హైదరాబాద్ లో కొరియన్ కొరివి దెయ్యాలు.. ఆడ పిల్లలూ జాగ్రత్త..!

Published : Mar 31, 2026, 04:00 PM IST

ఇండియన్ అమ్మాయిలను కొరియన్ కొరివి దెయ్యాలు వెంటపడుతున్నాయి. లేదు లేద ఈ కొరియన్ దెయ్యాలనే మన అమ్మాయిలు ఏరికోరి వెంటపడుతున్నాయి. దీనివల్ల ఎలాంటి నష్టాలో తెలుసా..? 

PREV
15
కొరియన్ డ్రామా యమ డేంజర్ సుమా..!

భారతీయ అమ్మాయిల్లో కొరియన్ డ్రామాలు, పాప్ మ్యూజిక్ ప్రభావం విపరీతంగా పెరుగుతోంది. ఎంతలా అంటే కొందరు అమ్మాయిలు ఈ పిచ్చిలో ఏకంగా కొరియాకు వెళుతున్నారు. ఈ కొరియన్ డ్రామాల బారినపడ్డ యువతుల చదువు, ఉద్యోగ వ్యవహారాల్లోనే కాదు వ్యక్తిగత ప్రవర్తనలో మార్పులు కనిపిస్తున్నాయి. కొరియన్ సినిమాలు మహిళలను ధైర్యవంతురాలిగా, స్వతంత్రంగా చూపిస్తాయి... ఇంతవరకు బాగానే ఉంది, ఇది భారతీయ సినిమాల కంటే మెరుగైన అంశమే. అయితే అమ్మాయల సమస్యలకు చూపించే పరిష్కారాలే వేరుగా ఉంటాయి. ఇవే యువతలో ఆందోళన, ఒత్తిడి, మానసిక సమస్యలకు దారి తీస్తున్నాయి.

25
హైదరాబాద్ లో కొరియన్ మేనియా...

హైదరాబాద్ వంటి మహానగరాలకే కాదు చిన్నచిన్న పట్టణాలకు కూడా ఈ కొరియన్ డ్రామాలు చేరాయి. వీటి ప్రభావం స్కూల్ అమ్మాయిల నుండి ఇంటర్, ఇంజనీరింగ్, డిగ్రీ... ఇలా చదువుకునే అమ్మాయిల్లో కనిపిస్తోంది. ఇలా లక్షలాదిమంది అమ్మాయిలు ఈ కొరియన్ డ్రామాల మాయలోపడి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. ఇటీవల ఉత్తర ప్రదేశ్ గజయాబాద్ లో ముగ్గురు అక్కాచెల్లెళ్లు కొరియన్ డ్రామాలకు అలవాటుపడి ఒకేసారి ఆత్మహత్య చేసుకున్నారంటేనే ఇవి ఎంతలా ప్రభావితం చేస్తున్నాయో అర్థం చేసుకోవచ్చు.

35
కొరియన్ డ్రామాలంటే ఎందుకంత పిచ్చి..?

అనాదిగా పురుషాధిక్యతను చూస్తూ వస్తున్న అమ్మాయిలకు కొరియన్ డ్రామాల్లో మహిళలను ధైర్యంగా చూపించడం ఎంతగానో ఆకట్టుకుంటోంది. అంతేకాదు అందమైన అమ్మాయిలు, అబ్బాయిల ప్రేమకథలు, రొమాన్స్, ఫ్యామిలీ డ్రామా, చదువు, ఉద్యోగం వంటి కథలతో సాగే కొరియన్ డ్రామాలు యువతకు ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. మహిళల ఎలా బ్రతకాలని కోరుకుంటారో కొరియన్ డ్రామాల్లో అలాగే చూపిస్తారు... అందుకే వాటికి మన అమ్మాయిలు అంతలా ఆకర్షితులు అవుతున్నారు.

కొరియన్ అభిమానుల కమ్యూనిటీ ఆన్‌లైన్‌లో, ఇన్‌స్టాగ్రామ్, ట్విట్టర్, రెడిట్ వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో విస్తరించాయి... ఇందులో 90 శాతం అమ్మాయిలే. ఈ అభిమానుల సంఘాలు ఈవెంట్లు, ప్రసంగాలు, కాంటెస్ట్‌లు నిర్వహిస్తూ యువతలో ఈ కొరియన్ మేనియా సృష్టిస్తున్నాయి. యువత తాము చూసే కాంపిటిటివ్ ప్రపంచంలో వ్యక్తిత్వానికి కొరియన్ పాత్రలతో పోలికలు తీయడం ప్రారంభించాయి.

45
కొరియన్ డ్రామాలపై మానసిక నిపుణుల అభిప్రాయం..

మానసిక ఆరోగ్య నిపుణులు డాక్టర్ శ్రీకాంత్ రావు ప్రకారం... కొరియన్ డ్రామాల్లో చూపించే సమస్యలు నిజమైనవే. కానీ పరిష్కారాలు డ్రమాటిక్‌గా ఉండటంతో యువతలో అసంతృప్తి, ఆత్మహత్య ఆలోచనలు పెరుగుతున్నాయి. అందువల్ల ఈ కొరియన్ డ్రామాల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి... తల్లిదండ్రులు తమ పిల్లలను వీటిబారిన పడకుండా జాగ్రత్తపడాలి. అమ్మాయిలు కూడా కొరియన్ డ్రామాల్లో చూపించేవంతా నిజమే అనుకోవడం మానేయాలి.

సామాజిక పరిశోధకులు డాక్టర్ సుధా వెంకటేష్ ప్రకారం... భారతీయ మహిళలు కొరియన్ బ్యూటీ, వ్యక్తిత్వాలు, ప్రేమకథల మోడల్‌లను అనుకరిస్తున్నారు. ఇది యువతలో వ్యక్తిగత నిర్ణయాలు, చదువు, కెరీర్ మార్గాలలో ప్రభావం చూపుతోంది. కాబట్టి మన అమ్మాయిలు ఈ కొరియన్ మాయలోంచి బయటకు రావాలి.

55
ఇండియా అమ్మాయిల్లో కొరియన్ పిచ్చి పీక్స్..

భారతీయ యువతలో 15 నుండి 30 ఏళ్ళలో 60–70% మంది కొరియన్ డ్రామాలు చూస్తున్నారు... ఇందులో 90 శాతం అభిమానులు మహిళలే. కొరియా అమ్మాయిల్లా స్వతంత్రంగా ఉండాలనే భావాలు పెరుగుతున్నాయి. ఇదే అనేక అనర్ధాలకు దారితీస్తోంది.

కొరియన్ మహిళల తీరువల్ల అక్కడ జనన రేటు 0.75 కు పడిపోయింది. యువత తగ్గి వృద్ధుల శాతం పెరుగుతోంది. మన అమ్మాయిలు ఈ కొరియన్ మాయలో పడితే భవిష్యత్ లో ఇండియా పరిస్థితి ఇలాగే తయారవుతుందనే ఆందోళన పెరుగుతోంది. అంతేకాదు వ్యక్తిగత స్వాతంత్ర్యం కోసం అమ్మాయిలు అతిగా ఆలోచించడం, ప్రవర్తనలో మార్పులు... చివరకు ఇవి ఆత్మహత్యలకు దారితీస్తున్నాయి. అందుకే ఈ కొరియన్ డ్రామాలపై పేరెంట్స్ ఆందోళన చెందుతున్నారు.

Read more Photos on
click me!

Recommended Stories