బంజారాహిల్స్ లో మసాజ్, స్పా సెంటర్ ల ముసుగులో వ్యభిచారం.. నిర్వాహకుల అరెస్ట్...

First Published | Jul 7, 2023, 10:46 AM IST

బంజారాహిల్స్ లో మసాజ్, స్పా సెంటర్ల ముసుగులో వ్యభిచారం నిర్వహిస్తున్న సెంటర్ల మీద పోలీసులు దాడులు చేశారు. నిర్వాహకలును అరెస్్ చేశారు. 

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని మసాజ్ సెంటర్ ముసుగుల వ్యభిచారం నిర్వహిస్తున్న స్పాలు, మసాజ్ సెంటర్లు, బ్యూటీస్పాలపై బంజారాహిల్స్ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే మరో స్పాసెలూన్ మీద దాడులు చేసి నిర్వాహకులపై కేసును నమోదు చేశారు. 

దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. హైదరాబాద్ బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 10 లో ఉన్న మహి ఆయుర్వేదిక్ బ్యూటీ స్పా సెలూన్ మీద పోలీసులు దాడి చేశారు. సునీల్ కుమార్ అనే వ్యక్తి వ్యభిచార గృహం నిర్వహిస్తున్నట్లుగా పోలీసులకు సమాచారం అందింది. పోలీసులకు అందిన సమాచారం ప్రకారం సోదాలు నిర్వహించగా అక్కడ క్రాస్ మసాజ్ పేరుతో వ్యభిచార నిర్వహిస్తున్నట్లుగా తేలింది. 


పోలీసుల సోదాల్లో అక్కడ వివిధ ప్రాంతాల నుంచి యువతులను రక్షించి క్రాస్ మసాజ్ పేరుతోవ్యభిచారం నిర్వహిస్తున్నట్లుగా తేలింది. దీంతో నిర్వాహకుడైన సునీల్ కుమార్ తో పాటు సబార్గనైజర్ గా పనిచేస్తున్న ఫర్జానా బేగంపై పోలీసులు కేసు నమోదు చేశారు. వీరిద్దరినీ అరెస్ట్ చేశారు. 

ముగ్గురు విటులను కూడా అదుపులోకి తీసుకున్నారు. యువతులను పునరావాస కేంద్రానికి తరలించారు. బంజారా హిల్స్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 11లోని ఆర్కే రెసిడెన్సి పెంట్ హౌస్ లో జన్నత్ సెలూన్ అండ్ స్పాలో కూడా  పోలీసులు దాడులు చేశారు. 

ఇక్కడ కూడా స్పా పేరుతో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లుగా పోలీసులకు సమాచారం అందింది. దీంతో దాడులు నిర్వహించిన పోలీసులు నిర్వహకులను అరెస్టు చేసి క్రిమినల్ కేసులు పెట్టారు. జెన్నత్ సెలూన్ అండ్ స్పా రత్లావత్ విజయ్ బాబును అరెస్ట్ చేశారు. మీద కేసు నమోదు చేశారు. 

Latest Videos

click me!