అడుగుల్లో

* పార్కింగ్: 3,000 బైకులు, 1,500 కార్లకు ప్రత్యేక ఏర్పాట్లు

* మొత్తం భవనాలు: 40

55
ప్ర‌జ‌ల సౌక‌ర్యార్థం ప్ర‌త్యేక ఏర్పాట్లు:

న్యాయస్థానానికి వచ్చే ప్రజల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని, గ్రౌండ్ ఫ్లోర్‌తో పాటు మరో రెండు అంతస్తుల్లో 1.63 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మాణాలు చేపడుతున్నారు. పచ్చదనం కోసం ల్యాండ్ స్కేపింగ్, చెట్లు, మొక్కలను పెంచ‌నున్నారు.

ఈ ప్రాజెక్టుతో తెలంగాణ న్యాయవ్యవస్థకు అవసరమైన మౌలిక సదుపాయాలు పెద్దఎత్తున మెరుగవుతాయని అధికారులు అభిప్రాయపడుతున్నారు. కొత్త హైకోర్టు పూర్తయిన తర్వాత తెలంగాణ న్యాయరంగ చరిత్రలో కీలక మైలురాయిగా నిలవనుంది.

Read more Photos on
click me!

Recommended Stories