దక్షిణ, మధ్య, పశ్చిమ తెలంగాణ జిల్లాల్లో వర్షాలు కురిసేందుకు అనుకూల పరిస్థితులు ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అంచనా వేస్తోంది. ముఖ్యంగా నిజామాబాద్, కామారెడ్డి, జగిత్యాల, మెదక్, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో అక్కడక్కడా మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. అదేవిధంగా నారాయణపేట, మహబూబ్‌నగర్, జోగులాంబ గద్వాల, వనపర్తి, నాగర్‌కర్నూల్ జిల్లాల్లో కూడా వర్ష ప్రభావం కనిపించవచ్చని అంచనా. ఇప్పటికే రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో వర్షాలు నమోదవుతుండగా, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, నల్గొండ జిల్లాల్లో పలుచోట్ల వర్షపాతం నమోదైంది.