Harish Rao: కాళేశ్వరం విచారణ కమిషన్ ముందుకు హరీష్ రావు

Published : Jun 09, 2025, 10:07 AM IST

Harish Rao: కాళేశ్వరం బ్యారేజీలపై న్యాయ విచారణలో భాగంగా సోమవారం జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్‌ ఎదుట హాజరుకానున్న హరీష్ రావు భద్రతను ముమ్మరం చేశారు.

PREV
15
జస్టిస్‌ పీసీ ఘోష్‌ కమిషన్‌ ముందుకు తన్నీరు హరీష్ రావు

Harish Rao: కాళేశ్వరం ఎత్తిపోతల పథకం లోపాలపై న్యాయ విచారణ చేపట్టిన జస్టిస్‌ పీసీ ఘోష్‌ కమిషన్‌ ఎదుట సోమవారం నీటిపారుదలశాఖ మాజీ మంత్రి, ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు హాజరవుతున్నారు. హైదరాబాద్‌లోని బీఆర్‌కే భవన్‌లో ఏర్పాటు చేసిన కమిషన్‌ కార్యాలయంలో ఉదయం 11 గంటలకు ఆయన విచారణకు హాజరు కానున్నారు.

25
కాళేశ్వరం ఎత్తిపోతల పథకంపై న్యాయ విచారణ

కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా ఉన్న మేడిగడ్డ బ్యారేజీ పియర్స్ కుంగిన ఘటనతో పాటు అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణాల్లో పగుళ్లు, లోపాలు బయటపడిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం న్యాయ విచారణ కోసం ఈ కమిషన్‌ను నియమించింది. ఇప్పటి వరకు పలువురు ఉద్యోగులు, మాజీ అధికారులు కమిషన్‌ ముందు హాజరై వివరణ ఇచ్చారు.

35
కాళేశ్వరం నిజాలపై కాంగ్రెస్ అసత్య ప్రచారం చేస్తోంది: హరీష్ రావు

తెలంగాణ ప్రజలకు కాళేశ్వరం ప్రాజెక్టు ఒక "కామధేనువులాంటిది" అని భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) ఎమ్మెల్యే, మాజీ నీటిపారుదలశాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు పేర్కొన్నారు. ఆదివారం ఆయన కాళేశ్వరం ప్రాజెక్టుపై పవర్ పాయింట్‌ ప్రజెంటేషన్‌ను ఏర్పాటు చేసి, ప్రాజెక్టుతో రాష్ట్రానికి కలిగిన లాభాలను వివరించారు.

45
కాళేశ్వరం ప్రాజెక్టుతో కొత్త ఆయకట్టు 98,570 ఎకరాలకు సాగునీరు

ఇప్పటివరకు కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా కొత్త ఆయకట్టు 98,570 ఎకరాలకు సాగునీరు అందించామని హరీష్ రావు తెలిపారు. అలాగే, 456 చిన్న కాలువల ద్వారా 39,146 ఎకరాలకు నీరు అందించినట్టు వెల్లడించారు. మొత్తం మీద 20,33,572 ఎకరాలకు కాళేశ్వరం ద్వారా సాగునీరు అందిందని వివరించారు. “అయితే కాంగ్రెస్ నాయకులు   ఈ ప్రాజెక్టు నీళ్లు ఒక్క ఎకరం కూడా సాగుకు రాలేదని చెబుతున్నారు.. ఇది వాస్తవానికి ఎంత దూరంలో ఉందో తెలుస్తోందని” ఆయన అన్నారు.

55
కాళేశ్వరం పై ప్రశంసల వీడియోలు చూపించిన హరీష్ రావు

ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు నాయుడు, తెలంగాణ రోడ్డు మంత్రివర్గ సభ్యులు కొమటిరెడ్డి వెంకట్ రెడ్డి, మాజీ సిడబ్ల్యూసీ చైర్మన్ సయ్యద్ మసూద్ హుస్సేన్ వంటి పలువురు ప్రముఖులు కాళేశ్వరం ప్రాజెక్టును ప్రశంసించిన వీడియోలు కూడా హరీష్ రావు చూపించారు.

తుమ్మిడిహెట్టి నుండి మేడిగడ్డకు ప్రాజెక్టు మూలాన్ని మార్చడం వెనుక వాస్తవాలను వివరించారు. ఈ ప్రదేశాన్ని వాప్కాస్ (WAPCOS) సంస్థే ఎంపిక చేసిందని హరీష్ రావు స్పష్టం చేశారు.

Read more Photos on
click me!

Recommended Stories