బీఆర్ఎస్ను బీజేపీలో విలీనం చేయాలనే కుట్ర సాగుతోందని కవిత ఆరోపించారు. తాను జైలులో ఉన్నప్పుడే ఈ కుట్రకు శ్రీకారం పడినట్లు ఆమె అన్నారు. “ఇంటి ఆడబిడ్డపై పెయిడ్ ఆర్టిస్టులతో మాట్లాడిస్తారా.?” అని కవిత ఆవేదన వ్యక్తం చేశారు.
25
నా లేఖ ఎవరు లీక్ చేశారు.?
తనపై వచ్చిన ఫేక్ న్యూస్‌లను పార్టీ ఖండించకపోవడాన్ని కవిత విమర్శించారు. "పార్టీ సోషల్ మీడియా నుంచే నన్ను టార్గెట్ చేయడం బాధాకరం. నా లేఖ ఎవరు లీక్ చేశారు చెప్పాలి. లీకువీరులను పట్టుకోమంటే, గ్రీకువీరులు దండెత్తారు" అని తీవ్రంగా విమర్శించారు.
35
కేసీఆర్ నాయకత్వం తప్ప మేము ఒప్పుకోం..
“పార్టీలో ఒక్క నాయకుడు ఉంటే అదే కేసీఆర్. ఆయన తప్ప ఇంకెవరి నాయకత్వాన్ని నేను అంగీకరించను” అని కవిత స్పష్టం చేశారు. “కేసీఆర్‌ను మేమే నడిపిస్తున్నామని చెప్పుకునే వాళ్లను చూసి ఆశ్చర్యం కలుగుతోంది. కేసీఆర్‌ను నడిపించేంత పెద్దవాళ్లు మీరా?” అని కవిత ప్రశ్నించారు. కేసీఆర్‌కు నోటీసులు వస్తే ఎందుకు నిరసనలు తెలపలేదని, ఇంకో నేతకు నోటీసులు వస్తే ఎందుకు హంగామా చేశారని కవిత అన్నారు.
తనను ఎంపీగా ఓడించడమే లక్ష్యంగా కొన్ని శక్తులు పని చేశాయన్నారు కవిత. తనకు, కేసీఆర్‌కి మధ్య దూరం పెంచే కుట్ర సాగుతోందని ఆరోపించారు. తనను పార్టీకి దూరం చేస్తే ఎవరికి లాభమో అందరికీ తెలుస్తుందని చెప్పుకొచ్చారు.
55
కాంగ్రెస్ మునిగిపోయే నావ
కాంగ్రెస్ పార్టీ ఓ మునిగిపోయే నావ అని, అలాంటి పార్టీతో రాయబారాలు జరిపే అవసరం తనకు లేదని కవిత చెప్పుకొచ్చారు. తాను వారిలా చిచోరా రాజకీయాలు చేయనని, హుందాగా ఉంటానని తెలిపారు. పార్టీ చేయాల్సిన పనులు జాగృతి తరపున తాను చేస్తున్నా అని చెప్పుకొచ్చారు.