Telangana: ఒకే వ్యక్తితో తల్లి, కూతుళ్ల వివాహేతర సంబంధం.. తెలంగాణలో హనీమూన్ తరహా సంఘటన.

Published : Jun 23, 2025, 12:33 PM IST

సమాజంలో జరుగుతోన్న కొన్ని సంఘ‌ట‌న‌లు చూస్తుంటే మ‌నిషి ఎంత‌లా దిగ‌జారుతున్నాడో అర్థ‌మ‌వుతోంది. నైతిక విలువ‌ల‌ను ప్ర‌శ్నార్థ‌కంగా మారుస్తున్నాయి. కొన్ని రోజుల క్రితం మేఘాలయలో జరిగిన హనీమూన్ మర్డర్ మరిచిపోకముందే తాజాగా తెలంగాణ‌లోనూ చోటు చేసుకుంది. 

PREV
15
పెళ్లికి ముందు నుంచే వివాహేతర సంబంధం

జోగుళాంబ గద్వాల జిల్లాకు చెందిన తేజేశ్వర్ అనే యువకుడు ప్రైవేటు సర్వేయర్‌గా పనిచేస్తున్నాడు. అతనికి కర్నూలు జిల్లా చెందిన ఐశ్వర్య అనే యువతితో ఫిబ్రవరి 13న పెళ్లి నిశ్చయమైంది. కానీ పెళ్లికి ముందు ఐశ్వ‌ర్య ఎవ‌రికీ క‌నిపించ‌కుండా పోయింది.

ఆమెకు ఒక బ్యాంకు ఉద్యోగితో సంబంధం ఉందన్న వార్తలు అప్పటికే చక్కర్లు కొట్టాయి. అయితే మూడురోజుల తర్వాత ఇంటికి తిరిగొచ్చిన ఐశ్వర్య, తేజేశ్వర్‌ను ఫోన్‌లో భావోద్వేగంగా మాట్లాడింది. తాను ఎవరితోనూ ప్రేమలో లేనని, క‌ట్నం విష‌యంలో అమ్మ‌కు ఇబ్బంది అవుతుంద‌న్న కార‌ణంతోనే స్నేహితురాలి ఇంటికి వెళ్లాన‌ని చెప్పింది.

25
తల్లిదండ్రుల అభ్యంతరాల మధ్యే పెళ్లి

దీంతో తేజేశ్వ‌ర్ పేరెంట్స్ ఈ పెళ్లికి స‌సేమిరా అన్నారు. అయితే అత‌ను మాత్రం ఐశ్వ‌ర్య మాట‌లు పూర్తిగా న‌మ్మి.. తల్లిదండ్రుల అభ్యంతరాన్ని పట్టించుకోకుండా మే 18న ఆమెను వివాహం చేసుకున్నాడు. 

కానీ పెళ్లైన కొద్ది రోజుల్లోనే అసలు రంగు బయటపడింది. ఐశ్వర్య తరచూ ఫోన్‌లో బిజీగా ఉండటంతో భార్యాభర్తల మధ్య విభేదాలు మొద‌ల‌య్యాయి. పెళ్లైన రెండో రోజు నుంచే త‌న‌ను దూరం పెట్ట‌డం ప్రారంభించింది.

35
అదృశ్యమైన తేజేశ్వర్

ఇదిలా ఉన్న క్ర‌మంలోనే జూన్ 17న తేజేశ్వర్ అదృశ్యమ‌య్యాడు. దీంతో అతడి సోదరుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రంగంలోకి దిగిన పోలీసులు విచార‌ణ చేప‌ట్టగా పాణ్యం సమీపంలో సుగాలిమెట్టు వద్ద అతడి మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. తేజేశ్వ‌ర్ గొంతు కోసి చంపిన‌ట్లు పోలీసులు నిర్ధారించారు.

45
పోలీసుల విచార‌ణ‌లో సంచ‌ల‌న విష‌యాలు

పోలీసులు ఐశ్వర్యను, ఆమె తల్లి సుజాతను విచారించగా సంచలన విషయాలు బయటపడ్డాయి. సుజాత కర్నూలులో ఓ బ్యాంకులో స్వీపర్‌గా పని చేస్తూ అదే బ్యాంకు ఉద్యోగితో సంబంధం పెట్టుకున్నట్టు తెలిసింది. అదే ఉద్యోగి క్రమంగా ఐశ్వర్యతోనూ సంబంధం కొనసాగించాడు. పెళ్లైన తరువాత కూడా ఐశ్వర్య అతడితో 2,000 సార్లు ఫోన్‌లో మాట్లాడినట్టు కాల్ రికార్డుల్లో బయటపడింది.

55
తేజేశ్వ‌ర్ హ‌త్య‌కు ప్లానింగ్

తేజేశ్వర్‌ను హత్య చేయాలనే ఉద్దేశంతో బ్యాంకు ఉద్యోగి తన డ్రైవర్‌తో పాటు మరికొంతమందికి సుపారీ ఇచ్చాడు. 10 ఎకరాల భూమి సర్వే చేయాలని చెప్పి కారులో తీసుకెళ్లి, కారులోనే కత్తులతో దాడి చేసి గొంతుకోసి చంపారు. 

తర్వాత మృతదేహాన్ని పాణ్యం సమీపంలోని అడవిలో పడేశారు. ప్రస్తుతం ఆ ఉద్యోగి పరారీలో ఉండగా, ఐశ్వర్య, ఆమె తల్లి సుజాతను పోలీసులు అరెస్టు చేశారు.

Read more Photos on
click me!

Recommended Stories