డ‌బ్బులు తీసుకున్నారు, ఓట్లు వేయ‌లేదు.. జూబ్లిహిల్స్ ఎన్నిక‌లపై కొత్త ర‌చ్చ

Published : Nov 13, 2025, 01:18 PM IST

Hyderabad: జూబ్లిహిల్స్ ఉప ఎన్నిక‌ను పార్టీలు ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్న విష‌యం తెలిసిందే. అయితే ఈ ఎన్నిక‌లో పోలింగ్ తక్కువగా నమోదు కావడం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. దీనికి సంబంధించి సోష‌ల్ మీడియాలో ఓ చ‌ర్చ నడుస్తోంది. 

PREV
15
ఓటు వేయని వారిపై అసహనం

ఉపఎన్నికలో పోలింగ్ శాతం 50% కూడా దాటకపోవడంతో కాంగ్రెస్ నాయ‌కులు తీవ్ర అసంతృప్తి వ్య‌క్తం చేస్తున్నారంటూ సోష‌ల్ మీడియాలో పోస్టులు వైర‌ల్ అవుతున్నాయి. కొంతమంది ఓటర్లకు డబ్బులు ఇచ్చినప్పటికీ, వారు ఓటు వేయలేదని బూత్ ఏజెంట్లు గుర్తించినట్లు తెలుస్తోంది. ఒక ఇంట్లో 18 మందికి డబ్బులు ఇచ్చి, కేవలం నలుగురు మాత్రమే ఓటు వేసినట్లు సోష‌ల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు.

25
డ‌బ్బులు వెన‌క్కి ఇవ్వాలంటూ..

కొన్ని కాలనీలు, అపార్ట్మెంట్లలో కాంగ్రెస్ కార్యకర్తలు ఓటు వేయని వారిని డబ్బులు తిరిగి ఇవ్వాలని కోరుతున్నారని వీడియోలు, పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఘటనలు జూబ్లీహిల్స్, వెంగలరావు నగర్, SPR హిల్ ఏరియాల్లో జరిగాయన్న ప్రచారం సాగుతోంది.

35
ఖండించిన‌ కాంగ్రెస్

అయితే ఈ ఆరోపణలను ఖండిస్తూ కాంగ్రెస్ నాయ‌కులు పోస్టులు చేస్తున్నారు. ఇవ‌న్నీ పూర్తిగా అవాస్తమ‌ని, ప్రజల్లో గందరగోళం సృష్టించేందుకు ప్రతిపక్ష పార్టీలు ప్రణాళికబద్ధంగా ప్రచారం చేస్తున్నాయ‌ని వాదిస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీనే ఈ చ‌ర్య‌ల‌కు పాల్ప‌డిందంటూ విమ‌ర్శ‌లు చేస్తున్నారు.

45
ఉపఎన్నిక ఫలితంపై ఉత్కంఠ

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ఫలితాలు నవంబర్ 14న వెలువడనున్నాయి. చాణక్య, హెచ్‌ఎంఆర్‌, స్మార్ట్‌ పోల్ సర్వేలు — కాంగ్రెస్‌కు స్వల్ప ఆధిక్యం ఉన్నట్లు అంచనా వేశాయి. మాగంటి గోపీనాథ్‌ భార్య సునీత (భారత రాష్ట్ర సమితి), నవీన్‌ యాదవ్‌ (కాంగ్రెస్‌), లంకల దీపక్‌రెడ్డి (BJP) మధ్య ప్రధాన పోటీ నెలకొంది.

55
కౌంటింగ్‌కు స‌ర్వం సిద్ధం

జూబ్లిహిల్స్ ఎన్నిక‌ల ఫ‌లితం మ‌రికొన్ని గంట‌ల్లో తేల‌నుంది. శుక్ర‌వారం కౌంటింగ్ జ‌ర‌గ‌నుంది. ఓట్ల లెక్కింపు యూసుఫ్‌గూడలోని కోట్ల విజయభాస్కర్‌రెడ్డి స్టేడియంలో జరగనుంది. మొత్తం 407 పోలింగ్ కేంద్రాల ఓట్లు 10 రౌండ్లలో లెక్కిస్తారు. భద్రతా చర్యలు కట్టుదిట్టంగా ఏర్పాటు చేశారు. పోలింగ్ శాతం 48.49గా నమోదైన విష‌యం తెలిసిందే.

Read more Photos on
click me!

Recommended Stories