తెలంగాణ బోనాల పండుగ సందర్భంగా నిర్వహించే రంగం కార్యక్రమం గురించి మీకు తెలుసా? అమ్మవారి మాటలుగా మాతంగి చెప్పే భవిష్యవాణి నిజమవుతుందా? బాబా వంగా భవిష్యత్ గురించి ఎలా చెప్పేవారు?
Telangana Bonalu Rangam : తెలంగాణలో ఆషాడమాసం బోనాలు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా జంట నగరాలైన హైదరాబాద్, సికింద్రాబాద్ లో బోనాల వేడుకలు అట్టహాసంగా జరుగుతాయి... చారిత్రక నేపథ్యం కలిగిన ఈ గడ్డపై వెలిసిన అమ్మవార్లకు అనాదినుండి బోనాలతో మొక్కులు చెల్లించుకుంటారు భక్తులు. ఇలా ఈసారి కూడా ఆషాడమాసంలో సందడి నెలకొంది... నిన్న (ఆదివారం) సికింద్రబాద్ మహంకాళి అమ్మవారి ఆలయంలో బోనాలు వేడుకలు జరిగాయి. ఈ క్రమంలోనే ఇవాళ (సోమవారం) రంగం (భవిష్యత్ గురించి చెప్పే కార్యక్రమం) నిర్వహించారు.
25
అసలు ఏమిటీ రంగం?
బోనాల పండగ సందర్భంగా… భవిష్యత్ ఎలా ఉంటుంది? ప్రజలకు ఏవైనా సమస్యలు ఎదురవుతాయా? వాతావరణం ఎలా ఉంటుంది?... అనే తదితర విషయాలను ముందే చెప్పడమే రంగం. తెలంగాణలో బోనాల పండగ సందర్భంగా ఈ రంగం నిర్వహిస్తుంటారు. ఇందులో ఓ మహిళ (మాతంగి) శరీరంలోని అమ్మవారు ఆవహించి భవిష్యత్ గురించి చెబుతుందని ప్రజలు నమ్ముతారు.
బోనాల వేడుకలతో అమ్మవారు సంతృప్తి చెందకున్నా ఈ భవిష్యవాణిలో అమ్మవారి పూనినట్లుగా భావించే మహిళ చెబుతుంది. అందువల్లే ఏవయినా తప్పులుంటే క్షమించాలని... వచ్చే ఏడాది ఇలాంటివి జరక్కుండా చూసుకుంటామని నిర్వహకులు వేడుకుంటారు. అలాగే ప్రజలకు కూడా భవిష్యవాణి ద్వారా పలు సూచనలు చేస్తారు. ఇలా తాజాగా సికింద్రబాద్ మహంకాళి అమ్మవారి ఆలయంలో రంగం నిర్వహించారు.
35
ఈసారి భవిష్యవాణిలో ఏం చెప్పారు?
సికింద్రాబాద్ ఆలయంలో మాతంగి స్వర్ణలత ప్రతిసారి భవిష్యవాణి వినిపిస్తారు. ఈసారి కూడా బోనాల తర్వాతిరోజు అంటే ఇవాళ(జులై 14, సోమవారం) ఈ రంగం నిర్వహిస్తారు.. మహంకాళి అమ్మవారి ఆలయంలో ఉదయమే ఈ కార్యక్రమం ముగిసింది. అమ్మవారి ఎదుట పచ్చికుండపై నిలబడి స్వర్ణలత భవిష్యవాణి వినిపించారు.
ఎప్పటిలాగే ఈసారి కూడా బోనాల వేడుకలు బాగానే నిర్వహించారు... కానీ తనకు జీవాలు (మేకలు, కోళ్లు) ఎందుకు బలివ్వడంలేదు? అని స్వర్ణలత (మహంకాళి అమ్మవారి మాటలుగా) అడిగారు. తనకు పూజల కూడా సరిగ్గా చేయడంలేదు... అందుకే మరణాలు జరుగుతున్నాయని... భవిష్యత్ లో మరింత ప్రమాదం పొంచివుందని భవిష్యవాణితో హెచ్చరించారు.
రాబోయే రోజుల్లో భయంకరమైన మహమ్మారి వస్తుందని భవిష్యవాణిలో స్వర్ణలత తెలియజేసారు. అలాగే ఈసారి అగ్ని ప్రమాదాలు పెరుగుతాయని హెచ్చరించారు. ఇలా మానవాళికి ప్రమాదం పొంచివుందని మాతంగి స్వర్ణలత భవిష్యవాణిలో తెలిపారు. ఇక వర్షాలు ఈసారి సమృద్ధిగానే ఉంటాయని... రైతులు కంగారుపడాల్సిన అవసరం లేదని భవిష్యవాణి వినిపించారు.
బోనాల సందర్భంగా భవిష్యవాణి నిర్వహించడం ఆచారంగా వస్తోంది. ఈ సందర్భంగా మాతంగి పూనకంతో ఊగిపోతూ అమ్మవారే చెబుతున్నట్లుగా భవిష్యత్ లో ఏం జరుగుతుందో చెబుతారు. భక్తులు కూడా అమ్మవారి మాటలేనని నమ్ముతారు. కానీ ఇలా చెప్పే భవిష్యవాణి నిజం అవుతుందనే శాస్త్రీయ ఆధారాలు లేవు.
ఇలా భవిష్యవాణి అమ్మవారి మాటలుగా మాతంగి చెప్పేవి కొందరు భక్తులు పాటిస్తుంటారు. తద్వారా అమ్మవారి ఆశిస్సులు తమపై ఉంటాయని నమ్ముతారు... తమకు అంతా మంచే జరుగుతుందని విశ్వసిస్తారు. భవిష్యవాణిలో చెప్పింది నిజమైన సందర్భాలు ఉన్నాయనికూడా భక్తులు చెబుతుంటారు.
55
వీరుకూడా భవిష్యత్ ను ముందే ఊహించారా?
ఇలా బోనాల సమయంలో భవిష్యవాణి మాదిరిగానే గతంలో పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి కూడా భవిష్యత్ ను ముందే ఊహించి కాలజ్ఞానం రాసారని తెలుగు రాష్ట్రాల్లో నమ్ముతారు. ఆయన చెప్పినవి నిజం అయ్యాయని కూడా చెబుతుంటారు.
ఇక ఇటీవలకాలంలో బల్గేరియాకు చెందిన బాబా వంగా (1911-1996) భవిష్యవాణి చెప్పేవారు. కళ్ళులేని అందురాలైన ఆమెకు కొన్ని మానవాతీత శక్తులు ఉండేవని... అందువల్లే భవిష్యత్ ను ముందుగానే ఊహిచేదని చెబుతుంటారు. ఆమె అంచనాలు కూడా కొన్ని నిజమయ్యాయని ప్రచారం ఉంది. ఈ బాబా వంగా భవిష్యత్ గురించి చెప్పే మాటలు ప్రపంచవ్యాప్తంగా బాగా ప్రచారం అయ్యాయి.