Weather: మళ్లీ మూడు రోజుల పాటు వర్షాలు.. ఈ జిల్లాలకు హెచ్చరికలు

Weather Telangana rains: తెలంగాణలో మండే ఎండలతో పాటు వానలు కూడా కురుస్తున్నాయి. ఈ వారం ప్రారంభం నుంచి ఎండల తీవ్రత పెరిగింది. ఇదే సమయంలో రాష్ట్రంలో మరో మూడు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) ప్రకటించింది. పలు జిల్లాలలకు హెచ్చరికలు జారీ చేసింది. 
 

Weather Heavy rains: Rains again for three days in Telangana.. Warnings for these districts in telugu rma
Weather : Situation in Other Telangana Districts

Weather Telangana rains: వడదెబ్బలతో వణికిస్తున్న మండే ఎండలు, మరోవైపు వర్షాలు.. తెలంగాణలో ఇప్పుడు ఇదే వాతావరణం ఉంది. ఒకవైపు ఉష్ణోగ్రతల పెరుగుదల, ఎండల హెచ్చరికలతో పాటు వర్షాలు కురుస్తాయని కూడా భారత వాతవరణ శాఖ (ఐఎండీ) హెచ్చరికలు జారీ చేసింది. తెలంగాణలోని పలు జిల్లాలతో పాటు హైదరాబాద్ నగరంలో మూడు రోజులు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. 

Weather Heavy rains: Rains again for three days in Telangana.. Warnings for these districts in telugu rma
Rain Forecast for Telangana

భారత వాతావరణ శాఖ (IMD) తాజా అంచనాల ప్రకారం, ఏప్రిల్ 24 నుండి 26 వరకు తెలంగాణలోని పలు జిల్లాలు, హైదరాబాద్ నగరంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయి. పలు ప్రాంతాల్లో  ఉరుములు మెరుపులతో కూడిన వానలు కూడా  పడతాయని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. 


Weather Outlook Across Telangana

తెలంగాణలో మళ్లీ ఎప్పటి నుంచి వర్షాలు కురుస్తాయి? 

వాతావరణ శాఖ అంచనాల ప్రకారం.. హైదరాబాద్ నగరంలో మధ్యాహ్నం, సాయంత్రం వేళల్లో మేఘావృత వాతావరణం ఉంటుంది. వర్షాల కారణంగా ఉష్ణోగ్రతలు కొంత తగ్గే అవకాశముంది. ఏప్రిల్ 24 నుంచి 26వ తేదీ వరకు నగరంలో వర్షం కురిసే అవకాశముంది. ఈ క్రమంలోనే ఎల్లో అలర్ట్ ప్రకటించారు. వర్షాల ప్రభావంతో కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు తగ్గుతాయి. సాధారణంగా ఉష్ణోగ్రతలు 36-40 డిగ్రీల మధ్య  నమోదయ్యే అవకాశముందని ఐఎండీ తెలిపింది.

Three Days of Rain Forecast for Hyderabad: IMD Issues Yellow Alert

తెలంగాణలోని ఈ జిల్లాలకు హెచ్చరికలు 

తెలంగాణలో మూడు రోజులు ఎండలతో పాటు వర్షాలు కూడా కురవనున్నాయి. యాదాద్రి, మహబూబ్ నగర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, సిద్దిపేట, మెదక్, జనగామ జిల్లాల్లో ఈ ఆకస్మిక వర్షాలు పడే అవకాశముంది. హైదరాబాద్ నగరంలోని చాలా ప్రాంతాల్లో వర్షాలు పడే అవకాశాలున్నాయి. 

Heatwave Alerts in Northern Telangana Districts

అలాగే, ఉత్తర తెలంగాణ జిల్లాలకు హెచ్చరికలు జారీ చేశారు. ఆదిలాబాద్, కుమారం భీమ్, నిర్మల్, మంచిర్యాలలలో ఏప్రిల్ 25వ తేదీ వరకు తీవ్రమైన వేడిగాలులు వీస్తాయని ఐఎండీ హెచ్చరించింది. ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఈ ప్రాంతాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల సెల్సియస్ దాకా చేరే అవకాశం ఉంది. హైదరాబాద్‌లో కూడా 42 డిగ్రీల వరకు ఉష్ణోగ్రత నమోదవుతుందని అంచనా. 

Weather Rain Alert: When and Where Will It Rain?

ఖమ్మం, నల్గొండ, వరంగల్, హన్మకొండ, జనగాం, సంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్‌గిరి, రంగారెడ్డి సహా పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. రాత్రివేళల్లో కూడా వేడి వాతావరణం ఉంటుందని హెచ్చరికలలో పేర్కొంది. వాతావరణ శాఖ సూచనల ప్రకారం, అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లకూడదు. వేడిగాలుల ప్రభావం తీవ్రంగా ఉంటాయి. ఇదే సమయంలో అకాల వర్షాలు కూడా ప్రభావం చూపుతాయి. పలు ప్రాంతాల్లో వడగళ్లు పడే అవకాశముంది. పిడుగులు పడే ఛాన్స్ కూడా ఉందని ఐఎండీ హెచ్చరించింది. 

Latest Videos

vuukle one pixel image
click me!