School Holidays : తెలుగు స్టూడెంట్స్ ఎగిరిగంతేసే వార్త... డిసెంబర్ 16,17 రెండ్రోజులు సెలవే

Published : Dec 15, 2025, 11:13 AM IST

Telangana Holidays : తెలంగాణలో మరో రెండ్రోజులు సెలవులు వస్తున్నాయి. డిసెంబర్ 16, 17న (రేపు, ఎల్లుండి) విద్యాసంస్థలకు సెలవు ఉంటుంది. ఈ సడన్ హాలిడేస్ ఎందుకో తెలుసా?

PREV
15
తెలంగాణలో మళ్లీ రెండ్రోజుల సెలవులు

School Holidays : తెలుగు రాష్ట్రాల్లోని విద్యాసంస్థలకు 2025 లో భారీగా సెలవులు వచ్చాయి. పండగలు, స్థానిక పర్వదినాలు, ప్రత్యేక రోజులు, జాతీయ దినోత్సవాలతో పాటు వర్షాలు, బంద్ ల నేపథ్యంలో సెలవులు వచ్చాయి. ఏడాది ఎండింగ్ కు చేరుకున్నా ఈ సెలవుల పరంపర కొనసాగుతోంది. సాధారణంగా డిసెంబర్ లో ఎక్కువ సెలవులుండవు... కేవలం క్రిస్మస్ కి మాత్రమే హాలిడేస్ ఉంటాయి. కానీ తెలంగాణలో పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో వరుస సెలవులు వస్తున్నాయి. తాజాగా ఈవారంలో మరో రెండ్రోజులు సెలవులు వస్తున్నాయి.

25
డిసెంబర్ 16,17 సెలవే...

తెలంగాణలో ప్రస్తుతం పంచాయతీ ఎన్నికల హడావిడి కొనసాగుతోంది. మొత్తం మూడు విడతల్లో ఎన్నికలు జరుగుతున్నాయి... ఇప్పటికే రెండు విడతల ఎన్నికలు ముగిశాయి. ఈవారం మూడో విడత ఎన్నికలు కూడా పూర్తవుతాయి. డిసెంబర్ 17న మూడో విడత ఎన్నికలు జరుగుతున్న ప్రాంతాల్లో పోలింగ్ జరగనుంది. దీంతో డిసెంబర్ 16, 17 రెండ్రోజులు తెలంగాణలో మరోసారి విద్యాసంస్థలకు సెలవులు వస్తున్నాయి.

35
ఏ స్కూళ్లకి సెలవులు

తెలంగాణలో మూడో విడత పోలింగ్ జరిగే గ్రామాల్లో ఇవాళ (సోమవారం) సాయంత్రం ప్రచారానికి తెర పడనుంది. రేపు (మంగళవారం) పోలింగ్ హడావిడి మొదలవుతుంది... డిసెంబర్ 16న పోలింగ్ కేంద్రాలకు సిబ్బంది చేరుకుంటారు. సాధారణంగా గ్రామాల్లో పోలింగ్ కేంద్రాలు ప్రభుత్వ పాఠశాలల్లోనే ఉంటాయి... అందుకే మూడో విడత పోలింగ్ జరిగే గ్రామాల్లో రేపు, ఎల్లుండి (మంగళ, బుధవారం) రెండ్రోజులు సెలవులు ఉండనున్నాయి.

మూడో విడతలో 4,158 పంచాయతీ సర్పంచ్, 36434 వార్డులకు ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఎలక్షన్ కమీషన్ (EC) ప్రకటించింది. ఇందులో 394 సర్పంచ్, 7916 వార్డులు ఏకగ్రీవం అయ్యాయి... మిగతా స్థానాలకు డిసెంబర్ 17న పోలింగ్ జరగనుంది. ఈ గ్రామపంచాయితీల పరిధిలోని ప్రభుత్వ పాఠశాలలకు సెలవులు ఉండనున్నాయి.

45
ఉద్యోగులకూ సెలవే...

పంచాయతీ ఎన్నికల్లో ఓటుహక్కును వినియోగించుకునేందుకు వీలుగా ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులకు సెలవు ఉంటుంది. గవర్నమెంట్ ఉద్యోగుల్లో కొందరు పోలింగ్ డ్యూటీ నిర్వహిస్తారు.. వీరికి పోస్టల్ బ్యాలెట్ అవకాశం కల్పిస్తారు. మిగతా ఉద్యోగులకు నేరుగా ఓటు వేసేందుకు అవకాశం కల్పిస్తోంది ప్రభుత్వం.. ఇందుకోసం వారికి వేతనంతో కూడిన సెలవు ఇస్తోంది. ప్రైవేట్ సంస్థలు కూడా తమ ఉద్యోగులకు ఓటు వేసే అవకాశం కల్పించాలని... వీలైతే సెలవు లేదంటే ఓటు వేసి వచ్చేందుకు అవకాశం కల్పించాలని ప్రభుత్వం సూచించింది.

55
తెలంగాణలో క్రిస్మస్ సెలవులు ఎన్నిరోజులో తెలుసా?

ప్రతి సంవత్సరం క్రిస్మస్ సెలవులతోనే ముగుస్తుంది. 2025 లో కూడా డిసెంబర్ 25న క్రిస్మస్ వస్తోంది... ఈ నేపథ్యంలో ప్రభుత్వం రెండ్రోజులు సెలవు ఇస్తోంది ప్రభుత్వం. డిసెంబర్ 25, 26 (గురు, శుక్రవారం) తెలంగాణలో విద్యాసంస్థలు, ఉద్యోగులకు అధికారికంగా సెలవు ఇచ్చింది ప్రభుత్వం.

డిసెంబర్ 26న అంటే క్రిస్మస్ తర్వాతిరోజు భాక్సింగ్ డే. ఈరోజు కూడా తెలంగాణలో అధికారిక సెలవే. ఇలా క్రిస్మస్ పండక్కి వరుసగా రెండ్రోజుల సెలవులు వస్తున్నాయి. అయితే ఈ క్రిస్మస్ సెలవులను ఐద్రోజులకు పొడిగించుకోవచ్చు.

క్రిస్మస్ పండక్కి ముందురోజు (డిసెంబర్ 24, క్రిస్మస్ ఈవ్) కి తెలంగాణ ప్రభుత్వం ఐచ్చిక సెలవుగా ప్రకటించింది. అవసరం అనుకుంటే ఉద్యోగులు ఈ సెలవులను పొందవచ్చు. ఇక డిసెంబర్ 27 శనివారం ఒక్కరోజు మేనేజ్ చేసుకుంటే చాలు డిసెంబర్ 28 ఎలాగూ ఆదివారమే. ఇలా కావాలనుకుంటే రెండ్రోజుల క్రిస్మస్ సెలవులను ఐద్రోజులకు పొడిగించుకోవచ్చు.

Read more Photos on
click me!

Recommended Stories