Revanth Reddy: కేసీఆర్ క‌ప‌ట సూత్ర‌ధారి.. ఓ రేంజ్‌లో ఫైర్ అయిన రేవంత్ రెడ్డి

Published : May 01, 2025, 04:33 PM IST

తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌పై విరుచుకుప‌డ్డారు. ఇటీవ‌ల బీఆర్ఎస్ నిర్వ‌హించిన ర‌జ‌తోత్స‌వ స‌భ‌లో కేసీఆర్ చేసిన విమ‌ర్శ‌ల‌పై ఘాటూగా స్పందించారు. గురువారం ర‌వీంద్ర భార‌తిలో నిర్వ‌హించిన మేడే వేడుక‌ల్లో పాల్గొన్న రేవంత్ రెడ్డి ప‌లు కీలక అంశాల‌ను ప్ర‌స్తావించారు. ఆయ‌న ఏం మాట్లాడారంటే..   

PREV
15
Revanth Reddy: కేసీఆర్ క‌ప‌ట సూత్ర‌ధారి.. ఓ రేంజ్‌లో ఫైర్ అయిన రేవంత్ రెడ్డి
Telangana Chief Minister A Revanth Reddy (File photo/ANI)

తెలంగాణ రైజింగ్‌ను ఎవరూ ఆపలేరని, ఇది దేశానికే మార్గదర్శకంగా మారుతోందని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. 
ఖజానా ఖాళీ అయినా, పథకాల అమలులో వెనకడుగు వేసేది లేదు అని స్పష్టం చేశారు. ఒక్క కుటుంబ పాలనతో రాష్ట్రం రూ.8 లక్షల కోట్ల అప్పులో కూరుకుపోయిందని ఆరోపించారు. కేసీఆర్ చేసిన అప్పులు ఎక్కడ వినియోగించబడినట్టు కనపడడం లేదని విమర్శించారు.

25
Telangana Chief Minister Revanth Reddy

రాష్ట్రం ప్రతి నెల అప్పులపై రూ. 10వేల కోట్ల వడ్డీ చెల్లింపులు భరిస్తోందని తెలిపారు. 10 ఏళ్ల నష్టాలను పూడ్చుకుంటూ ముందుకు సాగుతున్నాం అని చెప్పారు. కేసీఆర్ తిరిగి విషం చిమ్మే ప్రయత్నాలు చేస్తున్నారని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. కేసీఆర్‌ను క‌ప‌ట సూత్ర‌ధారిగా రేవంత్ అభివ‌ర్ణించారు. దళితుడిని ముఖ్య‌మంత్రి చేస్తాన‌ని చేయ‌లేదు, క‌నీసం ప్ర‌తిప‌క్ష నేత‌గా కూడా చేయ‌లేదంటే ఆయన నైతిక స్థాయే అర్థమవుతుంది అని ఎద్దేవా చేశారు.
 

35
Telangana Chief Minister Revanth Reddy (Pic/@revanth_anumula)

కాళేశ్వరం ప్రాజెక్ట్ మూడు ఏళ్లకే కుప్ప‌కూలిపోయింద‌న్న రేవంత్ విద్యుత్ రంగం బీఆర్ఎస్ పాలనలో సంక్షోభానికి లోనయ్యిందన్నారు. తాను ఒక్క పైసా అవినీతికి తలొగ్గను అని స్పష్టం చేశారు. సర్పంచుల పెండింగ్ బిల్లులకు కేసీఆర్ ప్రభుత్వమే కారణమన్నారు.  ఇక ఆర్టీసీ కార్మికులు స‌మ్మె ఆలోచ‌న‌ను విర‌మించుకోవాల‌ని సీఎం సంద‌ర్భంగా కోరారు. ఆర్టీసీ కార్మికులకు సమ్మె అవసరం లేదని, ప్రస్తుతం సంస్థ గాడిలో పడుతోందని వివరించారు.
 

45
Revanth Reddy

ఆర్టీసీకి నష్టాల నుంచి బయటపడేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. తెలంగాణ చేపట్టిన కుల గణనా దేశానికి ఆదర్శంగా నిలుస్తుందని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో నిరుద్యోగ సమస్యలను ఫోకస్‌గా తీసుకుని, వరుసగా నియామకాలు చేపడుతున్నామన్నారు. సింగరేణి, ఆర్టీసీలో కారుణ్య నియామకాలు అమలు చేస్తూ ఉన్నామన్నారు.

55

అసంఘటిత కార్మికుల సమస్యలపై సత్వర పరిష్కారాలు తీసుకుంటున్నట్టు తెలిపారు.  నిరుద్యోగ సమస్యలను  పరిష్కరించడంలో తెలంగాణ దేశంలోనే ఫస్ట్ అని అన్నారు.  ప్రతి నెల 1వ తేదీన ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు చెల్లిస్తున్న ప్రభుత్వం ఇదే అని తెలిపారు. 
 

Read more Photos on
click me!

Recommended Stories