గురువారం ఇంటి నుంచి అడుగు బయట పెట్టేందుకు ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోవాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా తెలంగాణలో ఎండలు దంచికొట్టే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అందులోనూ ఉత్తర తెలంగాణలో ఎండ తీవ్రత మరీ ఎక్కువగా ఉండే అవకాశం ఉందని చెబుతున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.
ఉత్తర తెలంగాణ వ్యాప్తంగా ఈరోజు ఏకంగా 44 నుంచి 45 డిగ్రీలు నమోదయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు. ఈ సమ్మర్‌లో ఇదే అత్యధిక ఉష్ణోగ్రత కావడం గమనార్హం. ఇక హైదరాబాద్ విషయానికొస్తే ఇక్కడ 41 నుంచి 42 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం చెబుతున్నారు. మధ్యాహ్నం తీవ్రమైన వడగాలులు వీచే అవకాశం ఉందని, వీలైనంత వరకు ఇంటి పట్టున ఉండి, హైడ్రేట్‌గా ఉండాలని సూచిస్తున్నారు.
ఓవైపు ఎండలు, మరోవైపు ఉరుములు..
ఇదిలా ఉంటే తెలంగాణలో విచిత్రమైన వాతావరణం ఉండే అవకాశాలు ఉంటాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. ఎక్కువ ఉష్ణోగ్రతల కారణంగా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. పశ్చి, మధ్య తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. హైదరాబాద్‌లో కూడా సాయంత్రం ఉరుములతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
heavy rain thrisur
మూడు రోజుల పాటు వర్షాలు
ఎండలు దంచికొడుతున్న తరుణంలో వాతావరణ శాఖ ఒక కూల్ న్యూస్ చెప్పింది. తెలంగాణలో ఏప్రిల్ 24 నుంచి 26 వరకు తెలంగాణలోని పలు జిల్లాలు, హైదరాబాద్ నగరంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. పలు ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వానలు కూడా పడతాయని వాతావరణ కేంద్రం హెచ్చరించింది.