హైదరాబాద్‌లో మైక్రోసాఫ్ట్ విస్తరణ.. తెలంగాణకు పెద్ద బూస్ట్.. మరిన్ని కొత్త ఉద్యోగాలు

Published : Aug 26, 2025, 07:16 PM IST

Hyderabad: మైక్రోసాఫ్ట్ తెలంగాణలో తన R&D కార్యకలాపాలను విస్తరిస్తోంది. గచ్చిబౌలిలోని ఫీనిక్స్ సెంటారస్‌లో 5 సంవత్సరాల పాటు 2.6 లక్షల చదరపు అడుగుల స్థలాన్ని నెలకు రూ. 5.4 కోట్ల అద్దెతో లీజుకు తీసుకుంది. ఇది హైదరాబాద్‌కు మరో పెద్ద విజయంగా చెప్పవచ్చు.

PREV
15
హైదరాబాద్ లో విస్తరిస్తున్న మైక్రోసాఫ్ట్

ప్రపంచ టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్, హైదరాబాద్‌లో తన కార్యకలాపాలను మరింత విస్తరించేందుకు మరో ముందడుగు వేసింది. గచ్చిబౌలిలోని ఫీనిక్స్ సెంటారస్ భవనంలో 2.64 లక్షల చదరపు అడుగుల కార్యాలయ స్థలాన్ని లీజ్‌కు తీసుకుంది. ఐదు సంవత్సరాల లీజ్ 2025 జూలై 1 నుంచి అమలులోకి రానుంది.

ఒప్పందం ప్రకారం, మైక్రోసాఫ్ట్ ప్రతి చదరపు అడుగుకు రూ. 67 చొప్పున నెలకు రూ. 1.77 కోట్లు బేస్ రెంట్ చెల్లించనుంది. అయితే, కామన్ ఏరియా మెయింటెనెన్స్, ఆపరేటింగ్ ఖర్చులు, మూలధన వ్యయం, మేనేజ్‌మెంట్ ఫీజులు కలిపి మొత్తం వ్యయం నెలకు రూ. 5.4 కోట్లకు చేరుతుంది.

DID YOU KNOW ?
హైదరాబాద్ లో ఐటీ & సాఫ్ట్‌వేర్ దిగ్గజాలు
హైదరాబాద్‌ గ్లోబల్‌ ఐటీ హబ్‌గా మారింది. గచ్చిబౌలి, హైటెక్‌సిటీ ప్రాంతాల్లో Microsoft, Google, Amazon, Facebook, Apple, Deloitte, Accenture, Infosys, Wipro, Novartis, JP Morgan, HSBC వంటి ప్రపంచ దిగ్గజ కంపెనీలు తమ ఆఫీసులు ఏర్పాటు చేసుకున్నాయి.
25
మైక్రోసాఫ్ట్ ఒప్పందంలోని ముఖ్య అంశాలు

మైక్రోసాఫ్ట్ లీజ్ ఒప్పందంలోని ముఖ్యమైన విషయాలు ఇలా ఉన్నాయి

• 5 ఏళ్ల లీజ్ వ్యవధి (60 నెలలు)

• ప్రతి సంవత్సరం 4.8% రెంట్ పెంపు

• రూ. 42.15 కోట్ల భద్రతా డిపాజిట్

• 3వ, 4వ అంతస్తులు మైక్రోసాఫ్ట్ వినియోగానికి ఇచ్చారు.

ఈ లీజ్‌ను టేబుల్ స్పేస్ టెక్నాలజీస్ అనే వర్క్‌స్పేస్ ఆపరేటర్ ద్వారా మైక్రోసాఫ్ట్ పొందింది. టేబుల్ స్పేస్‌కు ఫీనిక్స్ టెక్ జోన్‌తో రిజిస్టర్ చేసిన లీజ్ ప్యాక్ట్ ఉంది.

35
హైదరాబాద్‌లో మైక్రోసాఫ్ట్ ప్రయాణం.. రానున్న కొత్త ఉద్యోగాలు

మైక్రోసాఫ్ట్ తొలిసారి 1998లో హైదరాబాద్‌లో ఇండియా డెవలప్‌మెంట్ సెంటర్ (IDC) ప్రారంభించింది. అమెరికా వెలుపల అతిపెద్ద R&D కేంద్రం ఇప్పుడు హైదరాబాద్‌లోనే ఉంది. గచ్చిబౌలి క్యాంపస్ ఇప్పటికే ఇంజనీరింగ్, కృత్రిమ మేధస్సు (AI), క్లౌడ్ ఇన్నోవేషన్ కు కేంద్రంగా ఉంది.

ఇక, ఫీనిక్స్ సెంటారస్‌లో కొత్తగా లీజుకు తీసుకున్న ప్రదేశంలో అదనపు R&D టీములు, టెక్నాలజీ యూనిట్లు ఉండనున్నాయి. దీంతో ఇక్కడ మరిన్ని ఉద్యోగాలు రానున్నాయి.

45
హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగంలో పెద్ద ఒప్పందం

ప్రోప్‌స్టాక్ ద్వారా లభించిన లీజ్ డాక్యుమెంట్ ప్రకారం, ఈ ఒప్పందం ఈ సంవత్సరం హైదరాబాద్‌లో నమోదైన అతిపెద్ద కమర్షియల్ రియల్ ఎస్టేట్ లావాదేవీలలో ఒకటిగా ఉంది. 

ఒక సీనియర్ రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ మాట్లాడుతూ.. “హైదరాబాద్‌లోని ప్రతిభావంతులైన మానవ వనరులు, మౌలిక వసతులు, తక్కువ ఖర్చులు పెద్ద టెక్ కంపెనీలను ఆకర్షిస్తున్నాయి. ఇటువంటి లావాదేవీలు గ్లోబల్ కంపెనీలు కేవలం తమ కార్యకలాపాలను నిలుపుకోవడమే కాకుండా విస్తరించడానికి కూడా హైదరాబాద్‌ను ఎంచుకుంటున్నాయని స్పష్టంగా సూచిస్తున్నాయి” అని తెలిపారు.

55
తెలంగాణకు పెద్ద బూస్ట్

ఇటీవల తెలంగాణలో మైక్రోసాఫ్ట్ ఆధునిక క్యాంపస్ ప్రారంభమైంది. త్వరలో రాష్ట్రంలో మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్లు కూడా ప్రారంభం కానున్నాయి. ఇవన్నీ కలిపి భారతదేశ డిజిటల్ మౌలిక సదుపాయాలను మరింత బలోపేతం చేస్తాయని అంచనా.

ప్రతి దశలోనూ తెలంగాణ రాష్ట్రం గ్లోబల్ ఇన్వెస్టర్లను ఆకర్షిస్తూ, ఉద్యోగావకాశాలను సృష్టిస్తూ, టెక్నాలజీ రంగంలో తన స్థాయిని పెంచుకుంటూ ముందుకు సాగుతోందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. మైక్రోసాఫ్ట్ కొత్త లీజ్ ఒప్పందం హైదరాబాద్‌ను ప్రపంచ స్థాయి R&D హబ్‌గా మరింత బలపరుస్తోంది.

Read more Photos on
click me!

Recommended Stories