Viral Video: పిచ్చి వేశాలు వేస్తే తాట తీస్తాం.. సీరియ‌స్ వార్నింగ్ ఇచ్చిన స‌జ్జ‌నార్

Published : May 15, 2025, 07:38 PM ISTUpdated : May 15, 2025, 07:39 PM IST

సోష‌ల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండేవారికి ప‌రిచ‌యం అవ‌స‌రం లేని పేరు స‌జ్జ‌నార్‌. ఆర్టీసీ ఎండీ స‌జ్జ‌నార్ సోష‌ల్ మీడియాలో నియ‌త్యం యాక్టివ్‌గా ఉంటారు. స‌మాజంలో జ‌రిగే ప్ర‌తీ అంశంపై త‌న‌దైన శైలిలో స్పందించే స‌జ్జ‌నార్ తాజాగా మ‌రో ఆస‌క్తిక‌ర‌మైన ట్వీట్ చేశారు.   

PREV
15
Viral Video: పిచ్చి వేశాలు వేస్తే తాట తీస్తాం.. సీరియ‌స్ వార్నింగ్ ఇచ్చిన స‌జ్జ‌నార్
TS RTC MD Sajjannar

సోషల్ మీడియా హవా పెరుగుతున్న నేపథ్యంలో, పాపులారిటీ కోసం కొంతమంది యువత రోడ్లపై ప్రభుత్వ ఉద్యోగులను అడ్డగించడం, ప్ర‌భుత్వ సేవలను ఆటంకపెట్టడం వంటి ప‌నులు చేస్తున్నారు. ఎలాగైనా వైర‌ల్ అవ్వాల‌న్న ఉద్దేశంతో ప్రాంక్ వీడియోలు చేస్తున్నారు. తాజాగా ఇదే అంశంపై తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్‌ఆర్టీసీ) మేనేజింగ్ డైరెక్టర్ వీసీ సజ్జనార్ తీవ్రంగా స్పందించారు.

25
RTC Rules

వీడియోలు తీసేందుకు తమ సిబ్బందిని ఉద్దేశపూర్వకంగా తక్కువ చేసేవిధంగా ప్రవర్తించడం, విధుల్లో ఉన్న వారిని అడ్డగించడం అసహ్యకరమని ఆయన విమర్శించారు. ట్విట్టర్ ద్వారా స్పందించిన ఆయన, “ఇది కామెడీ పేరుతో చేస్తున్న అనాగరికత. ప్రజలకు సేవ చేసే ఆర్టీసీ సిబ్బందిని అవమానించడమే కాదు, డ్యూటీలో ఆటంకం కలిగించడమూ.” అంటూ వ్యాఖ్యానించారు.

35
TS RTC BUS

సోషల్ మీడియాలో ఫేమస్ కావాలనే ఉద్దేశంతో చేసే అసభ్యమైన వీడియోలు, రీల్స్‌ను ఆర్టీసీ తేలికగా తీసుకోవడం లేదు. ఆర్టీసీ సిబ్బందిపై పిచ్చి కామెడీ వీడియోలు చేస్తే, వారిని గౌరవించకుండా వ్యవహరిస్తే, పోలీస్ శాఖ సహకారంతో చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చ‌రించారు. 

45
RTC Viral Video

రోడ్లపై విధులు నిర్వహిస్తున్న డ్రైవర్లు, కండక్టర్లను ఇబ్బంది పెట్టడం అనైతికమే కాక, చట్టబద్ధంగా శిక్షార్హం కూడా.
సంస్థ పరువు పోగొట్టేలా, సిబ్బంది మనోభావాలను దెబ్బతీసేలా సోషల్ మీడియా వీడియోలు చేస్తే తగిన శిక్ష తప్పదని ఆయన స్పష్టం చేశారు. 

55
RTC Viral Video

అస‌లేం జ‌రిగిందంటే.? 

ఓ యువ‌కుడు ప్రాంక్ వీడియో చేస్తూ.. ఆర్టీసీ బస్సు ద‌గ్గ‌ర‌కు వెళ్లాడు. బ‌స్సులో ఉన్న కండక్ట‌ర్‌ను.. బ‌స్సు గుంటూరు వెళ్తుందా అని ప్ర‌శ్నించాడు. నిజానికి అది సిటీ బ‌స్సు కావ‌డంతో వెళ్ల‌ద‌ని కండ‌క్ట‌ర్ స‌మాధానం ఇచ్చాడు. వెంట‌నే యువ‌కుడు త‌న కాలికి ఉన్న చెప్పును ఫోన్‌లాగా చెవు ద‌గ్గ‌ర పెట్టుకొని మాట్లాడిన‌ట్లు న‌టించాడు. దీనంత‌టినీ అక్క‌డే ఉన్న ఓ వ్య‌క్తి సీక్రెట్‌గా రికార్డ్ చేయ‌గా, సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయ్యింది. 

వివాదానికి కార‌ణ‌మైన వీడియో చూడ‌డానికి ఇక్క‌డ క్లిక్ చేయండి. 
 

Read more Photos on
click me!