School Holidays : ఆగస్ట్ లో మిగిలిందే ఐద్రోజులు... ఇందులో మూడ్రోజులు తెలుగు స్టూడెంట్స్, ఉద్యోగులకు సెలవులే

Published : Aug 26, 2025, 06:27 PM IST

Holidays : రాబోయే ఐదురోజుల్లో తెలుగు రాష్ట్రాల్లోని విద్యార్థులు,ఉద్యోగులకు వరుస సెలవులు వస్తున్నాయి… కొందరికి మూడ్రోజులు, మరికొందరికి రెండ్రోజులు సెలవులున్నాయి. ఏరోజు, ఎందుకు సెలవులున్నాయో ఇక్కడ తెలుసుకుందాం. 

PREV
15
ఆగస్ట్ లో ఇక మిగిలిన సెలవులివే...

School Holidays : తెలుగు విద్యార్థులకే కాదు ఉద్యోగులకు కూడా ఈ నెలలో (ఆగస్ట్) వరుస సెలవులు వచ్చాయి... ఇంకా వస్తూనే ఉన్నాయి. ఈ నెలలో ఇంకా కేవలం ఐదురోజులే మిగిలివున్నాయి... ఇందులోనూ రెండుమూడు రోజులు సెలవులే వస్తున్నాయి. కేవలం పిల్లలకే కాదు ఉద్యోగులకు కూడా సెలవులు వస్తున్నాయి... ఈ సెలవుల గురించి ఇక్కడ తెలుసుకుందాం.

25
వినాయక చవితి సెలవు

దేశంలోని హిందువులు వినాయక చవితి పండగను ఎంతో పవిత్రంగా జరుపుకుంటారు... వాడవాడలా ఆ గణనాథుడి విగ్రహాలను ప్రతిష్టించి పూజిస్తారు. ఇలా వైభవంగా జరుపుకునే గణపతి పండగ నేపథ్యంలో ఆగస్ట్ 27న అంటే రేపు బుధవారం దేశవ్యాప్తంగా విద్యాసంస్థలకు సెలవు ఉంది. తెలంగాణతో పాటు ఆంధ్ర ప్రదేశ్ లో కూడా విద్యార్థులు, ఉద్యోగులకు వినాయక చవితి సెలవు ఉంది. పేరెంట్స్ తో పాటు పిల్లలకు సెలవే కాబట్టి గణపతి పండగను ఘనంగా జరుపుకోవచ్చు.

35
ఆగస్ట్ 30 సెలవేనా?

హైదరాబాద్ లో కొన్ని కార్పోరేట్, ప్రైవేట్ విద్యాసంస్థలకు వారంలో రెండ్రోజులు సెలవు ఉంటుంది. ఇలాంటి స్కూళ్లలో చదివే విద్యార్థులకు ఈ ఆగస్ట్ 30న సెలవు ఉంటుంది... మరికొన్ని విద్యాసంస్థలు శనివారం హాఫ్ డే నడుస్తాయి. ఇలా తెలుగు రాష్ట్రాల్లోని కొందరు విద్యార్థులకు శనివారం సెలవు లేదా హాఫ్ డే ఉంటుంది... మిగతా విద్యార్థులకు శనివారం యధావిధిగా స్కూల్ నడుస్తుంది.

45
ఆగస్ట్ 31 సెలవు...

ఆగస్ట్ 31న ఆదివారం... కాబట్టి ఎలాగూ ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలన్నింటికి సెలవు ఉంటుంది. శనివారం సెలవు వర్తించే విద్యాసంస్థలకు వరుసగా రెండ్రోజులు సెలవులే... మొత్తంగా చూసుకుంటే కొన్ని స్కూల్స్ విద్యార్థులకు ఈ నెలలో మిగిలిన ఐదురోజుల్లో మూడ్రోజులు సెలవులు వస్తున్నాయి... మిగతా విద్యార్థులకు రెండ్రోజులు సెలవులు వస్తున్నాయి.

55
సెప్టెంబర్ లో సెలవులే సెలవులు

వచ్చే నెల సెప్టెంబర్ లో తెలుగు రాష్ట్రాల విద్యార్థులకు వరుస సెలవులు రానున్నాయి. తెలంగాణలోని అన్ని స్కూళ్లకు దసరా పండగ నేపథ్యంలో సెప్టెంబర్ 21 నుండి అక్టోబర్ 3 వరకు సెలవులు ప్రకటించారు. అంటే వరుసగా 13 రోజులు విద్యాసంస్థలు క్లోజ్ కానున్నాయి… స్టూడెంట్స్ కి సెలవులు వస్తున్నాయి.

ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం కూడా దసరా సెలవులు ప్రకటించింది... అయితే ఇక్కడ తెలంగాణ కంటే తక్కువ సెలవులు ఇచ్చారు. ఏపీ విద్యాసంస్థలకు సెప్టెంబర్ 24 నుండి దసరా సెలవులు ఇచ్చారు... అక్టోబర్ 2 వరకు ఇవి కొనసాగనున్నాయి.. అక్టోబర్ 3న స్కూళ్ళు తిరిగి ప్రారంభం అవుతాయి. ఇలా ఏపీ విద్యార్థులకు దసరాకి కేవలం 9 రోజులే సెలవులు వస్తున్నాయి.

Read more Photos on
click me!

Recommended Stories