టమాటా, ఉల్లిపాయల ధరలు ఇటీవల భారీ ధర పలికిన విషయం తెలిసిందే. కిలో వంద రూపాయలు పలికిన ఈ కూరగాయలు ఇప్పుడు నేలకు దిగివచ్చాయి. వీటి ధరలు ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో చాలా తక్కువగా వున్నాయి. తెలంగాణ రాజధాని హైదరాబాద్ మార్కెట్లలో కిలో టమాటా రూ.20 వస్తోంది. ఇక ఉల్లిపాయల కిలో 30 కి లభిస్తున్నాయి.
వ్యాపారుల దగ్గరే టమాటా ఈ ధర పలికితే రైతుల దగ్గర ఎలా వుంటుందో అర్థం చేసుకోవచ్చు. రైతులకు కిలోకు రూ.5 కూడా రావడంలేదు. రవాణా ఖర్చులు కూడా సరిపోక పొలాల్లోనే టమాటా పంటను వదిలేస్తున్నారు రైతులు. ఒకప్పుడు కిలో వందరూపాయలకు పైనే అమ్మిన రైతులు ఇప్పుడు తలలు పట్టుకుంటున్నారు. టమాటా పంటతో లక్షలు అర్జించినవారు ఇప్పుడు వందలు కూడా రాాక ఇబ్బందిపడుతున్నారు. హారం