Sankranti Holidays : తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ ఉద్యోగులకు కొత్త సంవత్సరం (2026) ఆరంభంలోనే వరుస సెలవులు వస్తున్నాయి… ఇవన్నీ సంక్రాంతికి కలిసివస్తున్నాయి. ఈసారి పండక్కి ఎన్నిరోజుల సెలవులు పొందవచ్చో తెలుసా?
Sankranti Holidays : మకర సంక్రాంతి... తెలుగు ప్రజలకు చాలా పెద్ద పండగ. మరీముఖ్యంగా ఆంధ్ర ప్రదేశ్ ప్రజలు సంక్రాంతి పండగను ఘనంగా జరుపుకుంటారు. ముగ్గులతో ఆడపిల్లలు, గాలిపటాలు ఎగరేస్తూ అబ్బాయిలు, పిండివంటలతో మహిళలు, కోడిపందేలతో పురుషులు సందడి చేస్తారు... గంగిరెద్దుల ఆటలు, హరిదాసుల పాటలు, బోగిమంటల వెచ్చదనంతో సంక్రాంతి వైభవం మామూలుగా ఉండదు. అందుకే ఈ పండక్కి ఎన్నిరోజులు సెలవులిచ్చినా ఇంకా కావాలనే అనిపిస్తుంది... అయితే ఈసారి విద్యార్థుల మాదిరిగానే ఉద్యోగులకు కూడా సంక్రాంతి సెలవులు భారీగానే వస్తున్నాయి. మరి ఎన్నిరోజులు అధికారిక సెలవులున్నాయి? సెలవులను ఎలా పెంచుకోవచ్చు? అనేది ఇక్కడ తెలుసుకుందాం.
28
తెలుగు ఉద్యోగులకు సెలవులే సెలవులు...
సంక్రాంతి అనేది ప్రకృతి పండుగ... ఇది సూర్యుడు మకర రాశిలోకి మారడాన్ని సూచిస్తుంది. ఈ పండగ సమయానికి పంటలకాలం ముగిసి రైతుల ఇండ్లు ధనధాన్యాలతో కళకళలాడుతాయి. ఈ ఆనందంలో ప్రజలు పండగను వైభవంగా జరుపుకునేవారు... ఇదే ఆనవాయితీ ఇప్పుడు కూడా కొనసాగుతోంది. సంక్రాంతి పండగ వచ్చిందంటే చాలు తెలుగు రాష్ట్రాల్లోని పల్లెలు వెలిగిపోతాయి... ఎక్కడెక్కడో స్థిరపడినవారు కూడా సొంతూళ్లకు చేరుకుంటారు.
అయితే చాలాకాలంగా ఉద్యోగులకు కేవలం రెండుమూడు రోజులు మాత్రమే సంక్రాంతి సెలవులు వస్తున్నాయి. దీంతో వారు కుటుంబసభ్యులు, స్నేహితులతో కలిసి సంక్రాంతిని ఎక్కువరోజులు జరుపుకోలేకపోతున్నారు. కుటుంబసభ్యులంతా పండగ సమయంలో వారంపదిరోజులు సొంతూరిలో ఉంటే ఉద్యోగులు మాత్రం పనిచేసే ప్రాంతాలకు పయనం కావాల్సి వస్తోంది. అయితే ఈ సంక్రాంతి అలా ఉండదు... ఉద్యోగులకు వరుస సెలవులు కలిసివస్తున్నాయి.
38
జనవరి 10 నుండి 18 వరకు సంక్రాంతి సెలవులే..?
తెలుగు రాష్ట్రాల ఉద్యోగులకు ఈ సంక్రాంతికి భారీగా సెలవులు వస్తున్నాయి. విద్యార్థుల మాదిరిగానే ఉద్యోగులకు కూడా తొమ్మిది రోజుల సెలవులున్నాయి... డిసెంబర్ 10 నుండి డిసెంబర్ 18 వరకు వరుస సెలవులు పొందవచ్చు. అంటే మొత్తం 9 రోజుల సెలవులు తీసుకోవచ్చు... పండగపూట సొంతోళ్లతో సొంతూళ్లో ఆనందంగా గడపవచ్చు.
జనవరి 2026లో 10 తేదీన రెండో శనివారం వస్తోంది. అంటే ఆరోజు ప్రభుత్వ ఉద్యోగులకు, విద్యార్థులకు అధికారిక సెలవు ఉంటుంది. ఇక తర్వాతిరోజు ఆదివారమే కాబట్టి సాధారణ సెలవే. ఇలా సంక్రాంతికి ముందు వరుసగా రెండ్రోజుల సెలవులు వస్తున్నాయి.
58
జనవరి 12, 13 కవర్ చేస్తే చాలు...
జనవరి 12న సోమవారం, 13న మంగళవారం... ఈ రెండ్రోజులు ఎలాంటి సెలవు లేదు. ఈ రెండ్రోజులు లీవ్ తీసుకుంటే తర్వాత వచ్చే సంక్రాంతి సెలవులకు కలిసివస్తాయి. వరుసగా తొమ్మిదికోజులు పండక్కి సెలవు పొందవచ్చు.
68
జనవరి 14, 15, 16 సంక్రాంతి సెలవులు
ఆంధ్ర ప్రదేశ్ లో సంక్రాంతి పండక్కి వరుసగా మూడ్రోజులు అధికారిక సెలవుగా ప్రకటించింది ప్రభుత్వం... జనవరి 14 భోగి ,15న సంక్రాంతి, 16న కనుమ పండగ ఉంది. తెలంగాణలో మాత్రం భోగి, సంక్రాంతికి అధికారిక సెలవు, కనుమకు ఆప్షనల్ హాలిడే ఇచ్చారు. ఇలా జనవరి 14,15,16 (బుధ, గురు, శుక్రవారం) సంక్రాంతి సెలవులు ఇస్తున్నారు.
78
జనవరి 17, 18 కూడా సెలవే..
జనవరి 17న ముస్లింల పండగ షబ్-ఈ-మేరాజ్ ఉంది. ఈరోజు తెలంగాణ ఉద్యోగులకు ఆప్షనల్ హాలిడే. అంటే వేతనంతో కూడిన సెలవు పొందవచ్చు. ఈ సెలవును వాడుకుండే తర్వాత ఆదివారం సెలవు కలిసివస్తుంది. మొత్తంగా ఓ రెండ్రోజులు కవర్ చేసుకోగలిగితే జనవరి 10 నుండి 18 వరకు తెలుగు రాష్ట్రాల ఉద్యోగులు సంక్రాంతి సెలవులు పొందవచ్చు. తొమ్మిదిరోజులు పండగను ఎంజాయ్ చేసి జనవరి 19న ఆఫీసు బాట పట్టవచ్చు.
88
తొమ్మిదిరోజులూ సంక్రాంతి సెలవులే..
జనవరి 10 (రెండో శనివారం)
జనవరి 11 (ఆదివారం)
12,13 జనవరి (సోమ, మంగళ) వర్కింగ్ డే (లీవ్ తీసుకోవచ్చు)
జనవరి 14 (బుధవారం) - భోగి
జనవరి 15 (గురువారం) - సంక్రాంతి
జనవరి 16 (శుక్రవారం) - కనుమ (ఏపీలో అధికారిక సెలవు, తెలంగాణలో ఆప్షనల్ హాలిడే)
జనవరి 17 (శనివారం) - షబ్-ఈ-మేరాజ్ (తెలంగాణలో ఆప్షనల్ హాలిడే)