తెలంగాణ‌ ఆల‌యంలో ఇట‌లీ ఆర్మీ బ్యాడ్జీలు.. అస‌లు ఎలా వ‌చ్చాయి.?

Published : May 15, 2025, 06:04 PM ISTUpdated : May 15, 2025, 06:06 PM IST

చ‌రిత్ర ఎన్నో వింత‌ల‌ను త‌న‌లో దాచుకుంటుంది. కాల గ‌ర్భంలో గ‌తించిపోయిన కొన్ని విశేషాలు ఆడ‌పాద‌డ‌ప వెలుగులోకి వ‌స్తుంటాయి. తాజాగా ఇలాంటి ఓ వింత వెలుగులోకి వ‌చ్చింది. ఇంత‌కీ ఏంటా వింత‌.? దాని వెన‌కాల ఉన్న అస‌లు క‌థ ఏంటో తెలియాలంటే ఈ స్టోరీలోకి వెళ్లాల్సిందే..   

PREV
14
తెలంగాణ‌ ఆల‌యంలో ఇట‌లీ ఆర్మీ బ్యాడ్జీలు.. అస‌లు ఎలా వ‌చ్చాయి.?
nizamabad

నిజామాబాద్ జిల్లా భీమ్గల్ మండలంలోని బీజోరా గ్రామంలో ఉన్న బేజా మహాదేవి ఆలయంలో బుధవారం రోజున ఆశ్చర్యపరిచే విషయం ఒకటి వెలుగులోకి వచ్చింది. ఆలయంలో ఇటాలియన్ ఆర్మీకి చెందిన రెండు బ్యాడ్జిలు (చిహ్నాలు) కనిపించాయి. ఈ బ్యాడ్జిలు ఇంతకాలంగా ఆలయ జాతర సమయంలో వాడుతూ వస్తున్నట్టు స్థానికులు చెబుతున్నారు. అయితే ఇవి విదేశీ ఆర్మీకి సంబంధించినవని ఎవరికీ తెలియలేదు.

24
representative image

ఈ విషయం న్యూస్ తెలంగాణ హిస్టరీ (NTH) బృందం పరిశీలించడంతో బయటపడింది. ఆలయ ట్రస్టీ వేముగంటి (జగం) రాజేశ్వర్ వారి ఆహ్వానంతో NTH బృందం ఆలయాన్ని సందర్శించింది. ఈ సందర్భంగా రాజేశ్వర్ ఆలయంలో ఉన్న రెండు బ్యాడ్జులను గుర్తించి వాటిని వీడియో తీసి రాష్ట్ర కన్వీనర్ శ్రీరామోజు హరగోపాల్‌కు పంపారు.
 

34
Temple

తదుపరి పరిశోధనలో ఆ బ్యాడ్జిలు రెండూ ఇటాలియన్ ఆర్మీకి చెందినవని స్పష్టమైంది. అందులో ఒకటి "ఆర్టిలరీ రెజిమెంట్"కు సంబంధించిన కాలనియల్ హెల్మెట్ బ్యాడ్జ్, మరోది "కావలరీ క్యాప్ బ్యాడ్జ్" అని NTH బృందం గుర్తించింది. ఈ రెండూ రెండవ ప్రపంచ యుద్ధానికి చెందినవే. ఈ బ్యాడ్జిలు సుమారు 8 సెంటీమీటర్ల పొడవులో ఉంటాయి. అవి ఆర్మీ అధికారుల్లో 'కెప్టెన్‌' హోదాను సూచించేవి.

44
representative image

ఇవి హిందూ మత సంప్రదాయానికి సంబంధం లేకపోయినా, గ్రామ జాతరలో భాగంగా మేళం ఊరేగింపు సమయంలో రథంపై ఈ బ్యాడ్జిలను ప్రతిష్టించటం అనాదిగా కొనసాగుతోందట. ఈ విషయంపై మాట్లాడిన NTH బృంద సభ్యుడు కంకనాల రాజేశ్వర్‌ మాట్లాడుతూ – "ఇటాలియన్ ఆర్మీకి చెందిన ఈ బ్యాడ్జిలు బీజోరా గ్రామానికి ఎలా వచ్చాయో మాకు ఇప్పటికీ అర్థం కావడం లేదు" అన్నారు.

Read more Photos on
click me!

Recommended Stories