vegetables price in Hyderabad
తక్కువ ధరకే కూరగాయలు కొనడం ఎలా?
హైదరబాద్... వందల కోట్ల శ్రీమంతుల నుండి వందరూపాయల రోజుకూలీ వరకు జీవించే నగరం. ఇక్కడ బ్రతకాలంటే దండిగా డబ్బుండాలి... లేదంటే తెలివిగా బ్రతకాలి. బాగా డబ్బున్నోళ్లు ఎలాగూ ఎంతయినా ఖర్చుచేసి దర్జాగా బ్రతుకుతారు... కానీ సామాన్యులు మాత్రం రూపాయి రూపాయి చూసి ఖర్చుచేయాలి. కాబట్టి రోజువారి ఖర్చులు తగ్గించుకుంటేనే సగటు జీవి నెలజీతం సరిపోతుంది.
సామాన్య, మధ్య తరగతి కుటుంబాల ఖర్చులే నిత్యావసరల సరుకులు, కూరగాయల ధరలే ఎక్కువ. సరుకుల కోసం డీమార్ట్ వంటి సూపర్ మార్కెట్ కు వెళ్లి ఖర్చు తగ్గించుకునే ప్రయత్నం చేస్తారు. మరి కూరగాయలు ఖర్చును తగ్గించుకోవడం ఎలా? అయితే హైదరబాదీలు కొద్దిగా ప్లాన్ చేసుకుంటే కూరగాయలను కూడా తక్కువధరకు పొందవచ్చు. ఆ ట్రిక్స్ ఏమిటో చూద్దాం.
1. చుట్టుపక్కల ప్రాంతాల నుండి హైదరాబాద్ కు ఉద్యోగం కోసమో, ఉపాధి కోసమో వచ్చేవారు చాలామంది వుంటారు. ఇలాంటివారు నెలలో ఒకటి రెండు సార్లు సొంతూళ్లకు వెళ్లివస్తుంటారు. అయితే హైదరాబాద్ లో కంటే పల్లెల్లో కూరగాయల ధరలు తక్కువగా వుంటాయి... ఎందుకంటే అక్కడ వాటిని రైతులే అమ్ముతారు, వ్యాపారులు కాదు. కాబట్టి ఇలా తరచూ సొంతూళ్లుకు వెళ్లేవారు అక్కడినుండే కూరగాయలు తెచ్చుకుంటే ఖర్చు తగ్గుతుంది.
2. ఇక హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో రోడ్ల పక్కన కొందరు రైతులు కూరగాయలు అమ్ముతుంటారు. అప్పుడే పొలంలోంచి తెచ్చిన తాజా కూరగాయలను తక్కువ ధరకే అమ్ముతుంటారు... అంటే నగరంలో కంటే తక్కువ ధరకు లభిస్తాయి. కాబట్టి శివారు ప్రాంతాలకు దగ్గర్లో వుండేవారు ఇలా బయటకు వెళ్లి కొంటే కాస్త ఖర్చు తగ్గుతుంది.
3. ఎక్కువరోజులు నిల్వ వుండే కూరగాయలు తక్కువ ధర వున్నప్పుడే ఎక్కువమొత్తంలో కొనుగోలు చేసుకోవాలి. ఉదాహరణకు ఉల్లిపాయలు ఒక్కోసారి కిలో కేవలం రూ.10 కే లభిస్తాయి... అప్పుడు వాటిని ఎక్కువగా కొనుగోలు చేసుకోవాలి. అప్పుడు రూ.100 కిలో వున్నపుడు కొనాల్సిన అవసరం వుండదు. ఇలాగే అల్లం, వెల్లుల్లి వంటి నిల్వ వుండేవి ఒకేసారి కొనుగోలు చేయాలి.
4. కూరగాయలు ఏరోజుకారోజు కొనడం కంటే వారంవారం మీ కాలనీలోనో, దగ్గర్లో వుండే రైతు బజార్లలోనో వారానికి సరిపడా ఒకేసారి కొనుగోలు చేయాలి... ఇలా వారంవారం జరిగే సంతల్లో, రైతు బజార్లలో కూరగాయల ధరలు కాస్త తక్కువగా వుంటాయి.
5. కూరగాయల ధరలు సూపర్ మార్కెట్స్, షాపుల్లో లలో చాలా ఎక్కువగా వుంటాయి. అదే బయట కొంటే చాలా తక్కువకు లభిస్తాయి. కాబట్టి కూరగాయల మార్కెట్స్, రైతు బజార్లు, తోపుడు బండ్లపై కూరగాయల కొంటే కాస్త డబ్బులు ఆదా అవుతాయి.
ఇలా రైతుల వద్ద, చిరు వ్యాపారుల వద్ద కూరగాయల కొనుగోలు చేయడంద్వారా మీరు లాభపడటమే కాదు వారికి కూడా లాభం చేసినవారు అవుతారు. ఇలా ఓ ప్లానింగ్ తో కూరగాయల కొనడంద్వారా మీ నెలవారి ఖర్చులు కాస్త తగ్గించుకోవచ్చు. ఇది మీ ఇతర ఖర్చులకు ఉపయోగపడుతుంది.