భవిష్యత్ విద్యుత్ వాహనాలదే... వాడకానికి వెనుకాడొద్దు: మంత్రి జగదీష్ రెడ్డి

Arun Kumar P   | Asianet News
Published : Oct 29, 2021, 05:24 PM IST

ఈ కాలంలో విద్యుత్ వాహనాల వాడకం తప్పనిసరి అయిందని... భవిష్యత్ ఈ వాహనాలదేనని  విద్యుత్ శాఖ మంత్రి  గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు. 

PREV
16
భవిష్యత్ విద్యుత్ వాహనాలదే... వాడకానికి వెనుకాడొద్దు: మంత్రి జగదీష్ రెడ్డి

 హైదరాబాద్ హైటెక్స్ లో విద్యుత్ వాహనాల ప్రదర్శనను తెలంగాణ విద్యుత్ శాఖ మంత్రి  గుంటకండ్ల జగదీష్ రెడ్డి ప్రారంభించారు. TSREDCO (Telangana State Renewable Energy Development Corporation) ఆధ్వర్యంలో ఈవి ట్రెడ్ ఎక్స్పో విద్యుత్ వాహనాల ప్రదర్శన శుక్రవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి జగదీష్ రెడ్డి స్వయంగా ఎలక్ట్రిక్ బైక్ ను నడిపారు. 

26

ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ... భవిష్యత్ కాలంలో విద్యుత్ వాహనాల వాడకం తప్పనిసరి అయిందన్నారు. అందులో భాగమే నేడు మనం  ప్రారంభించుకుంటున్న  విద్యుత్ వాహనాల ప్రదర్శన అని ఆయన పేర్కొన్నారు. 
 

36

కేవలం 10 వేల విద్యుత్ మోటారు సైకిళ్ళు వినియోగంలోకి వచ్చినట్లైతే సంవత్సరానికి 250కోట్ల రూపాయల పెట్రోల్ దిగుమతులు ఆదా చేసినవారం అవుతామన్నారు మంత్రి జగదీష్ రెడ్డి. ప్రపంచానికి పర్యావరణ కాలుష్యం చాలెంజ్ గా మారిన నేపధ్యంలో విద్యుత్ వాహనాల వాడకం తప్పనిసరైందని ఆయన చెప్పారు. 
 

46

పర్యావరణ కాలుష్యాన్ని దృష్టిలో పెట్టుకుని ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర ఐటి, పురపాలక, పరిశ్రమల శాఖామంత్రి కేటీఆర్ విద్యుత్ వాహనాలను ప్రోత్సాహించడంతో పాటు వాహనాలు తయారీ చేస్తున్న పారిశ్రామికవేత్తలను ప్రోత్సాహం కల్పిస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. విద్యుత్ వాహనాల అమ్మకాలను మాత్రమే కాకుండా ఇక్కడే తయారీ చేసే విదంగా పారిశ్రామిక వేత్తలను రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సాహిస్తుందన్నారు మంత్రి. 

56

విద్యుత్ వాహనాలకు అవసరమైన బ్యాటరీ పరిశ్రమలను తెలంగాణ లో నెలకొల్పే విదంగా రాష్ట్ర ప్రభుత్వం తగిన రాయితీలు ఇచ్చిమరీ ఎంకరేజ్ చేస్తుందన్నారు. వాడకంలోకి వచ్చిన విద్యుత్ వాహనాల ఛార్జింగ్ కు సందేహ పడొద్దని... ఇప్పటికే 138 ఛార్జింగ్ కేంద్రాలను ప్రారంభించినట్లు... మరో 600 ఛార్జింగ్ కేంద్రాల ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు ఆయన తెలిపారు. 

66

తెలంగాణా రాష్ట్రంలో 24 గంటల నిరంతర విద్యుత్ సరఫరా ఉన్నందున ఏ ఒక్కరూ విద్యుత్ వాహనాల ఛార్జింగ్ విషయంలో భయపడొద్దని మంత్రి జగదీష్ రెడ్డి భరోసా ఇచ్చారు. పర్యావరణ కాలుష్యం మానవ జాతి మనుగడకే చాలెంజ్ గా మారిందని ఆయన చెప్పారు. అటువంటి చాలెంజ్ లను ఎదుర్కోవడానికి విద్యుత్ వాహనాల వాడకం తప్పని సరైందన్నారు. పొగమంచుతో పాటు పర్యావరణ కాలుష్యం విడుదల చేస్తున్న పొగతో దేశ రాజధాని కొత్త ఢిల్లీతో పాటు బీజింగ్, చైనా వంటి ప్రాంతాలు ఉక్కిరిబిక్కిరి అవుతున్న అంశాన్ని ఆయన మంత్రి జగదీష్ రెడ్డి ఈ సందర్భంగా ప్రస్తావించారు.

Read more Photos on
click me!

Recommended Stories