School Holidays : తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు... ఈ రెండ్రోజులు స్కూళ్లకి సెలవులే

Published : Sep 12, 2025, 05:41 PM ISTUpdated : Sep 12, 2025, 05:51 PM IST

School Holidays : తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ లో ఈ రెండ్రోజులు (సెప్టెంబర్ 13, 14) భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయి. అయితే ఈ రెండ్రోజులూ విద్యాసంస్థలకు సెలవులే. 

PREV
15
భారీ వర్షాలు కురిసే ఈ రెండ్రోజులు సెలవులే

School Holidays : తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ లో భారీ వర్షాలు కురుస్తున్నాయి... రాబోయే రెండుమూడు రోజులు వర్షాల తీవ్రత మరింత ఎక్కువగా ఉంటుందని భారత వాతావరణ శాఖ (IMD) ఇప్పటికే హెచ్చరించింది. అయితే మరో రెండ్రోజులు కుండపోత వర్షాలు కురిసినా తెలుగు రాష్ట్రాల విద్యార్థులకు ఏం భయంలేదు… ఎందుకంటే వరుసగా రెండ్రోజులు (శని, ఆదివారం) తెలుగు రాష్ట్రాల్లోని విద్యాసంస్థలకు సెలవులు ఉన్నాయి. వర్షాల వేళ ఈ సెలవులు వస్తుండటంతో విద్యార్థులు ఇంటికే పరిమితం అవుతారు... కాబట్టి తల్లిదండ్రులు కంగారుపడాల్సిన అవసరం ఉండదు. ప్రభుత్వం కూడా భారీ వర్షాల కారణంగా విద్యాసంస్థలకు ప్రత్యేక సెలవు ఇవ్వాల్సిన అవసరం లేదు.

25
సెప్టెంబర్ 13, 14 ఎందుకు సెలవు?

సాధారణంగా ప్రతి నెలలో రెండో శనివారం తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ లో విద్యాసంస్ధలకు సెలవు ఉంటుంది. ఇలా రేపు వచ్చేది సెప్టెంబర్ లో రెండో శనివారం. కాబట్టి ఈరోజు తెలుగు రాష్ట్రాల్లోని ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్ విద్యాసంస్థలకు సెలవు ఉంటుంది. తర్వాతిరోజు ఎలాగూ ఆదివారమే కాబట్టి సాధారణ సెలవు. ఇలా తెలుగు విద్యార్థులకు వరుసగా రెండ్రోజులు సెలవులు వస్తున్నాయి.

కొందరు ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులకు కూడా రెండో శనివారం సెలవు ఉంటుంది. ఇక ఐటీ, కార్పోరేట్ సంస్థల ఉద్యోగులకు ప్రతి శని, ఆదివారం సెలవు ఉంటుంది. ఇలా విద్యార్థులతో పాటు ఉద్యోగాలు చేసే పేరెంట్స్ కి కూడా ఈ రెండ్రోజులు సెలవే. ఇలా పిల్లలు, పేరెంట్స్ కి వరుస సెలవులు కలిసివస్తున్నా ఎక్కడికీ వెళ్లలేని పరిస్థితి... భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ఇంటికే పరిమితం కానున్నారు.

హైదరాబాద్ లో భారీ వర్షాల కారణంగా వరదనీరు రోడ్లపైకి చేరి ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతాయి... కానీ రెండో శనివారం, వీకెండ్ కారణంగా విద్యార్థులు, ఉద్యోగులకు సెలవు ఉంటే ట్రాఫిక్ సమస్యలు కూడా ఉండవు. అలాగే వర్షాల వల్ల విద్యార్థులు, ఉద్యోగులకు ఇబ్బంది ఉండదు.

35
ఈ తెలంగాణ జిల్లాల్లో భారీ వర్షాలు

బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితలం ఆవర్తనం బలపడి అల్పపీడనంగా మారినట్లు ఐఎండి తెలిపింది. దీంతో రాబోయే రెండ్రోజులు (శని, ఆదివారం) తెలంగాణలో భారీ నుండి అతిభారీ వర్షాలు కురుస్తాయని.. అక్కడక్కడా ఇటీవల కామారెడ్డి, మెదక్ లో మాదిరిగా క్లౌడ్ బరస్ట్ జరిగి అసాధారణ వర్షం కురిసే అవకాశాలున్నాయని హెచ్చరిస్తున్నారు వాతావరణ నిపుణులు. ఈ వర్షాలకు ఉరుములు మెరుపులు, పిడుగులు, బలమైన ఈదురుగాలులు తోడై ప్రమాదాలను సృష్టించే అవకాశాలుంటాయి... కాబట్టి అధికారులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం సూచిస్తోంది.

ఇవాళ (శుక్రవారం) తెలంగాణలోని ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, సూర్యాపేట, ఖమ్మం జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయంటూ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. ఇక రేపు (శనివారం, సెప్టెంబర్ 13న) నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి జిల్లాలతో పాటు హైదరాబాద్ లో కూడా భారీ నుండి అతిభారీ వర్షాలు కురిసే ఛాన్సెస్ ఉన్నాయట. దీంతో ఆయా జిల్లాల ప్రజలు మరీముఖ్యంగా హైదరాబాద్ ప్రజలు ఇళ్లలోంచి బయటకు రావద్దని సూచిస్తున్నారు. ఎలాగూ స్కూళ్లు, ఆఫీసులకు సెలవే కాబట్టి రెండ్రోజులు ఇంటికి పరిమితం కావాలని సూచిస్తున్నారు.

45
ఏపీలో భారీ వర్షాలు

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో రాబోయే 3 రోజులపాటు ఆంధ్ర ప్రదేశ్ లో కూడా జోరువానలు కురుస్తాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ప్రస్తుతం అల్పపీడనం ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా తీరంలో కేంద్రీకృతం అయ్యిందని... 48 గంటల్లో దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర, దక్షిణ ఛత్తీస్‌గఢ్ మీదుగా పశ్చిమ వాయువ్య దిశగా కదిలే అవకాశం ఉందని తెలిపారు. దీని ప్రభావంతో రాష్ట్రంలో మూడు రోజులు అక్కడక్కడ పిడుగులతో కూడి మోస్తరు నుంచి భారీ వర్షాలు... ఉత్తరాంధ్ర జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు... మిగతా జిల్లాల్లో కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు,

ముఖ్యంగా కోస్తా జిల్లాలకు భారీ వర్ష సూచనలు ఉన్నాయట... అందుకే 5 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, 2 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. అనకాపల్లి, కాకినాడ, ఏలూరు, ఎన్టీఆర్, తూర్పు గోదావరి జిల్లాలో భారీ నుంచి అతిభారీ వర్షాలు... కర్నూలు, నంద్యాల జిల్లాలకు భారీ వర్ష సూచనలు ఉన్నాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో గంటకు 40-50 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశాలు ఉన్నాయని హెచ్చరించారు.

55
కాంగ్రెస్ కామారెడ్డి సభ వాయిదా

తెలంగాణ కాంగ్రెస్ కామారెడ్డి జిల్లాలో భారీ బహిరంగ సభకు ప్లాన్ చేసిన విషయం తెలిసిందే. సెప్టెంబర్ 15న బిసి మహా గర్జన పేరిట భారీ సభ నిర్వహించాలనుకుంది కాంగ్రెస్… భారీ వర్షాల నేపథ్యంలో ఈ సభను వాయిదా వేసింది కాంగ్రెస్. త్వరలోనే ఈ సభను తిరిగి ఎప్పుడు నిర్వహించాలన్నది నిర్ణయిస్తామని కాంగ్రెస్ నాయకులు చెబుతున్నారు.

Read more Photos on
click me!

Recommended Stories