సర్పంచ్ ఎన్నికల పై బిగ్ అప్డేట్

Published : Nov 17, 2025, 07:59 PM IST

Telangana Local Body Elections: తెలంగాణలో డిసెంబర్ రెండో వారంలో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల కానుంది. ప్రజాపాలన వారోత్సవాలు పూర్తయిన తర్వాతే ఎన్నికల ప్రక్రియను ముందుకు తీసుకెళ్లాలని సీఎం రేవంత్ రెడ్డి కేబినెట్ నిర్ణయించింది.

PREV
15
తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు?

తెలంగాణ రాష్ట్రంలో ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్న స్థానిక సంస్థల ఎన్నికలపై స్పష్టత వచ్చింది. రాష్ట్ర మంత్రివర్గం సమావేశంలో తీసుకున్న కీలక నిర్ణయం ప్రకారం, డిసెంబర్ రెండో వారంలో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉంది. 

ఇప్పటికే 20 నెలల నుంచి సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థాయిలో పాలకవర్గాలు లేకపోవడంతో అభివృద్ధి కార్యక్రమాలు నిలిచిపోవడంపై ప్రజల్లో అసంతృప్తి నెలకొంది. ఈ పరిస్థితుల్లో కేబినెట్ లోకల్ బాడీ ఎన్నికల దిశగా అడుగులు వేయడం ప్రాముఖ్యత సంతరించుకుంది.

25
డిసెంబర్ 1–9 వరకు ప్రజాపాలన వారోత్సవాలు

సర్కారు ప్రాధాన్యతనివ్వబోయే కీలక కార్యక్రమాల్లో ‘ప్రజాపాలన వారోత్సవాలు’ ఒకటి. డిసెంబర్ 1 నుంచి 9 వరకు రాష్ట్రవ్యాప్తంగా ఇవి నిర్వహించనున్నట్లు కేబినెట్ ప్రకటించింది. ఈ వారోత్సవాల్లో ప్రజల నుండి వివిధ పథకాలకుగాను దరఖాస్తులు స్వీకరించడం, సంక్షేమ కార్యక్రమాలపై అవగాహన కల్పించడం, అభివృద్ధి పనులను ప్రజలకు చేర్చడం వంటి కార్యక్రమాలు చేపట్టనున్నారు. వారోత్సవాలు ముగిసిన వెంటనే ఎన్నికల ప్రక్రియను ప్రారంభించే అవకాశం ఉన్నట్లు సమావేశంలో సూచించారు.

35
దశలవారీగా స్థానిక ఎన్నికలు

ఈసారి స్థానిక సంస్థల ఎన్నికలు ఒకేసారి కాకుండా దశలవారీగా నిర్వహించే అవకాశాలున్నాయని సమాచారం. ముఖ్యంగా ముందుగా సర్పంచ్ ఎన్నికలను నిర్వహించి, తరువాత ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించే దిశగా చర్చించినట్లు తెలుస్తోంది. గ్రామీణ పరిపాలన కొనసాగడంలో సర్పంచ్ ఎన్నికలు అత్యవసరం కావడంతో ఈ నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి.

45
మళ్లీ తెరమీదకు బీసీ రిజర్వేషన్ల అంశం.. ఎన్నికలు ఆలస్యం

స్థానిక సంస్థల ఎన్నికలు జరగకపోవడానికి ప్రధాన కారణం బీసీ రిజర్వేషన్లపై ఏర్పడిన న్యాయపరమైన వివాదం. రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించే నిర్ణయం తీసుకోగా, ఇది సుప్రీంకోర్టు 50 శాతం పరిమితిని ఉల్లంఘిస్తుందని హైకోర్టు అభిప్రాయపడింది.

దాంతో ఎన్నికల నోటిఫికేషన్‌లు కొట్టివేయడం, ఆర్డినెన్స్ జారీ, మళ్లీ నోటిఫికేషన్ నిలిపివేత వంటి ప్రక్రియలు చోటు చేసుకుని ఎన్నికలు వరుసగా వాయిదా పడ్డాయి. కేబినెట్ ఈ సమస్యలను పరిష్కరించుకున్న తర్వాత డిసెంబర్ రెండో వారంలో ఎన్నికల షెడ్యూల్‌కు గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది.

55
సౌదీలో మృతి చెందిన కార్మికుల కుటుంబాలకు ఆర్థిక సాయం

సౌదీలో ప్రాణాలు కోల్పోయిన హైదరాబాదీ కుటుంబాలకు అండగా ఉంటామని తెలంగాణ కేబినెట్ తెలిపింది. ఈ ప్రమాదంలో మృతి చెందిన తెలంగాణ కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందించాలని తీర్మానించింది. 

మంత్రి అజారుద్దీన్, మైనార్టీ విభాగంలోని ఒక అధికారి, ఎంఐఎం ఎమ్మెల్యేలను కలిపిన ప్రతినిధి బృందాన్ని సౌదీకి వెంటనే పంపాలని నిర్ణయించారు. మృతదేహాలకు అక్కడే వారి మత సంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు నిర్వహించనున్నట్టు సమాచారం. బాధితుల కుటుంబాల నుండి ఇద్దరు సభ్యులను ప్రభుత్వ ఖర్చుతో సౌదీకి తరలించేందుకు కూడా ఏర్పాట్లు చేయనున్నట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి.

Read more Photos on
click me!

Recommended Stories