Nagadurga : ఈమె జానపద పాటలకు యూట్యూబ్ షేక్.. ఎవరీ నాగదుర్గ..? టాప్ 5 సాంగ్స్ కి వచ్చిన వ్యూస్ ఎన్ని..?

Published : Apr 06, 2026, 04:57 PM IST

మీకు తెలంగాణ జానపద పాటలంటే ఇష్టమా..? అయితే మీకు తప్పకుండా నాగదుర్గ గుత్తా తెలిసే ఉంటుంది. ఈమె పాటలు యూట్యూబ్ లో ఏ స్థాయిలో వ్యూస్ సాధిస్తున్నాయో చూస్తున్నాం. ఈమె గురించి ఆసక్తికరమైన విషయాలు మీకోసం..

PREV
15
నాగదుర్గ స్టెప్పులకు యూట్యూబ్ షేక్ అవ్వాల్సిందే..

Folk Singer Nagadurga : తెలంగాణ జానపద పాటలకు ప్రస్తుతం బాగా ఆదరణ లభిస్తోంది. కేవలం తెలుగు రాష్ట్రాలనే కాదు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపుపొందిన ఫోక్ సాంగ్స్ కూడా ఉన్నాయి. 'రాను బొంబైకీ రాను', 'ఓ పిలగ వెంకటేశు' ఏ స్థాయిలో సెన్సేషన్ సృష్టించాయో చూశాం... ఇవి విదేశీ పబ్స్ లో కూడా ప్లే అయ్యాయి. ఇక తెలుగు సినిమాల్లో కూడా ఫోక్ సాంగ్స్ పెడుతున్నారు... ఇలాంటి పాటలవల్లే సినిమాలు హిట్ అయిన సందర్భాలున్నాయి.

అయితే తెలంగాణ ఫోక్ సాంగ్స్ ను మరో స్థాయికి తీసుకెళుతోంది ఓ అమ్మాయి. ఆమె జానపద పాటలకు పాదం కదిపిందో అంతే సంగతి... యూట్యూబ్ షేక్ అవ్వాల్సిందే. వందలు, వేలు, లక్షలు కాదు కోట్లల్లో వ్యూస్... మంచి ఆదాయం... అందుకే యూట్యూబ్ ఛానల్స్ ఆమెకోసం క్యూ కడుతున్నాయి. ఇంతకూ ఎవరీ నాగదుర్గ..? ఆమె పాటలకు ఎందుకంత క్రేజ్..? ఏ స్థాయిలో వ్యూస్ వస్తున్నాయో తెలుసుకుందాం.

25
ఎవరీ నాగదుర్గ..?

యూట్యూబ్ లో తెలంగాణ జానపద పాటలపై అదిరిపోయే స్టెప్పులేస్తూ అభిమానులను సంపాదించుకుంది నాగదుర్గ. ఈమె స్వస్థలం ఉమ్మడి నల్గొండ జిల్లా అడ్డగూడూరు. అయితే తల్లిదండ్రులు గుత్తా చలపతిరావు, వాసవి దంపతులు ఉద్యోగరిత్యా నల్గొండలో స్థిరపడ్డారు... దీంతో నాగదుర్గ ప్రాథమిక విద్యాభ్యాసం ఇక్కడే సాగింది.

పదో తరగతి వరకు నల్గొండలోనే చదువుకున్న నాగదుర్గ ఇంటర్మీడియట్, డిగ్రీ, పిజి హైదరాబాద్ చేసింది. బిఏ జర్నలిజం పూర్తిచేసిన ఈమె పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ నుండి కూచిపూడిలో పిజి చేసింది. నాట్యంతో పాటు సంగీతం కూడా నేర్చుకుంది. 

35
ఫోక్ డ్యాన్సర్ గా నాగదుర్గ ప్రస్థానం...

శాస్త్రీయ కూచీపూడి నాట్యం నేర్చుకున్న నాగదుర్గ ఫోక్ డ్యాన్స్ వైపు ఎలా వెళ్లింది అనేదే చాలామంది డౌట్. అయితే మొదట కూచీపూడి నాట్యంపైనే ఫోకస్ పెట్టారామె... మంజుభార్గవి వద్ద వర్క్ షాప్ కూడా చేశారు. అయితే 2021 లో అనుకోకుండా ఓ యూట్యూబ్ ఛానల్ రూపొందించిన ఫోక్ సాంగ్ పై డ్యాన్స్ చేసే అవకాశం వచ్చింది. '' తిన్నాతీరం పడతలే, కూసున్నా తీరం పడతలే'' అంటూ సాగే ఈ సాంగ్ యూట్యూబ్ ను షేక్ చేసింది. ఈ ఒక్క పాట 100 మిలియన్ల వ్యూస్ సాధించడంతో నాగదుర్గ క్రేజ్ అమాంతం పెరిగింది.. శాస్త్రీయ నాట్యకారిణి కాస్త ఫోక్ డ్యాన్సర్ గా మారిపోయింది.

45
యూట్యూబ్ ను షేక్ చేసిన నాగదుర్గ టాప్ 5 ఫోక్ సాంగ్స్ ఇవే..
  • ''ఎర్రాఎర్రా రూమాలు కట్టి యాడ పోతున్నావు బావా'' అంటూ సాగే నాగదుర్గ సాంగ్ యూట్యూబ్ లో 377,936,580 వ్యూస్ సాధించింది.
  • ''పేరుగల్ల పెద్దిరెడ్డీ బిడ్డనో ఓ రామ చిలకా'' అంటూ తండ్రి కూతుళ్ల అనుబంధాన్ని తెలుపుతూ సాగే నాగదుర్గ సాంగ్. 118,747,575 సాధించింది. ఈ పాటలో ఆమె డ్యాన్స్, హావభావాలకు ప్రతిఒక్కరూ ఫిదా అవ్వాల్సిందే.
  • ''తిన్నా తీరం పడ్తలే... పడుకున్నా తీరం పడ్తలే'' అంటూ నాగదుర్గ మొదటి వీడియోనే యూట్యూబ్ లో 133,536,339 వ్యూస్ సాధించింది.
  • ''దారిపొంటొస్తున్నాడు దవ్వదవ్వొస్తున్నాడు'' సాంగ్ కు 121,935,379, ఇటీవల వచ్చిన ''మామిడి కోనాలమీద మబ్బులేమొ నిలిచినాయి'' సాంగ్ కి 21,610,513 వ్యూస్ వచ్చాయి.
55
యూట్యూబ్ లో నాగదుర్గ సంచలనం..

ఇలా నాగదుర్గ వీడియోలకు కోట్లల్లో వ్యూస్ వస్తున్నాయి... దీంతో ఇప్పుడు ఈమె సెలబ్రిటీగా మారిపోయింది. ఇప్పటివరకు 300 పైగా జానపద పాటల్లో నటించింది... ఇందులో అత్యధిక పాటలకు కోట్లల్లో వ్యూస్ వచ్చాయి. తెలంగాణ బిడ్డ మన జానపద పాటలను మరోస్థాయికి తీసుకెళుతూ శభాష్ అనిపించుకుంటోంది. ఇలాంటి మరెన్నో పాటలు తననుండి వస్తూనే ఉంటాయని నాగదుర్గ చెబుతోంది. 

Read more Photos on
click me!

Recommended Stories