17 నెలల్లో ఆరో సారి తెలంగాణకు మోడీ టూర్: దూరంగా కేసీఆర్
రేపు వరంగల్ కు ప్రధాని నరేంద్ర మోడీ రానున్నారు. ఈ దఫా కూడ మోడీ టూర్ కు తెలంగాణ సీఎం కేసీఆర్ దూరంగా ఉండనున్నారు. మోడీ పర్యటనను తాము బహిష్కరిస్తున్నామని మంత్రి కేటీఆర్ శుక్రవారంనాడు ప్రకటించారు.
17 నెలల్లో ఆరో సారి తెలంగాణకు మోడీ టూర్: దూరంగా కేసీఆర్
ఈ ఏడాది ఏప్రిల్ మాసంలో ప్రధాని నరేంద్ర మోడీ తెలంగాణలో పర్యటించారు. ఈ టూర్ కు కూడ దూరంగా ఉన్నారు.14 మాసాల కాలంలో తెలంగాణ రాష్ట్రానికి ప్రధాని నరేంద్ర మోడీ ఐదు దఫాలు వచ్చారు. రేపు వరంగల్ కు ప్రధాని రావడం 17 మాసాల్లో ఆరో సారి కానుంది. ఈ ఐదు దఫాలు కూడ ప్రధాని మోడీని రిసీవ్ చేసుకొనే కార్యక్రమానికి కేసీఆర్ దూరంగా ఉన్నారు. అంతకు ముందు కూడ ఇదే పరిస్థితి నెలకొంది.
17 నెలల్లో ఆరో సారి తెలంగాణకు మోడీ టూర్: దూరంగా కేసీఆర్
2020 నవంబర్ మాసంలో హైద్రాబాద్ లో కరోనా వ్యాక్సిన్ పనులను పరిశీలించేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వచ్చారు. అయితే ఈ సమయంలో ప్రధాని మోడీకి స్వాగతం పలికేందుకు తెలంగాణ సీఎం కేసీఆర్ ను రావొద్దని పీఎంఓ నుండి సమాచారం ఇచ్చారని బీఆర్ఎస్ నేతలు , తెలంగాణ మంత్రులు గతంలో పలుమార్లు ప్రకటించారు. ఇక అప్పటి నుండి తెలంగాణ రాష్ట్రంలో ప్రధాన మంత్రి పర్యటించిన సమయంలో ఆయనకు స్వాగతం పలకడానికి సీఎం కేసీఆర్ వెళ్లడం లేదు.
17 నెలల్లో ఆరో సారి తెలంగాణకు మోడీ టూర్: దూరంగా కేసీఆర్
ప్రధానమంత్రి రాష్ట్ర పర్యటనకు వచ్చిన సమయంలో స్వాగతం పలికేందుకు ముఖ్యమంత్రి రాకపోవడంపై బీజేపీ నేతలు విమర్శలు చేస్తున్నారు.మోడీ సూచించిన బాటలోనే తాము వెళ్తున్నామని బీఆర్ఎస్ నేతలు కౌంటర్ ఎటాక్ చేస్తున్నారు. వ్యాక్సిన్ తయారీని చూసేందుకు వచ్చిన సమయంలో పీఎంఓ నుండి వచ్చిన సూచలను బీఆర్ఎస్ నేతలు గుర్తు చేస్తున్నారు.
17 నెలల్లో ఆరో సారి తెలంగాణకు మోడీ టూర్: దూరంగా కేసీఆర్
కాజీపేటలో రైల్వే కోచ్ తయారీ ఫ్యాక్టరీకి ప్రధాని రేపు భూమి పూజ చేయనున్నారు. దీంతో పాటు పలు జాతీయ రహదారులకు కూడ శంకుస్థాపన చేయనున్నారు.రేపు ఉదయం వరంగల్ కు మోడీ రానున్నారు. ఈ పర్యటనకు కూడ తెలంగాణ సీఎం దూరంగా ఉండనున్నారు.
17 నెలల్లో ఆరో సారి తెలంగాణకు మోడీ టూర్: దూరంగా కేసీఆర్
తెలంగాణకు అన్యాయం చేసిన ప్రధాన మంత్రి మోడీ ఏ ముఖం పెట్టుకుని వస్తున్నారని తెలంగాణ మంత్రులు ప్రశ్నిస్తున్నారు. గుజరాత్ లో రైల్వే కోచ్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేశారని మంత్రి కేటీఆర్ గుర్తు చేశారు. కానీ తెలంగాణకు మాత్రం కేవలం రూ. 520 కోట్లతో రైల్వే వ్యాగన్ల తయారీని ఫ్యాక్టరీ ఏర్పాటు చేయడంపై కేటీఆర్ అసంతృప్తిని వ్యక్తం చేశారు.
17 నెలల్లో ఆరో సారి తెలంగాణకు మోడీ టూర్: దూరంగా కేసీఆర్
రాష్ట్ర విభజన సమయంలోని హామీలను కూడ కేంద్ర ప్రభుత్వం నెరవేర్చలేదని తెలంగాణ మంత్రులు గుర్తు చేస్తున్నారు. తెలంగాణపై ద్వేషం వ్యక్తం చేసే మోడీ టూర్ ను బహిష్కరిస్తున్నట్టుగా మంత్రి కేటీఆర్ ప్రకటించారు.