Syrup: తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. తెలంగాణ ఔషధ నియంత్రణ విభాగం (telangana drug control) ఓ సిరప్ వినియోగానికి సంబంధించి ఆదేశాలు జారీ చేసింది. సదరు సిరప్‌ను నిషేధిస్తూ ప్రకటన చేశారు.
పిల్లలకు వినియోగించే ఆల్మంట్-కిడ్ సిరప్ వాడకాన్ని వెంటనే నిలిపివేయాలని తెలంగాణ ఔషధ నియంత్రణ అడ్మినిస్ట్రేషన్ ఆదేశాలు జారీ చేసింది. ఈ సిరప్‌లో ప్రమాదకర రసాయనం కలిసినట్లు గుర్తించడంతో ప్రజలను అప్రమత్తం చేసింది. ఇంట్లో ఈ సిరప్ ఉన్నవారు ఎలాంటి ఆలస్యం చేయకుండా వాడకం ఆపేయాలని స్పష్టం చేసింది.
25
కోల్‌కతా నుంచి వచ్చిన హెచ్చరికతో వెలుగులోకి
కోల్‌కతాలోని సెంట్రల్ drugs స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (CDSCO – ఈస్ట్ జోన్) నుంచి తెలంగాణ అధికారులకు హెచ్చరిక సమాచారం అందింది. పరీక్షల్లో ఈ సిరప్‌లో ఇథిలీన్ గ్లైకాల్ అనే విషపూరిత పదార్థం కలిసినట్లు నిర్ధారణ అయింది. ఈ సమాచారం అందిన వెంటనే రాష్ట్రవ్యాప్తంగా అధికారులు చర్యలు ప్రారంభించారు.
ఇథిలీన్ గ్లైకాల్ సాధారణంగా యాంటీఫ్రీజ్ తయారీలో వాడే రసాయనం. ఇది మందుల్లో కలిసితే తీవ్రమైన అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. ముఖ్యంగా
కిడ్నీలపై తీవ్ర ప్రభావం
మెదడుకు నష్టం
వాంతులు, మూర్ఛ
అధిక మోతాదులో ప్రాణాపాయం
పిల్లల్లో ఈ ప్రభావం మరింత ప్రమాదకరంగా ఉంటుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
55
ప్రజలు, ఆసుపత్రులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు
ఈ ఘటన నేపథ్యంలో తెలంగాణ Drug కంట్రోల్ అధికారులు పలు సూచనలు జారీ చేశారు. ఇంట్లో ఈ సిరప్ ఉంటే వెంటనే వాడకం ఆపాలి. దగ్గరలోని అధికారులకు సమాచారం ఇవ్వాలి. రిటైలర్లు, పంపిణీదారులు, ఆసుపత్రులు ఈ బ్యాచ్‌ను అమ్మకాలు చేయకూడదు. అనుమానిత కేసులు ఉంటే టోల్ ఫ్రీ నంబర్ 1800-599-6969 కు సమాచారం ఇవ్వాలి. ప్రభుత్వ ఆదేశాల మేరకు Drugsఇన్‌స్పెక్టర్లు ఇప్పటికే దుకాణాలు, ఆసుపత్రుల్లో తనిఖీలు చేపట్టారు. ప్రజారోగ్యం దృష్ట్యా ఎలాంటి నిర్లక్ష్యం ఉండకూడదని అధికారులు స్పష్టం చేస్తున్నారు.