July Holidays : ఈ వీక్ ఇంకో రెండ్రోజులే ఫుల్ వర్కింగ్ డేస్, నాల్రోజులు సెలవులే.. ఏరోజు, ఎందుకో తెలుసా?

Published : Jul 13, 2026, 05:44 PM ISTUpdated : Jul 13, 2026, 05:52 PM IST

Holidays : తెలంగాణ విద్యార్థులు, ఉద్యోగులకు ఈ వారంలో సెలవులే సెలవులు. ఇంకో రెండ్రోజులే ఫుల్ వర్కింగ్ డేస్.. మిగతా నాల్రోజులు సెలవులున్నాయి. ఏరోజు, ఎందుకు సెలవు వస్తుందో తెలుసా?

PREV
15
సెలవులే సెలవులు

School Holidays : అసలు సెలవులే లేవనుకుంటున్న జూలైలో ఊహించని విధంగా వరుస సెలవులు వస్తున్నాయి. లాస్ట్ వీస్ వామపక్ష విద్యార్థి సంఘాలు (జూలై 10, శుక్రవారం) తెలంగాణవ్యాప్తంగా విద్యాసంస్థల బంద్ చేపట్టిన విషయం తెలిసిందే. ఆ తర్వాత జూలై 11 రెండో శనివారం, జూలై 12 ఆదివారం వరుస సెలవులు వచ్చాయి. అయితే గతవారం మాదిరిగానే ఈవారం కూడా వరుస సెలవులు రాబోతున్నాయి. మరి ఏరోజు, ఎందుకు సెలవు ఉందో ఇక్కడ తెలుసుకుందాం.

25
జూలై 14న విద్యాసంస్థల బంద్

తెలంగాణ ప్రభుత్వం ఫీజు రియింబర్స్మెంట్ విషయంలో తీవ్ర నిర్లక్ష్యం వహిస్తోందని... దీంతో విద్యార్థులు ఇబ్బందులు పడాల్సి వస్తోందని బిజెపి విద్యార్థి విభాగం అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ABVP) ఆరోపిస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వ తీరుకు నిరసనగా తెలంగాణలోని ఉన్నత విద్యాసంస్థల బంద్ కు ఏబివిపి పిలుపునిచ్చింది... దీంతో జూలై 14న అంటే రేపు (మంగళవారం) జూనియర్ కాలేజీల స్థాయినుండి యూనివర్సిటీ స్థాయి విద్యాసంస్థలన్నీ మూతపడనున్నాయి. ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థల్లో చదువకునే విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఈ బంద్ కు సహకరించాలని ABVP నాయకులు కోరుతున్నారు. ఒకవేళ కాలేజీలను నడిపించే ప్రయత్నం చేసినా మూసివేయిస్తామని ఏబివిపి నాయకులు చెబుతున్నారు.

35
జూలై 16న సెలవే...

జూలై 16న తెలంగాణలో మరో సెలవు ఉంది. అయితే ఇది విద్యార్థులకు కాదు కేవలం ఉద్యోగులకు మాత్రమే. ఇదికూడా అందరు ఉద్యోగులకు కాదు కొందరికి మాత్రమే. ఈ గురువారం హిందువులు ఎంతో పవిత్రంగా భావించే రథయాత్ర ఉంది... అందుకే ఉద్యోగులకు ఆప్షనల్ హాలిడే ఇచ్చింది తెలంగాణ ప్రభుత్వం. అంటే ముందస్తు అనుమతితో ఈరోజు వేతనంతో కూడిన సెలవు పొందవచ్చు. ఆంధ్ర ప్రదేశ్ తో పాటు మరికొన్ని రాష్ట్రాల ఉద్యోగులకు కూడా రథయాత్ర సందర్భంగా ఐచ్చిక సెలవు ఉంది.

ఒడిషాలోని ప్రముఖ పూరీ జగన్నాథ్ ఆలయంలో రథయాత్ర సందర్భంగా భారీ ఉత్సవాలు జరుగుతాయి. అందుకే ఇక్కడ ఉద్యోగులు, విద్యార్థులకు పూర్తిస్థాయి సెలవు ఉంది. పశ్చిమ బెంగాల్, మణిపూర్ రాష్ట్రాల్లో కూడా రథయాత్ర రోజు అంటే జూలై 16న ప్రత్యేక సెలవు ఇచ్చాయి అక్కడి ప్రభుత్వాలు.

45
జూలై 18,19 రెండ్రోజులు సెలవే..

సాధారణంగా కార్పోరేట్, ఐటీ కంపెనీల ఉద్యోగులకు ప్రతి వారాంతం రెండ్రోజులు సెలవు ఉంటుంది... కాబట్టి ఈ శని, ఆదివారం (జూలై 18,19) సెలవే. ఇలాంటి ఉద్యోగుల పిల్లలు ఎక్కువగా చదివే స్కూల్స్ లో (ఉదాహరణకు హైదరాబాద్ లోని హైటెక్ సిటీ, మాదాపూర్, గచ్చిబౌలి వంటి ఏరియాల్లో) కూడా వీకెండ్ రెండ్రోజులు సెలవు ఉంటుంది. పిల్లలు తల్లిదండ్రులతో గడిపేందుకు వీలుగా ఈ సెలవులు ఇస్తున్నాయి విద్యాసంస్థలు. కాబట్టి కొందరు ఉద్యోగులు, విద్యార్థులకు ఈ శని, ఆదివారం కూడా సెలవు వస్తోంది.

55
నాల్రోజులు సెలవులే..

మొత్తంగా చూసుకుంటే ఈ వారంలో ఇవాళ (సోమవారం) గడిచిపోయింది. ఇంకా ఆరురోజులు మిగిలివున్నాయి... ఇందులో జూలై 14, 16, 18,19 సెలవులు వస్తున్నాయి. ఇక మిగిలింది జూలై 15 (బుధవారం), జూలై 17 (శుక్రవారం)... ఈ రెండ్రోజులు మాత్రమే పూర్తిస్థాయి వర్కింగ్ డేస్ ఉంటాయన్నమాట. 

గమనిక : ఈ సెలవులకు సంబంధించిన వివరాలను విద్యాశాఖ, ప్రభుత్వ హాలిడే క్యాలెండర్, ABVP బంద్ ప్రకటన ఆధారంగా అందిస్తున్నాం. కాబట్టి మీ పిల్లలు స్కూల్స్ కు సెలవు ఉందో, లేదో అధికారిక సమాచారాన్ని బట్టి కన్ఫర్మ్ చేసుకొండి. సెలవులపై కన్ఫ్యూజన్ ఉంటే మీ పిల్లల స్కూల్ సిబ్బందిని సంప్రదించండి.

Read more Photos on
click me!

Recommended Stories