తెలంగాణలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కాళేశ్వరం ఈ మధ్య 12 రోజులపాటు సరస్వతీ పుష్కరాల సందడితో కళకళలాడింది. పుష్కరాల చివరి రోజు అయిన సోమవారం సాయంత్రానికి ఈ మహా ఉత్సవం వైభవంగా ముగిసింది.
25
ఇతర రాష్ట్రాల నుంచి
మొత్తం 30 లక్షల మంది భక్తులు పుణ్యస్నానాలు చేసి తమ మొక్కులు తీర్చుకున్నారు. ఈ సందర్బంగా తెలంగాణ రాష్ట్రంతో పాటు ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ తదితర రాష్ట్రాల నుండి కూడా భక్తులు భారీ సంఖ్యలో కాళేశ్వరం చేరుకున్నారు.
35
రూ. 8 కోట్ల ఆదాయం
తెలంగాణ ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. రాష్ట్రంలోని అనేక ప్రాంతాల నుంచి ప్రత్యేక బస్సులు నడిపింది. ఒక్క ఈ పుష్కరాల కారణంగా ఆర్టీసీకి 12 రోజుల వ్యవధిలో సుమారు రూ. 8 కోట్ల ఆదాయం లభించింది.
కరీంనగర్, ఆదిలాబాద్, హైదరాబాద్ నుంచి ప్రత్యేక బస్సులు నడిపారు. మొత్తం 8,419 బస్సు ట్రిప్పులు నిర్వహించగా, వీటిలో 4,63,691 మంది ప్రయాణికులు ప్రయాణించారు.
55
65 వేల మందికి పైగా
ముగింపు రోజు అయిన సోమవారం 65 వేల మందికి పైగా బస్సుల్లో కాళేశ్వరం చేరినట్లు అధికారులు వెల్లడించారు.