ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ బిఅలర్ట్ .. మీకు ఇదే చివరి అవకాశం..!

Published : Dec 03, 2025, 05:29 PM IST

Telangana Intermediate Exams 2026 :  తెలంగాణలో ఇంటర్మీడియట్ పరీక్షల షెడ్యూల్ వచ్చేసింది. ఇప్పటికే ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవుతున్న విద్యార్థులకు కీలక సమాచారం…

PREV
14
తెలంగాణ ఇంటర్ పరీక్షలు

Telangana Intermediate Exams : తెలంగాణలో ఇంటర్మీడిట్ చదివే విద్యార్థులకు ఎగ్జామ్ ఫీజు చెల్లించేందుకు చివరి అవకాశం. గత నెల (నవంబర్ 2025) లోనే పరీక్ష ఫీజు చెల్లించేందుకు అవకాశం ఇచ్చింది తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డ్ (Telangana Board of Intermediate Education)... అయితే ఏదైనా కారణాలతో ఇప్పటివరకు ఫీజు చెల్లించలేకపోయిన విద్యార్థులకు చివరి అవకాశం కల్పించింది. డిసెంబర్ 15 లోపు రూ.2000 ఆలస్య రుసుముతో ఇంటర్ ఫస్ట్, సెకండ్ ఇయర్ విద్యార్థులు ఫీజు చెల్లించేందుకు మరో అవకాశం కల్పించింది.

24
ఇంటర్ ఫీజు చెల్లింపుకు చివరి అవకాశం

ఈ అకడమిక్ ఇయర్ (2025-26) ఇంటర్మీడియట్ పరీక్షలు ఫిబ్రవరి 2026 లో ప్రారంభం కానున్నాయి. మొదట ప్రాక్టీకల్స్, తర్వాత థియరీ పరీక్షలు జరగనున్నాయి. ఈ పరీక్షకు హాజరయ్యే విద్యార్థులంతా ఇప్పటికే ఫీజు చెల్లించివుండాలి... ఈ ప్రక్రియ చివరి దశకు చేరుకుంది.

నవంబర్ 1న తెలంగాణ ఇంటర్మీడియట్ విద్యార్థుల నుండి ఎగ్జామ్ ఫీజు తీసుకోవడం ప్రారంభించింది బోర్డ్. నవంబర్ 14 వరకు ఎలాంటి లేట్ ఫీజు లేకుండా ఎగ్జామ్ ఫీజు చెల్లించే అవకాశం కల్పించింది. తర్వాత ఆలస్య రుసుములతో ఫీజు చెల్లించేందుకు అవకాశమిచ్చింది.

నవంబర్ 16 నుండి 24 వరకు రూ.100 లేట్ ఫీజుతో చెల్లించే అవకాశం కల్పించింది. నవంబర్ 26 నుండి డిసెంబర్ 1 వరకు రూ.500 లేట్ ఫీజుతో చెల్లించే అవకాశమిచ్చింది. ఇక ప్రస్తుతం అంటే డిసెంబర్ 3 నుండి 8 వరకు రూ.1000 లేట్ ఫీజుతో చెల్లించవచ్చు. తర్వాత డిసెంబర్ 10 నుండి 15 వరకు రూ.2000 ఆలస్య రుసుముతో ఎగ్జామ్ ఫీజు చెల్లించుకోవచ్చు. ఇదే చివరి అవకాశం... తర్వాత లేట్ ఫీజుతో కూడా ఎగ్జామ్ ఫీజు చెల్లించలేరు.

34
ఇంటర్ ఎగ్జామ్ ఫీజు వివరాలు

ఫస్ట్ ఇయర్ జనరల్ - రూ.530

ఫస్ట్ ఇయర్ ఇంగ్లీష్ ప్రాక్టికల్స్ - రూ.100

ఫస్ట్ ఇయర్ ఒకేషనల్ (థియరీ 530 + ప్రాక్టికల్స్ 240 + ఇంగ్లీష్ ప్రాక్టికల్స్ 100) - మొత్తం రూ.870

సెకండ్ ఇయర్ జనరల్ ఆర్ట్స్ - రూ.530

సెకండ్ ఇయర్ ఇంగ్లీష్ ప్రాక్టికల్స్ - రూ.100

సెకండ్ ఇయర్ జనరల్ సైన్స్ - రూ.870 (థియరీ 530 + ప్రాక్టికల్స్ 240 + ఇంగ్లీష్ ప్రాక్టికల్స్ 100)

సెకండ్ ఇయర్ ఒకేషనల్ - రూ.870 (థియరీ 530 + ప్రాక్టికల్స్ 240 + ఇంగ్లీష్ ప్రాక్టికల్స్ 100)

44
తెలంగాణ ఇంటర్ పరీక్షల షెడ్యూల్

తెలంగాణ ఇంటర్మీడియట్ విద్యార్థులకు ప్రాక్టికల్ పరీక్షలు 02 ఫిబ్రవరి 2026 నుండి ప్రారంభం అవుతాయి… 21 ఫిబ్రవరి 2026 న ముగుస్తాయి. రోజు ఉదయం 9AM నుండి 12PM వరకు ఓ సెషల్, మధ్యాహ్నం 2PM నుండి 5PM వరకు మరో సెషల్ ఉంటుంది. 21 జనవరి 2026 ఫస్ట్ ఇయర్, 22 జనవరి 2026 సెకండ్ ఇయర్ ఇంగ్లీష్ ప్రాక్టికల్ ఉంటుంది. 23, 24 జనవరి 2026 తేదీల్లో ఎథిక్స్ ఆండ్ హ్యూమన్ వాల్యూస్, ఎన్విరాన్మెంటల్ పరీక్షలు ఉంటాయి.

25 ఫిబ్రవరి 2026 నుండి థియరీ పరీక్షలు ప్రారంభం అవుతాయి... ఓరోజు ఫస్ట్ ఇయర్, మరోరోజు సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ ఉంటాయి. ఇలా మార్చి 18, 2026 వరకు ఇంటర్మీడియట్ పరీక్షలు జరుగుతాయి... ఈ మేరకు ఇప్పటికే షెడ్యూల్ ప్రకటించింది ఇంటర్ బోర్డ్. ఈ పరీక్షలకు హాజరు కావాలంటే తప్పకుండా ఫీజు చెల్లించివుండాలి.

Read more Photos on
click me!

Recommended Stories