చేనేత కార్మికుల సమస్యలపై మంత్రి శ్రీనివాస్ గౌడ్ కార్మికులతో చర్చించారు. ప్రభుత్వం అందిస్తున్న పథకాలు ఎలా అందుతున్నాయో కూడ ఆయన అడిగి తెలుసుకొన్నారు.
రాట్నం ద్వారా నూలు వడుతున్న చేనేత కార్మికులి ద్వారా నూలు వడికే విధానాన్ని మంత్రి శ్రీనివాస్ గౌడ్ పరిశీలించారు.మంత్రితో పాటు పలువురు నేతలు కూడ ఉన్నారు.
చేనేత కార్మికులు కండెలు చుట్టే విధానాన్ని తెలుసుకొన్న తర్వాత శ్రీనివాస్ గౌడ్.. రాట్నం ద్వారా కండెలు చుట్టారు. ఈ దృశ్యాలను టీఆర్ఎస్ నేత మాజీ ఎమ్మెల్సీ ఎల్. రమణ తదితరులు పరిశీలించారు.
మగ్గంపై చేనేత వస్త్రాల తయారీని మంత్రి పరిశీలించారు. వస్త్రాల నాణ్యతతో పాటు వస్త్రాల తయారీకి సంబంధించి ఉపయోగించే నూలు, రంగులు తదితర అంశాలపై మంత్రి చేనేత కార్మికులతో చర్చించారు.
మగ్గం నేస్తున్న చేనేత కార్మికురాలితో వస్త్రం తయారీకి సంబంధించి ప్రశ్నిస్తున్న మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్. వస్త్రాల నాణ్యతకు సంబంధించి చేనేత కార్మికులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకొంటారనే విషయమై కూడ ఆయన వారిని అడిగి తెలుసుకొన్నారు.
హుజూరాబాద్ నియోజకవర్గంలోని చేనేత పారిశ్రామిక సహకార ఉత్పత్తి విక్రయ సంఘం లిమిటెడ్ ఆధ్వర్యంలోని చేనేత ఉత్పత్తి కేంద్రాన్ని మంత్రి శ్రీనివాస్ గౌడ్ సందర్శించారు.
చేనేత కార్మికురాలు మగ్గం నేస్తున్న సమయంలో వస్త్రం ఎలా తయారౌతుందో మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆసక్తిగా పరిశీలించారు. తనకు కలిగిన సందేహాలను మంత్రి అడిగి తెలుసుకొన్నారు.