Hyderabad: హైద‌రాబాద్‌లో వింత ప‌రిస్థితి.. అంద‌రి చూపు అటువైపే, అక్క‌డే ఎందుకు పెట్టుబ‌డి పెడుతున్నారు?

Published : May 27, 2025, 12:55 PM IST

500 ఏళ్ల చ‌రిత్ర ఉన్న హైద‌రాబాద్‌కు ఎంతో మంది జీవ‌నోపాధి కోసం వ‌స్తుంటారు. తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా దేశ న‌లుమూల‌ల నుంచి సిటీకి పెద్ద ఎత్తున ప్ర‌జ‌లు వ‌స్తుంటారు. ఈ నేప‌థ్యంలోనే హైద‌రాబాద్ రియ‌ల్ ఎస్టేట్ ఓ రేంజ్‌లో పెరిగింది. 

PREV
15
మిడిల్ సిటీపై త‌గ్గుతోన్న ఆస‌క్తి:

హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ ఇబ్బందులు, వాయు కాలుష్యం కారణం ఏదైనా సిటీ మ‌ధ్య‌లో నుంచి జ‌నాలు న‌గ‌ర శివార్ల‌కు చేరుకుంటున్నారు. రోజురోజుకీ రద్దీ, శబ్ద కాలుష్యం నగరవాసులను కలవరపెడుతున్నాయి. దీంతో న‌గ‌ర శివార్ల‌కు వెళ్లేందుకు ఇష్ట‌ప‌డుతున్నారు.

25
ప్ర‌ధాన కార‌ణాలు:

న‌గ‌ర శివారుల్లో త‌క్కువ ధ‌ర‌కే అపార్ట్‌మెంట్‌లో ఫ్లాట్స్ ల‌భిస్తుండ‌డం, అంతేకాకుండా త‌క్కువ ధ‌ర‌కే ఇండిపెండెంట్ విల్లాలు ల‌భిస్తుండ‌డంతో ఎక్కువ మందిని న‌గ‌రానికి దూరంగా వెళ్తున్నారు. న‌గ‌ర శివారుల్లో హోట‌ల్స్‌, షాపింగ్ మాల్స్, పెద్ద పెద్ద స్కూళ్లు అందుబాటులోకి వ‌స్తుండ‌డంతో ఎక్కువ మంది ఆస‌క్తి చూపిస్తున్నారు.

35
పాత ఫ్లాట్లకు త‌గ్గుతున్న డిమాండ్‌:

హిమాయత్ నగర్, చిక్కడపల్లి, ముషీరాబాద్, అశోక్ నగర్, రాంనగర్, నారాయణగూడ, కాచిగూడ, తార్నాక, మెహదీపట్నం, బేగంపేట, సికింద్రాబాద్, నిజాంపేట, ప్రగతినగర్ వంటి ప్రధాన ప్రాంతాల్లో పాత ఫ్లాట్ల అమ్మ‌కాలు త‌గ్గుతున్నాయి. చదరపు అడుగు రూ. 4000కు దిగి వచ్చినా కొనుగోలుదారుల ఆసక్తి కనిపించడం లేదు. ఇటీవలి కాలంలో చాలామంది మధ్య సిటీలో ఉన్న ఫ్లాట్లను విక్రయించాలని చూస్తున్నా, అడిగే ధరకు కొనేవాళ్లు ఉండ‌డం లేదు.

45
ఏయే ప్రాంతాల్లో డిమాండ్ పెరుగుతోందంటే.

పటాన్‌చెరు, శంకర్‌పల్లి, కండ్లకోయ, శామీర్‌పేట, మేడ్చల్ వంటి న‌గ‌రాల అవ‌త‌ల డిమాండ్ పెరుగుతోంది. అవుట‌ర్ రింగ్ రోడ్డుకు స‌మీపంలో ఉండ‌డంతో ఐటీ ఉద్యోగులు సైతం త్వ‌ర‌గా కార్యాల‌యాల‌కు చేరుకుంటున్నారు. ఈ కార‌ణంగానే ఈ ప్రాంతాల్లో విల్లాలు కొనుగోలు చేస్తున్న వారి సంఖ్య పెరుగుతోంది.

55
మెట్రో విస్త‌ర‌ణ కూడా క‌లిసొస్తుంది:

అవుట‌ర్ రింగ్ రోడ్డు చుట్టు ప‌క్క‌ల డిమాండ్ పెర‌గ‌డానికి మ‌రో ప్ర‌ధాన కారణం మెట్రో విస్త‌ర‌ణ అని కూడా చెప్పొచ్చు. మెట్రో 2.0లో భాగంగా ప‌టాన్‌చెరు, మేడ్చ‌ల్‌, శామిర్‌పేట వ‌ర‌కు మెట్రోను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు స‌న్నాహాలు చేస్తున్నారు. దీంతో ఈ ప్రాంతాల‌కు అనూహ్యంగా డిమాండ్ పెరుగుతోంది.

Read more Photos on
click me!

Recommended Stories