Telangana Assembly
హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి బిసి నినాదం ఎత్తుకుంది. ఇప్పటికే తెలంగాణ ప్రజలు బిజెపికి రాష్ట్రాన్ని పాలించే అవకాశమిస్తే బిసిని ముఖ్యమంత్రి చేస్తామని... బిసి సబ్ ప్లాన్ అమలుచేస్తామని హామీ ఇచ్చింది. ఇప్పుడు మరో అడుగు ముందుకేసి బిసి సీఎం అభ్యర్థి ఎవరో కూడా ప్రకటించేందుకు బిజెపి సిద్దమైనట్లు తెలుస్తోంది.
Modi
ఇటీవల కేంద్ర హోంమంత్రి అమిత్ షా సూర్యాపేట సభలో పాల్గొని బిసి సీఎం ప్రకటన చేసారు. ఈ బిసి సీఎం హామీని ప్రజల్లోకి మరింత బలంగా తీసుకువెళ్లేందుకు బిజెపి మరో వ్యూహం రచించినట్లు తెలుస్తోంది. అక్టోబర్ 7న ప్రధాని నరేంద్ర మోదీ హైదరాబాద్ లో బిజెపి తలపెట్టిన 'బిసి గర్జన' సభలో పాల్గొననున్నారు. ఈ వేదిక పైనుండే బిజెపి బిసి ముఖ్యమంత్రి అభ్యర్థి పేరును ప్రధాని ప్రకటించనున్నట్లు సమాచారం. అయితే దీనిపై బిజెపి నాయకులెవరూ స్పందించకున్నా రాజకీయంగా తీవ్ర చర్చ జరుగుతోంది.
PM Modi
తెలంగాణలో 50 శాతానికి పైగా వున్న బిసిలను తమవైపు తిప్పుకుంటే రాష్ట్ర రాజకీయాలను శాసించవచ్చని బిజెపి భావిస్తోంది. ఇందుకోసమే అసెంబ్లీ ఎన్నికల్లో బిసిలనే ప్రధానఅస్త్రంగా వాడుకుంటోంది. ఓ బిసిని దేశ ప్రధానిని చేసిన ఘనత బిజెపిదని... అవకాశమిస్తే తెలంగాణలో కూడా ఓ బిసి సీఎంను చేస్తామని చెబుతున్నారు.
Eatala Rajender
బిసి సీఎం ప్రకటన తర్వాత తెలంగాణ బిజెపిలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఇప్పటికే తెలంగాణలో అత్యధికంగా వున్న ముదిరాజ్ సామాజికవర్గం తమ వర్గానికి చెందిన ఈటల రాజేందర్ ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించాలని డిమాండ్ చేస్తోంది. స్వయంగా రాజేందర్ భార్య జమున తన భర్తను ప్రజలు ముఖ్యమంత్రిగా చూడాలని కోరుకుంటున్నారంటున్నారని అంటున్నారు. ఇటీవల హుజురాబాద్ లో భర్తకు మద్దతుగా ప్రచారం చేపట్టిన ఈటల జమున ఇలా ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు.
KCR Eatala
అయితే బిజెపి అదిష్టానం కూడా రాజకీయ అనుభవం, కేసీఆర్ ను ఢీకొట్టే సత్తావున్న ఈటల రాజేందర్ కు వుందని నమ్ముతోందట. దీంతో బిసి సీఎం అభ్యర్థిగా ఆయనను ప్రకటించే అవకాశం వుందని ప్రజల్లోనూ ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే గజ్వేల్ లో కేసీఆర్ పై ఈటలను బరిలోకి దింపడంద్వారా బిజెపి బిసి సీఎం అభ్యర్థి ఎవరన్నదానిపై అదిష్టానం సంకేతాలు ఇచ్చినట్లు అభిప్రాయపడుతున్నారు.
Bandi Sanjay
ఇక బిజెపి బిసి సీఎం అభ్యర్థుల జాబితాలో వినిపిస్తున్న పేరు బండి సంజయ్. తెలంగాణ బిజెపి అధ్యక్షుడిగా పనిచేసి పార్టీకి ఊపు తీసుకువచ్చిన సంజయ్ కి సీఎం అభ్యర్ధిగా ప్రకటిస్తే ఎలా వుంటుందన్నదానిపై అదిష్టానం ఆలోచిస్తోందట. అయితే ఆయనను వ్యతిరేకించే బిజెపి సీనియర్ల బ్యాచ్ దీన్ని వ్యతిరేకించే అవకాశాలు వుండటంతో ఈటల రాజేందర్ నే బిసి సీఎం అభ్యర్థిగా ప్రకటించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.