మీ రేషన్ కార్డులోని సభ్యులకు ఈ-కేవైసీ పూర్తయిందో లేదో ఇంటి వద్దే ఉండి ఫోన్ లో చెక్ చేసుకోవచ్చు:
1. ముందుగా తెలంగాణ స్మార్ట్ పీడీఎస్ అధికారిక పోర్టల్ ([https://smartpds.telangana.gov.in/](https://smartpds.telangana.gov.in/)) ఓపెన్ చేయాలి.
2. హోమ్ పేజీలో ఉండే Beneficiary Details అనే ఆప్షన్ పై క్లిక్ చేయాలి.
3. మీ రేషన్ కార్డు నంబర్, స్క్రీన్ పై కనిపించే క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి సబ్మిట్ చేయాలి.
4. స్క్రీన్ పై మీ రేషన్ కార్డులోని సభ్యుల వివరాలు, వారి ఈ-కేవైసీ స్టేటస్ కనిపిస్తుంది.
5. స్టేటస్ 'Active' అని ఉంటే మీ కేవైసీ పూర్తయినట్లే.
ఆగస్టు 31 వరకు సమయం ఉన్నప్పటికీ, చివరి నిమిషం వరకు వేచి చూడకుండా వెంటనే సమీప రేషన్ షాపుకు వెళ్లి ఈ-కేవైసీ పూర్తి చేసుకుని, 3 నెలల రేషన్ సరుకులను తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.