Telangana మహిళలకు గుడ్ న్యూస్ అకౌంట్లలోకి డబ్బులు ఎప్పుడు రానున్నాయంటే..!

Published : Jul 14, 2025, 11:32 AM IST

తెలంగాణలోని స్వయం సహాయక సంఘాల ఖాతాల్లోకి వడ్డీ రాయితీగా రూ.344 కోట్లు జమ, బీమా సౌకర్యం అందజేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.వీటితో  ఉచిత బస్సు ప్రయాణం ఉన్న సంగతి తెలిసిందే.

PREV
15
మహిళా స్వయం సహాయక సంఘాలు

తెలంగాణ రాష్ట్రంలోని లక్షలాది మహిళలకు ఆదాయాన్ని పెంచే దిశగా ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మహిళా స్వయం సహాయక సంఘాల (SHGs) ఖాతాల్లోకి వడ్డీ రాయితీ నిధులను జమ చేసే ప్రక్రియ ప్రారంభమైంది. ఈ చర్యతో గ్రామీణ, పట్టణ ప్రాంతాల మహిళలకు ఆర్థిక ఊతం అందనుంది.

ఈ రాయితీని అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల రూ.344 కోట్ల నిధులను విడుదల చేసింది. అందులో రూ.300 కోట్లు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న స్వయం సహాయక సంఘాల కోసం, మిగతా రూ.44 కోట్లు పట్టణ ప్రాంతాల్లోని సంఘాల కోసం కేటాయించబడినవి. ఈ మొత్తం డబ్బును బ్యాంకుల ఖాతాల్లోకి జిల్లాలవారీగా పంపిణీ చేయడానికి సిద్ధమవుతున్నారు.

25
గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ

ఈ నిధులను గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (SERP) ద్వారా పంపిణీ చేయనున్నారు. జూలై 18 లోపు ఈ డబ్బులు సంబంధిత మహిళా సంఘాల ఖాతాల్లో జమ కానున్నట్లు సమాచారం. డబ్బు అకౌంట్లలోకి వచ్చేలోపు గ్రామాలలో "ఇందిరా మహిళా శక్తి" పేరిట ప్రత్యేక కార్యక్రమాలు జరుగుతున్నాయి. జూలై 12న ప్రారంభమైన ఈ కార్యక్రమాల్లో ప్రజాప్రతినిధుల చేత చెక్కుల పంపిణీ జరుగుతోంది.

ప్రతి నియోజకవర్గంలో ఎమ్మెల్యేలు, స్థానిక నేతలు పాల్గొని మహిళలకు చెక్కులు అందిస్తున్నారు. ఇది కేవలం వడ్డీ రాయితీ డబ్బులకే కాకుండా, మరో ముఖ్యమైన అంశమైన రుణ బీమా పాలసీకి సంబంధించిన చెక్కుల పంపిణీ కూడా ఇందులో భాగమైంది.

35
రుణ బీమా పథకం

రుణ బీమా పథకం ప్రకారం, స్వయం సహాయక సంఘాల సభ్యురాలు తీసుకున్న రుణం తీసుకున్న తర్వాత మరణిస్తే, ఆమె కుటుంబానికి ఆ రుణ భారం నుండి విముక్తి లభిస్తుంది. అదనంగా, ప్రమాదవశాత్తూ చనిపోయిన మహిళలకు రూ.10 లక్షల వరకు బీమా పరిహారం ఇవ్వడం జరుగుతోంది. ఈ విధంగా మహిళల కుటుంబాలకు ఆర్థిక భద్రత కల్పించేలా చర్యలు తీసుకుంటోంది తెలంగాణ ప్రభుత్వం.

ఇవి కేవలం ఒకే ఒక్కసారి జరిగే పని కాదు. రాష్ట్ర ప్రభుత్వం వచ్చే ఐదేళ్లలో లక్ష కోట్ల రూపాయల వడ్డీ లేని రుణాలను మహిళా సంఘాలకు అందించాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తోంది. ఈ లక్ష్యానికి అనుగుణంగా ‘స్త్రీ నిధి’ ద్వారా రుణాలు., బీమా సౌకర్యాలు విస్తరించారు. ఈ విధానం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా 63.86 లక్షల మహిళలకు బీమా రక్షణ అందుతోంది.

45
మహాలక్ష్మి పథకం

ఇక ఉపాధి అవకాశాల పరంగా చూస్తే, స్వయం సహాయక సంఘాలకు పాఠశాల యూనిఫామ్‌ల కుట్టు బాధ్యతలు అప్పగించడం వల్ల దాదాపు 29,680 మంది మహిళలకు ఉపాధి లభించిందని అధికారులు చెబుతున్నారు. ఇది మహిళలకు నిరంతర ఆదాయ మార్గాన్ని కల్పించినట్టు చెప్పొచ్చు.

ఇదిలా ఉండగా, ఇప్పటికే అమలులో ఉన్న "మహాలక్ష్మి" పథకం ద్వారా మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సదుపాయం కూడా లభిస్తున్నది. ఇది వారి రోజువారీ ఖర్చును తగ్గించడమే కాకుండా, విద్యా, వైద్యం, ఉపాధి కోసం ప్రయాణించే మహిళలకు మద్దతు కల్పిస్తోంది.

55
మహిళా సాధికార

ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణ ప్రభుత్వం మహిళా సాధికారత కోసం ఎన్నో విధానాలు తీసుకుంటోంది. ఈ పథకాలన్నింటినీ సమన్వయంతో అమలు చేస్తూ, మహిళల ఆర్థిక స్వావలంబన, సమాజంలో వారికి ప్రాధాన్యం పెరిగేలా చర్యలు తీసుకుంటోంది.

వడ్డీ రాయితీ, రుణ బీమా, ఉపాధి అవకాశాలు, ఉచిత ప్రయాణం ఇలా ఒక్కొక్క దశలో మహిళలకు మద్దతుగా నిలుస్తున్న రాష్ట్ర ప్రభుత్వం, ఒకవైపు ఆర్థికంగా, మరోవైపు భద్రతా పరంగా వారికి అండగా ఉండే ప్రయత్నం చేస్తోంది.

Read more Photos on
click me!

Recommended Stories