Sankranti: సంక్రాంతికి ఊరెళ్తున్నారా.? ఇలా వెళ్తే ట్రాఫిక్ త‌ప్పించుకోవ‌చ్చు

Published : Jan 10, 2026, 03:21 PM IST

Sankranti: సంక్రాంతికి ఊళ్ల బాట పట్టిన నగరవాసులతో హైదరాబాద్‌ రహదారులు కిక్కిరిసిపోయాయి. హైదరాబాద్‌–విజయవాడ జాతీయ రహదారిపై ప్రయాణం కష్టంగా మారింది. ట్రాఫిక్‌ సమస్యలు ఎదురుకాకుండా ఉండేందుకు పోలీసులు కొన్ని ప్రత్యామ్నాయ మార్గాలను సూచిస్తున్నారు. 

PREV
15
సంక్రాంతి సెలవులతో ఒక్కసారిగా పెరిగిన ప్రయాణాలు

సంక్రాంతి సెలవులు మొదలుకావడంతో నగరం నుంచి పల్లెలకు వెళ్లే వారి సంఖ్య భారీగా పెరిగింది. శుక్రవారం రాత్రి నుంచే రహదారులపై వాహనాలు వరుసలుగా కనిపిస్తున్నాయి. హైదరాబాద్‌ అంతటా ట్రాఫిక్‌ నెమ్మదిగా కదులుతోంది. బస్సులు, కార్లు, ద్విచక్ర వాహనాలతో రోడ్లు నిండిపోయాయి.

25
హైదరాబాద్‌–విజయవాడ హైవేపై భారీ రద్దీ

సాధారణ రోజుల్లో నాలుగు నుంచి ఐదు గంటల్లో పూర్తయ్యే హైదరాబాద్‌–విజయవాడ ప్రయాణం ప్రస్తుతం తొమ్మిది నుంచి పది గంటల వరకూ పడుతోంది. పంతంగి టోల్‌ప్లాజా దగ్గర వాహనాలు పెద్ద ఎత్తున నిలిచిపోయాయి. కార్లు నెమ్మ‌దిగా కదులుతున్నాయి. రద్దీ తగ్గించేందుకు చౌటుప్పల్‌ దగ్గర నారాయణపురం రోడ్డును తాత్కాలికంగా మూసివేశారు.

35
బస్‌, రైలు స్టేషన్లలో కూడా కిక్కిరిసిన జనం

ఆర్టీసీ బస్సులు, ప్రైవేట్‌ ట్రావెల్స్‌లో సీట్లు నిండిపోయాయి. రైల్వే స్టేషన్లు ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి. ముందస్తు బుకింగ్‌ లేకపోవడంతో చాలామంది రోడ్డు మార్గాన్ని ఎంచుకుంటున్నారు. దీని ప్రభావం నేరుగా జాతీయ రహదారులపై పడుతోంది.

45
గుంటూరు, ఒంగోలు వైపు వెళ్లేవారికి సూచించిన మార్గాలు

గుంటూరు, మాచర్ల, అద్దంకి, ఒంగోలు, నెల్లూరు ప్రాంతాలకు వెళ్లేవారు హైదరాబాద్‌–నాగార్జునసాగర్‌ హైవేను ఎంచుకుంటే ప్రయాణం సులభంగా సాగుతుందని పోలీసులు చెబుతున్నారు. ఈ మార్గంలో ట్రాఫిక్‌ ఒత్తిడి తక్కువగా ఉండటంతో సమయం ఆదా అవుతుంది.

55
ఖమ్మం, విజయవాడ ప్రయాణికులకు ప్రత్యామ్నాయ దారి

ఖమ్మం, విజయవాడ వైపు వెళ్లేవారు భువనగిరి, రామన్నపేట మార్గంగా చిట్యాల చేరుకోవాలని సూచిస్తున్నారు. ORR పైనుంచి ఘట్‌కేసర్‌ ఎగ్జిట్‌ తీసుకుని వరంగల్‌ హైవేలోకి వెళ్లాలి. సికింద్రాబాద్‌, తార్నాక, ఉప్పల్‌ మార్గం ద్వారా కూడా భువనగిరి చేరుకోవచ్చు. చౌటుప్పల్‌ దగ్గర ట్రాఫిక్‌ తప్పించుకోవాలంటే ఈ మార్గాలు ఉత్తమమని పోలీసులు స్పష్టం చేస్తున్నారు.

Read more Photos on
click me!

Recommended Stories