Ration Card: దేశంలోని కోట్లాది రేషన్ కార్డు లబ్ధిదారులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త తెలిపింది. పేదలకు ఆహార భద్రత కల్పించే ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన (PMGKAY) కింద అందించే రేషన్ పంపిణీలో కీలక మార్పులు చేస్తున్నట్లు ప్రకటించింది.
కేంద్ర ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయం ప్రకారం 2026 ఏప్రిల్, మే, జూన్ నెలలకు సంబంధించిన ఉచిత రేషన్‌ను ఒకేసారి ఇవ్వాలని భావిస్తోంది. ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన కింద ఉన్న కుటుంబాలకు ఈ సదుపాయం వర్తించనుంది. ఈ నిర్ణయం అమలులోకి వస్తే లబ్ధిదారులు తమకు కేటాయించిన మూడు నెలల ధాన్యాన్ని ఒకేసారి తీసుకోవచ్చు. ఆహార, ప్రజా పంపిణీ శాఖ ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వాలకు దీనిపై సూచనలు పంపినట్లు సమాచారం.
25
ఈ నిర్ణయానికి కారణం ఏంటంటే.?
ఈ ఏడాది వేసవిలో ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండే అవకాశముందని వాతావరణ శాఖ ముందుగానే హెచ్చరికలు జారీ చేసింది. ఈ పరిస్థితుల్లో ప్రజలు లైన్టలో నిలబడే అవసరం లేకుడా ఒకేసారి రేషన్ ఇవ్వాలనే ఆలోచనతో కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రత్యేకంగా గ్రామీణ ప్రాంతాల్లో నివసించే వృద్ధులు, మహిళలు, దూరప్రాంత ప్రజలకు ఇది మరింత ఉపయోగకరంగా ఉంటుంది.
35
గోదాముల్లో అధిక ధాన్యం నిల్వ
ప్రస్తుతం భారత ఆహార సంస్థ (FCI) గోదాముల్లో పెద్ద మొత్తంలో ధాన్యం నిల్వగా ఉంది. రబీ పంట మార్కెట్లోకి రానున్న నేపథ్యంలో నిల్వలకు స్థలం కల్పించడం అవసరమైంది. అంచనాల ప్రకారం కేంద్ర గోదాముల్లో 800 లక్షల మెట్రిక్ టన్నులకు పైగా ధాన్యం నిల్వగా ఉందని తెలుస్తోంది. ఈ నిల్వలను ప్రజలకు త్వరగా పంపిణీ చేయాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలను ఆదేశించింది.
రేషన్ వ్యవస్థలో పారదర్శకత పెంచేందుకు కేంద్రం గత కొన్నేళ్లుగా పలు సంస్కరణలు అమలు చేస్తోంది. ఈ ప్రక్రియలో భాగంగా 2025లో దేశవ్యాప్తంగా సుమారు 4.141 మిలియన్ అనర్హ రేషన్ కార్డులను రద్దు చేశారు. వివరాల ప్రకారం హర్యానాలోనే 1.343 మిలియన్ కార్డులు రద్దయ్యాయి. రాజస్థాన్‌లో కూడా పెద్ద సంఖ్యలో నకిలీ కార్డులు తొలగించారు. ఉత్తర ప్రదేశ్‌లో సుమారు ఆరు లక్షల పేర్లను జాబితా నుంచి తొలగించినట్లు సమాచారం.
55
డిజిటల్ వ్యవస్థతో పారదర్శక పంపిణీ
రేషన్ పంపిణీ వ్యవస్థను మరింత పారదర్శకంగా మార్చేందుకు ప్రభుత్వం డిజిటల్ విధానాలను విస్తృతంగా అమలు చేసింది. ప్రస్తుతం దేశంలోని 99 శాతం కంటే ఎక్కువ ఫెయిర్ ప్రైస్ షాపుల్లో ePOS యంత్రాలు ఏర్పాటు చేశారు. బయోమెట్రిక్ ధృవీకరణ ద్వారా 98 శాతం వరకు రేషన్ పంపిణీ జరుగుతోంది. దీంతో అర్హులకే సరుకులు అందేలా వ్యవస్థ బలోపేతం అవుతోంది. మూడు నెలల రేషన్‌ను ఒకేసారి ఇవ్వడం వల్ల రవాణా ఖర్చులు తగ్గడమే కాకుండా వర్షాకాలంలో రవాణా సమస్యలు ఎదురయ్యే దూరప్రాంత గ్రామాలకు కూడా సౌలభ్యం కలుగుతుందని నిపుణులు చెబుతున్నారు. మొత్తంగా ఈ నిర్ణయం పేద కుటుంబాలకు పెద్ద ఉపశమనం ఇవ్వనుంది.