Holidays : ఈ నెలలో ఇక మిగిలిందే 12 రోజులు, అందులో ఆర్రోజులు సెలవులే.. రెండింటికి రెండూ లాంగ్ వీకెండ్సే

Published : Jun 18, 2025, 07:51 PM ISTUpdated : Jun 18, 2025, 08:06 PM IST

జూన్ 12 వేసవి సెలవులు ముగిసి స్కూళ్లు పున:ప్రారంభం అయ్యాయి. దీంతో భారంగా స్కూళ్లకు వెళుతున్న చిన్నారులకు గుడ్ న్యూస్… ఈ నెలలో ఇంకా 12 రోజులున్నాయి.. అందులో ఆరు రోజులు సెలవులే.. ఎందుకో తెలుసా?

PREV
15
ఈ నెలలో ఉన్నదే 12 రోజులు.. అందులో ఆరురోజులు సెలవులే

June 2025 Holidays : సెలవులు ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి... స్కూలుకు వెళ్లే పిల్లలు, కాలేజీ యువత నుండి రిటైర్మెంట్ కు సిద్దమైన ఉద్యోగుల వరకు ప్రతి ఒక్కరూ సెలవులు కోరుకుంటారు. ఇక కార్పోరేట్, ఐటీ ఉద్యోగులకు వారంలో శని, ఆదివారం రెండ్రోజులు సెలవు ఉన్నా మధ్యలో ఇంకేదైనా పండగో, వేడుకో వస్తే బాగుండని కోరుకుంటారు... ఇలా వారంమధ్యలో సెలవు వచ్చిందో చిన్నపిల్లల్లా ఎగిరి గంతేస్తారు. అలాంటిది లాంగ్ వీకెండ్స్ వస్తే వారి సంతోషానికి అవధులు ఉండవు... ఈ సెలవుల్లో సినిమాలు, షికార్లకు వెళ్ళే వారిని పట్టుకోలేం.

నెలలో ఒక్క లాంగ్ వీకెండ్ వస్తేనే విద్యార్థులు, ఉద్యోగులు మురిసిపోతారు... అలాంటిది వెంటవెంటనే వస్తే వారి ఆనందానికి అవధులు ఉండవు. ఇలా ఈ నెలలో (జూన్) మిగిలిన రెండువారాలు లాంగ్ వీకెండ్సే... అంటే మిగిలిన 12 రోజుల్లో ఆరురోజులు సెలవులు వస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోని విద్యాసంస్థలు, ఆఫీసులకు ఈ నెలలో ఏఏ రోజుల్లో సెలవులు వస్తున్నాయి? ఎందుకు వస్తున్నాయి? అనేది ఇక్కడ తెలుసుకుందాం.

25
జూన్ 20, 21, 22 సెలవులే

సాధారణంగా కార్పోరేట్, ఐటీ ఉద్యోగులతో పాటు కొందరు ప్రభుత్వ ఉద్యోగులకు కూడా ప్రతి శని, ఆదివారం సెలవు ఉంటుంది. అలాగే హైదరాబాద్ తో పాటు విశాఖపట్నం, విజయవాడ వంటి నగరాల్లో కొన్ని విద్యాసంస్థలకు వారంలో రెండ్రోజులు సెలవు ఉంటుంది. ఇలా వీకెండ్ సెలవులకు అటుగానీ, ఇటుగానీ అంటే శుక్రవారంగానీ, సోమవారంగానీ సెలవు వస్తే అదికాస్త లాంగ్ వీకెండ్ గా మారుతుంది.

ఇలా ఈవారం తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల్లో చదువుకునే విద్యార్థులు, పనిచేసే ఉద్యోగులకు లాంగ్ వీకెండ్ వచ్చే అవకాశాలున్నాయి. జూన్ 20న (ఈ శుక్రవారం) తెలుగు రాష్ట్రాల బంద్ కు మావోయిస్టులు పిలుపునిచ్చారు. ఈ బంద్ విజయవంతంగా జరిగితే తర్వాత జూన్ 21 శనివారం, జూన్ 22 ఆదివారం కూడా సెలవులే... వరుసగా మూడ్రోజులు సెలవులు వస్తాయి.

35
తెలంగాణ, ఏపీ బంద్ ఎందుకు?

దేశవ్యాప్తంగా మావోయిస్టుల ఏరివేతకు సిద్దమైన కేంద్ర ప్రభుత్వం 'ఆపరేషన్ కగార్' చేపట్టిన విషయం తెలిసింది. ముఖ్యంగా ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ, చత్తీస్ ఘడ్, ఒడిషా సరిహద్దుల్లోని అడవులను జల్లెడ పడుతున్న భద్రతా బలగాలు మావోయిస్టులను ఎన్కౌంటర్ చేస్తున్నారు. ఇలా ఇప్పటికే సామాన్య మావోయిస్టుల నుండి అగ్రనాయకులు నంబాల కేశవరావు వంటివారు కూడా ప్రాణాలు వదిలారు. అలా వందలాదిమంది చనిపోగా కుంజం హిడ్మా వంటి అగ్ర నాయకులు పట్టుబడటంతో మావోయిస్టులకు కోలుకోలేని దెబ్బ తగిలింది.

ఇలా మావోయిస్టులపై జరుగుతున్న ఎన్కౌంటర్లను వామపక్షాలు, ప్రజాసంఘాలతో పాటు కాంగ్రెస్, బిఆర్ఎస్ వంటి పార్టీలు కూడా తప్పుబడుతున్నాయి. కేంద్రం ఇప్పటికైనా హింసను వీడాలని... శాంతియుతంగా మావోయిస్టులతో చర్చలు జరపాలని కోరుతున్నారు. మావోయిస్టులు కూడా ఇదే కోరుతున్నారు. 

అయితే మోదీ సర్కార్ మాత్రం మావోయిస్టులతో చర్చలకు ఆసక్తి చూపడంలేదు. దీంతో ఈ ఎన్కౌంటర్లు, కేంద్ర ప్రభుత్వ తీరును వ్యతిరేకిస్తూ మావోయిస్టులు తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ లో బంద్ ప్రకటించారు... కీలక నాయకుడు జగన్ పేరిట ఈ బంద్ కు పిలుపునిస్తూ లేఖ వెలువడింది.

తెలుగు రాష్ట్రాల్లోని మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో బంద్ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ ప్రాంతాల్లో విద్యాసంస్థలు, ఆఫీసులు కొనసాగే అవకాశం ఉండదు కాబట్టి సెలవు ఉంటుంది

ఈ మావోయిస్టుల బంద్ కు వామపక్ష పార్టీలు, ప్రజాసంఘాలు మద్దతిస్తున్నాయి... కాబట్టి ఎస్ఎఫ్ఐ వంటి విద్యార్థిసంఘాలు బంద్ పాటించే అవకాశాలున్నాయి. కాబట్టి వీరు మిగతాప్రాంతాల్లో ఆఫీసులు, స్కూళ్లు మూసేయిస్తే అక్కడకూడా సెలవులు వస్తాయి. ఇలా ఇరు రాష్ట్రాల్లో జూన్ 20న బంద్ సందర్భంగా సడన్ హాలిడే వస్తోంది.

45
జూన్ 27,28,29 మూడ్రోజులు సెలవులే

ఈవారం లాంగ్ వీకెండ్ ముగిసాక కేవలం ఓ నాల్రోజులు మాత్రమే విద్యాసంస్థలు, ఆఫీసులు నడిచేది. వచ్చేవారం మరో లాంగ్ వీకెండ్ సిద్దంగా ఉంది. జూన్ 27న శుక్రవారం తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ లో రథ యాత్ర సందర్భంగా ఐచ్చిక సెలవు ఉంది. అంటే ఈరోజు విద్యార్థులు, ఉద్యోగులు కావాలంటే సెలవు ఎంచుకోవచ్చు.

ఇక జూన్ 28న శనివారం కాబట్టి కొందరు విద్యార్థులు... ఐటీ కార్పోరేట్ ఉద్యోగులకు సెలవు ఉంటుంది. తర్వాత జూన్ 29 ఆదివారం సాధారణ సెలవు. ఇలా ఈ వారమే కాదు వచ్చేవారం కూడా లాంగ్ వీకెండ్ వస్తోంది. వారంలో ఏడ్రోజులు ఉంటే మూడ్రోజులు సెలవులే... రెండు లాంగ్ వీకెండ్స్ కాబట్టి 12 రోజుల్లో ఆరు రోజులు సెలవులే.

55
ఏమిటీ రథయాత్ర?

రథయాత్ర అనేది భారతదేశంలో ఒక ముఖ్యమైన హిందూ పండుగ. ఈరోజు దేవాలయాల్లోని దేవతామూర్తుల విగ్రహాలను రథాలలో ఊరేగింపుగా తీసుకెళ్తారు. ఒడిశాలోని ప్రముఖ పూరీ జగన్నాథ ఆలయంలో ఈ రథయాత్ర కన్నులపండగగా జరుగుతుంది.

తెలుగు రాష్ట్రాల్లో కూడా పలు దేవాలయాల్లో ఈ రథయాత్ర అంగరంగ వైభవంగా జరుపుతారు. దేవతామూర్తుల ఉత్సవ విగ్రహాలను ప్రత్యేకంగా అలంకరించి రథంపై ఊరేగిస్తారు. ఈ వేడుకలో భక్తులు భారీగా పాల్గొని రథాన్ని లాగుతారు. ఇలా దేవుడి వద్దకు భక్తులు కాదు... భక్తుల వద్దకే ఆ దేవతామూర్తులు వచ్చి ఆశీర్వదిస్తారు.

Read more Photos on
click me!

Recommended Stories