SSC Exams 2025 : తెలుగు రాష్ట్రాల్లో పదో తరగతి చదువుతున్న విద్యార్థులు చదువుపై మరింత శ్రద్ద పెట్టాల్సిందే.. ఎందుకంటే పరీక్షల నిర్వహణకు విద్యాశాఖ సిద్దమవుతోంది.. షెడ్యూల్ కూడా సిద్దం చేసినట్లు సమాచారం. ఏ రాష్ట్రంలో ఎప్పుడు పరీక్షలు ప్రారంభం…
SSC Exam Shedule 2025 : తెలంగాణ విద్యాశాఖ పదో తరగతి పరీక్షల షెడ్యూల్ ను సిద్దం చేసినట్లు తెలుస్తోంది. మార్చి 18 నుండి SSC (సెకండరీ స్కూల్ సర్టిఫికేట్) ఎగ్జామ్స్ ప్రారంభం కానున్నాయట... ఇప్పటికే విద్యాశాఖ ఈ ప్రతిపాదనను ప్రభుత్వ ఆమోదం కోసం పంపినట్లు తెలుస్తోంది. రేవంత్ సర్కార్ ఓకే చెబితే అధికారిక ప్రకటనతో పాటు పరీక్షల షెడ్యూల్ ను కూడా విడుదల చేయనుంది తెలంగాణ విద్యాశాఖ.
25
పదో తరగతి ఫీజు చెల్లింపు గడువు పెంపు ఉంటుందా?
తెలంగాణలో ప్రస్తుతం పదో తరగతి విద్యార్థులు పరీక్ష ఫీజు చెల్లింపు ప్రక్రియ కొనసాగుతోంది... అక్టోబర్ 30 నుండి నవంబర్ 13 లోపు స్కూల్లోనే ఫీజు చెల్లించే అవకాశం కల్పించారు. ఈ గడువు నేటితో ముగిసింది... కానీ ఇంకా చాలామంది విద్యార్థులు ఫీజు చెల్లించలేదట. దీంతో ఎలాంటి లేట్ పీజు లేకుండానే మరికొద్దిరోజులు విద్యార్థులు పరీక్ష ఫీజు చెల్లించుకునే అవకాశం కల్పించాలని ఉపాధ్యాయులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
35
తెలంగాణలో పదో తరగతి ఎగ్జామ్ ఫీజు వివరాలు
తెలంగాణలో ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థల్లో చదివే విద్యార్థులంతా పరీక్ష ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. రెగ్యులర్ విద్యార్థులు రూ.125, గతంలో పరీక్షలో ఫెయిలయిన విద్యార్థులు మూడు సబ్జెక్టుల లోపు రూ.110, అంతకంటే ఎక్కువ ఉంటే సబ్జెక్టుకు రూ.125 చొప్పున అదనంగా చెల్లించాలి.
ఒకవేళ ఉపాధ్యాయుల అభ్యర్థనను ప్రభుత్వం పట్టించుకోకుండా పదో తరగతి ఎగ్జామ్ ఫీజు చెల్లింపుకు గడువు పొడిగించకున్నా లేట్ ఫీజుతో చెల్లించవచ్చు. రూ.50 లేట్ ఫీజు చెల్లించి నవంబర్ 29 వరకు, రూ.200 లేట్ ఫీజుతో డిసెంబర్ 2 నుండి 11 వరకు... రూ.500 లేట్ ఫీజుతో డిసెంబర్ 15 నుండి 29 వరకు పరీక్ష ఫీజు చెల్లించుకోవచ్చు.
55
ఆంధ్ర ప్రదేశ్ లో పదో తరగతి పరీక్షలు ఎప్పట్నుంచంటే...
ఆంధ్ర ప్రదేశ్ లో కూడా పదో తరగతి విద్యార్థుల నుండి పరీక్ష ఫీజులను వసూలు చేస్తున్నారు. నవంబర్ 13 నుండి అంటే ఇవాళ్టినుండి నవంబర్ 25 వరకు ఎగ్జామ్ ఫీజు చెల్లించవచ్చు. రెగ్యులర్ విద్యార్థులతో పాటు గతంలో ఫెయిల్ అయిన విద్యార్థులు కూడా గడువులోపు ఫీజు చెల్లించాలి.
ఏపీలో కూడా మార్చిలోనే పరీక్షలు నిర్వహించేందుకు విద్యాశాఖ ప్రణాళికలు రూపొందిస్తోంది. ఇప్పటికే విద్యాశాఖమంత్రి నారా లోకేష్ కూడా సెలబస్ ను వీలైనంత తొందరగా పూర్తిచేయాలని ఉపాధ్యాయులను ఆదేశించారు. మార్చి 16 లేదా మార్చి 21 నుండి పరీక్షలను ప్రారంభించేందుకు విద్యాశాఖ సిద్దమవుతున్నట్లు... ప్రభుత్వ ఆమోదం తర్వాత తేదీని ఖరారు చేయనున్నట్లు తెలుస్తోంది. ఆ తర్వాత ఏపీలో కూడా పదో తరగతి పరీక్షల టైమ్ టేబుల్ విడుదలకానుంది.