Rajiv swagruha: హైద‌రాబాద్‌లో అతి త‌క్కువ ధ‌ర‌లో అపార్ట్‌మెంట్స్.. ప్ర‌భుత్వం అందించే వాటిని ఎలా సొంతం చేసుకోవాలంటే

Published : Jun 09, 2025, 12:00 PM IST

హైద‌రాబాద్‌లో సొంతిళ్లు కొనుక్కోవాల‌ని చాలా మంది క‌ల‌లు కంటారు. అయితే ప్ర‌స్తుతం అపార్ట్‌మెంట్‌లో ఫ్లాట్ కొనాల‌న్నా రూ. 60 ల‌క్ష‌లు పెట్టాల్సిన ప‌రిస్థితి. అయితే త‌క్కువ ధ‌ర‌లో అపార్ట్‌మెంట్‌లో ఫ్లాట్ సొంతం చేసుకునే అవ‌కాశం ఒక‌టి ల‌బిస్తోంది.

PREV
15
రాజీవ్ స్వ‌గృహ

2007లో అప్పటి ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్. రాజశేఖర రెడ్డి ప్రభుత్వం ప్రారంభించిన రాజీవ్ స్వగృహ పథకం, ప్రధానంగా మధ్యతరగతి, పేద ప్రజలకు తక్కువ ధరలకు సౌకర్యవంతమైన ఇళ్లు అందించేందుకు రూపొందించారు. రియల్ ఎస్టేట్ ధరల వేగంగా పెరుగుతున్న సమయంలో, సామాన్యుడికి సొంతింటి కల తీరేలా చేయాలనే సంకల్పంతో ఈ పథకాన్ని తీసుకొచ్చారు.

25
పూర్తి మౌలిక వసతులతో

ఈ పథకం కింద వివిధ ప్రాంతాల్లో ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్‌ల రూపకల్పన చేపట్టారు. పక్కా రోడ్లు, డ్రైనేజీ, విద్యుత్, మంచినీరు వంటి అవసరమైన మౌలిక వసతులతో కూడిన అపార్ట్‌మెంట్‌లు, ఇండిపెండెంట్ హౌసింగ్ యూనిట్లు అందించాలన్నది ముఖ్య ఉద్దేశం. మొదటి దశలో 3,716 ఫ్లాట్లు, 556 గృహాల నిర్మాణ లక్ష్యంగా పెట్టుకొని, 2013 నాటికి వాటిలో 2,956 ఫ్లాట్లు, 195 ఇండిపెండెంట్ హౌసులు పూర్తి చేశారు.

35
ఎంత ఖ‌ర్చు చేశారంటే

ఈ పథకంపై ప్రభుత్వం దాదాపు రూ. 1809.56 కోట్ల వరకు ఖర్చు పెట్టగా, బ్యాంకుల నుంచి రూ. 919.31 కోట్ల రుణంగా తీసుకున్నారు. కానీ పూర్తి స్థాయిలో అమ్మకాలు జరగకపోవడం, నిర్మాణ సమస్యల వల్ల ఆస్థుల విలువ తగ్గిపోవడం వంటి కారణాలతో సుమారు రూ. 1046 కోట్ల నష్టాన్ని ప్రభుత్వం మూటగట్టుకుంది.

45
వేలానికి మిగిలిన అపార్ట్‌మెంట్స్

ప్రస్తుతం మిగిలిన అపార్ట్‌మెంట్‌లు, ఓపెన్ ప్లాట్లు విక్రయానికి సిద్ధంగా ఉన్నాయి. 11 ప్రాంతాల్లో పాక్షికంగా పూర్తయిన అపార్ట్‌మెంట్‌లు, నాలుగు చోట్ల ఖాళీ స్థలాలను వేలం ద్వారా విక్రయించాలని నిర్ణ‌యించారు. 2025 జూన్ 20వ తేదీన నోటిఫికేషన్ విడుదల చేసి, బహిరంగ వేలానికి తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. 

వివాదాల లేని భూములే వేలంలో నిర్వ‌హిస్తామ‌ని అధికారుల స్పష్టం చేశారు. ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని గృహ నిర్మాణ సంస్థ కమిషనర్ పి.వి. గౌతమ్ కోరారు.

55
ఎక్క‌డ అందుబాటులో ఉన్నాయి.

రాజీవ్ స్వగృహకు సంబంధించి గాజుల రామారం, పోచారం, ఖమ్మంలోని పోలేపల్లి ప్రాంతాల్లో అసంపూర్తిగా ఉన్న టవర్లను మొత్తంగా విక్రయించనున్నారు. రంగారెడ్డి జిల్లా తొర్రూరులో 514, కుర్మల్ గూడలో 20, చందానగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని 3 ఓపెన్ ఫ్లాట్లు, బండ్లగూడలో 159 పూర్తియిన ఫ్లాట్లు, మేడ్చల్ -మల్కాజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గిరి గాజులరామారంలో 5 టవర్లలోని పూర్తి కాని టవర్లు, పోచారంలోని పూర్తయిన 601 ఫ్లాట్లు, అసంపూర్తిగా ఉన్న 6 టవర్లలోని వివిధ రకాల ఫ్లాట్లు, బహదూర్ పల్లిలోని 69 ఓపెన్ ప్లాట్లు ఉన్నాయి.

ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రజలను హౌసింగ్ అధికారులు కోరుతున్నారు. వేలం ద్వారా వచ్చిన ఆదాయంతో ఔటర్ రింగ్ రోడ్ పరిసరాల్లోనూ, ఇతర జిల్లాల్లోనూ సాధారణ ప్రజలకు హౌసింగ్ టౌన్ షిప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు చేపట్టాలని ప్రభుత్వం భావిస్తోంది.

Read more Photos on
click me!

Recommended Stories