కాంగ్రెస్‌లో తెరపైకి బీసీ నినాదం: 35 నుండి 50 అసెంబ్లీ సీట్లకు పట్టు

First Published | Jul 6, 2023, 4:08 PM IST

కాంగ్రెస్ పార్టీకి చెందిన బీసీ నేతలు   తమకు  సీట్ల కేటాయింపులో ప్రాధాన్యత ఇవ్వాలని కోరుతున్నారు.  రాష్ట్రంలోని  తాము కోరుకుంటున్న  సీట్ల జాబితాను  నేతలు  పార్టీ నాయకత్వానికి అందించారు.

కాంగ్రెస్‌లో తెరపైకి బీసీ నినాదం: 35 నుండి 50 అసెంబ్లీ సీట్లకు పట్టు

 కాంగ్రెస్ పార్టీకి  చెందిన బీసీ నేతలు  ప్రతి పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో  మూడు నుండి  ఐదు అసెంబ్లీ సీట్లు ఇవ్వాలని కోరుతున్నారు. తాము ఆశిస్తున్న సీట్ల  జాబితాను కూడ పార్టీ నాయకత్వాన్ని అందించారు. 

కాంగ్రెస్‌లో తెరపైకి బీసీ నినాదం: 35 నుండి 50 అసెంబ్లీ సీట్లకు పట్టు

మాజీ  పీసీసీ చీఫ్  పొన్నాల లక్ష్మయ్య నివాసంలో  బీసీ సామాజిక వర్గానికి చెందిన  నేతలు  నిన్న  సమావేశమయ్యారు.బీసీ సామాజిక వర్గానికి పెద్ద పీట వేయనున్నట్టుగా  రాహుల్ గాంధీ హామీ ఇచ్చారని పార్టీలోని బీసీ సామాజిక వర్గం  నేతలు  గుర్తు  చేస్తున్నారు.  

Latest Videos

కాంగ్రెస్‌లో తెరపైకి బీసీ నినాదం: 35 నుండి 50 అసెంబ్లీ సీట్లకు పట్టు

రాష్ట్రంలోని  119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో  కనీసం  35 నుండి  50 అసెంబ్లీ స్థానాలు  ఇవ్వాలని  బీసీ నేతలు  కోరుతున్నారు.  ఆయా జిల్లాల వారీగా  ఏ అసెంబ్లీ  సీట్లను బీసీలకు  కేటాయించాలనే దానిపై  బీసీ నేతలు పార్టీ నాయకత్వానికి జాబితా పంపారు

కాంగ్రెస్‌లో తెరపైకి బీసీ నినాదం: 35 నుండి 50 అసెంబ్లీ సీట్లకు పట్టు

ఈ ఏడాది  చివర్లో తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి.  ఈ ఎన్నికల్లో తెలంగాణలో అధికారంలోకి రావాలనే పట్టుదలతో  కాంగ్రెస్ నాయకత్వం  ఉంది. ఈ దిశగా ఆ పార్టీ నాయకత్వం  వ్యూహారచన చేస్తుంది.

కాంగ్రెస్‌లో తెరపైకి బీసీ నినాదం: 35 నుండి 50 అసెంబ్లీ సీట్లకు పట్టు

ఈ తరుణంలో  బీసీ నేతలు  తమకు  పార్టీ టిక్కెట్ల కేటాయింపులో ప్రాధాన్యత ఇవ్వాలని కోరుతున్నారు. తెలంగాణలో  బీసీ సామాజిక వర్గం ఓటర్లు గెలుపు ఓటములను  ప్రభావితం  చేస్తారు. దీంతో  బీసీ నేతలు  టిక్కెట్ల కేటాయింపులో తమకు  ప్రాధాన్యత ఇవ్వాలని  కోరుతున్నారు. 
 
కాంగ్రెస్‌లో తెరపైకి బీసీ నినాదం: 35 నుండి 50 అసెంబ్లీ సీట్లకు పట్టు

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్ధుల జాబితాను  ముందుగానే ప్రకటించాలని  ఆ పార్టీ నాయకత్వం  భావిస్తుంది.  అయితే  కాంగ్రెస్ పార్టీ  ప్రకటించే జాబితాలో  ముందుగా బీసీ  అభ్యర్థుల సీట్లే  ఉండనున్నాయి

కాంగ్రెస్‌లో తెరపైకి బీసీ నినాదం: 35 నుండి 50 అసెంబ్లీ సీట్లకు పట్టు

సీఎల్పీ నేత  మల్లు భట్టి విక్రమార్క  పాదయాత్ర ముగింపును పురస్కరించుకొని   ఖమ్మంలో  కాంగ్రెస్ పార్టీ  నిర్వహించిన జనగర్జన విజయవంతం కావడం ఆ పార్టీ శ్రేణుల్లో జోష్ నింపింది. అదే సమయంలో  మాజీ ఎంపీ  పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి  కాంగ్రెస్ పార్టీలో  చేరారు.  మరికొందరు  నేతలు కూడ కాంగ్రెస్ లో చేరనున్నారు.  మరో వైపు  బీజేపీలోని పరిణామాలను తమకు అనుకూలంగా మలుచుకొనేందుకు కాంగ్రెస్ నాయకత్వం ప్రయత్నాలు  చేస్తుంది. బీజేపీ అసంతృప్తులతో  కాంగ్రెస్ నాయకత్వం   సంప్రదింపులు  చేస్తుంది.

click me!