ఏ చిన్న విషయం అయినా సరే మొదట సోషల్ మీడియాలో పోస్ట్ చేయాలి. ఇప్పడు చాలా మందికి ఈ అలవాటు కామన్‌గా మారిపోయింది. ఉదయం టిఫిన్ మొదలు రాత్రి డిన్నర్ వరకు అన్ని అప్డేట్స్ పోస్ట్ చేయాల్సిందే. అయితే ఈ ట్రెండ్‌ను కేవలం సామాన్యులే కాదు సెలబ్రిటీలు సైతం ఫాలో అవుతున్నారు. చివరికి రాజకీయ నాయకులు సైతం ఫాలో అవుతున్నారు. తాజాగా ఓ రాజకీయ నాయకుడి ఫొటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.
ఆయన పేరు చెబితే ఎక్కడ లేని ఉత్సాహం వస్తుంది. ఆయన మాటలు వింటుంటే అలాగే వినాలనిపిస్తుంటుంది. ఒకప్పుడు సైకిల్ మీద పాల క్యాన్లతో వ్యాపారం మొదలు పెట్టిన ఆ వక్తి, నేడు కొన్ని వేల కోట్ల విద్యా సంస్థలకు అధిపతిగా ఎదిగారు. ఎంపీగా గెలిచారు, మంత్రిగా పని చేశారు. ఈపాటికే ఈయన ఎవరో మీకు ఓ క్లారిటీ వచ్చేసే ఉంటుంది. అవును పైన ఫొటోలో కనిపిస్తున్న వ్యక్తి మరెవరో కాదు మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి.
23
Malla Reddy Japan Tour photos
ఎప్పుడూ నవ్వుతూ, నవ్విస్తూ సందడి సందడి చేసే మల్లారెడ్డి ప్రస్తుతం జపాన్ పర్యటనలో ఉన్నారు. కుటుంబ సభ్యులతో హాలీడే ఎంజాయ్ చేస్తున్నారు. అక్కడ పలు పర్యాటక ప్రదేశాలను సందర్శిస్తూ సందడి చేస్తున్నారు. తాజాగా మల్లారెడ్డి జపాన్ టూర్‌కు సంబంధించిన కొన్ని ఫొటోలు నెట్టింట తెగ ట్రెండ్ అవుతున్నాయి. ఇందులో భాగంగా టోక్యో నగరంలో జరిగిన జాపనీస్ సంప్రదాయ టీ కార్యక్రమంలో మల్లారెడ్డి దంపతులు పాల్గొన్నారు. వెరైటీ డ్రెస్సులు వేసుకుని ఫోటోలకు ఫోజులు ఇచ్చారు.
33
Malla Reddy Japan Tour photos
అంతకుముందు ఎమ్మెల్యే మల్లారెడ్డి బుల్లెట్ ట్రైన్ ఎక్కి అందులో కొద్ది దూరం ప్రయాణించారు. ట్రైన్ ఎక్కడానికి ముందు బుల్లెట్ రైలు ఎదుట ఆయన దిగిన ఫొటోలను తన ఎక్స్ ఖాతాలో పంచుకున్నారు. మల్లారెడ్డి ఇంకొన్ని రోజులు జపాన్‌లోనే ఉండనున్నారని సమాచారం. అయితే బీఆర్‌ఎస్ పార్టీ రజతోత్సవం సందర్భంగా ఈనెల 27న వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నారు. ఈ సభ జరిగే సమయానికి మల్లారెడ్డి హైదరాబాద్‌కు వచ్చే అవకాశాలు ఉన్నాయని సమాచారం. మొత్తం మీద మాస్ మల్లన్న ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తున్నారు.