School Holidays: స్కూళ్ల‌కు సెల‌వులే సెల‌వులు.. ఒక్క రోజు మ్యానేజ్ చేస్తే వ‌రుస‌గా ఐదు రోజులు

Published : Jul 18, 2025, 10:25 PM IST

ఈ వారాంతం విద్యార్థులకు భారీగా సెలవులు వస్తున్నాయి. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 5 రోజులు సెలవులు లభించనున్నాయి. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం. 

PREV
14
భారీ వర్షాల నేపథ్యంలో

తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. భారీగా వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్‌లో శుక్ర‌వారం వ‌ర్షం దంచికొట్టింది. దీంతో న‌గ‌రంలో చాలా చోట్ల భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. కొన్ని చోట్ల చెట్లు విరిగిప‌డ్డాయి. ఈ కార‌ణంగానే హైద‌రాబాద్‌లో పాఠ‌శాల‌ల‌కు సెల‌వు ప్ర‌క‌టించే అవ‌కాశాలు ఉన్నాయి. 

స‌హ‌జంగానే న‌గ‌రంలో కొన్ని స్కూళ్ల‌కు శ‌నివారం హాఫ్ డే ఉంటుంది. వ‌ర్షాల నేప‌థ్యంలో కొన్ని పాఠ‌శాల‌లు సెల‌వులు ప్ర‌క‌టించే ఆలోచ‌న‌లో ఉన్న‌ట్లు తెలుస్తోంది. ఇప్ప‌టికే కొన్ని విద్యా సంస్థ‌లు శ‌నివారం సెల‌వును ప్ర‌క‌టిస్తూ పేరెంట్స్‌కి మెసేజ్‌లు కూడా పంపాయ‌ని స‌మాచారం.

24
బోనాల పండ‌గ నేప‌థ్యంలో సెల‌వు

జూలై 19వ తేదీన వ‌ర్షం కార‌ణంగా స్కూళ్ల‌కు సెల‌వు ఉండే అవ‌కాశం ఉండ‌గా జూలై 20వ తేదీన ఆదివారం స‌హ‌జంగానే సెల‌వు ఉంటుంది. కాగా జూలై 21 (సోమవారం) బోనాల పండుగ సందర్భంగా ప్రభుత్వం అధికారిక సెలవుగా ప్రకటించింది. ఇది అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలకు వర్తిస్తుంది.

తెలంగాణ సాంస్కృతిక వైభవంగా నిలిచిన బోనాల పండుగను ప్రభుత్వం అధికారికంగా గుర్తించింది. ఉజ్జయినీ మహంకాళి బోనాలతో ప్రారంభమైన ఈ పండుగలు, హైదరాబాద్‌తో పాటు రాష్ట్రవ్యాప్తంగా జరుపుకుంటున్నారు. దీన్ని పురస్కరించుకుని 2025 సంవత్సరపు సెలవుల జాబితాలో బోనాలను సాధారణ సెలవుగా చేర్చింది ప్రభుత్వం.

34
జూలై 23న కూడా సెలవు వచ్చే అవకాశం ఉందా?

ఇదిలా ఉంటే వామపక్ష విద్యార్థి సంఘాలు విద్యా రంగ సమస్యల పరిష్కారానికి జూలై 23 (బుధవారం) నాడు రాష్ట్రవ్యాప్తంగా బంద్‌కు పిలుపునిచ్చాయి. ఇందులో ప్రభుత్వ బడుల్లో మౌలిక సదుపాయాల లేమి, టీచర్ల కొరత, ప్రైవేట్ స్కూళ్ల ఫీజుల పెంపు వంటి అంశాలపై నిరసనలు వ్యక్తమవుతున్నాయి. దీంతో జూలై 23న విద్యాసంస్థలు స్వచ్ఛందంగా మూతపడే అవకాశముంది.

44
ఒక్క రోజు మ్యానేజ్ చేస్తే

మంగ‌ళ‌వారం ఒక్క రోజు మ్యానేజ్ చేస్తే విద్యార్థుల‌కు వ‌రుస‌గా ఐదు రోజులు సెల‌వులు ల‌భించ‌నున్నాయ‌న్నమాట‌. లాంగ్ ట్రిప్స్ ప్లాన్ చేసుకునే వారికి ఇదొక మంచి అవ‌కాశంగా చెప్పొచ్చు. ఇలా అనుకోకుండా వ‌చ్చిన ఈ సెల‌వుల‌ను విద్యార్థులు త‌మ క్రియేవిటీ పెంచుకోవ‌డానికి లేదా ఏదైనా కొత్త ప్ర‌దేశాన్ని చూడ‌డానికి ఉప‌యోగించుకుంటే సెల‌వుల‌ను స‌ద్వినియోగ‌పరుచుకున్న‌ట్లు అవుతుంది.

Read more Photos on
click me!

Recommended Stories