నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి ప్ర‌భుత్వం గ్రీన్ సిగ్నల్

Published : Oct 18, 2026, 09:10 PM IST

Jobs: తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త తెలిపింది. రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల్లో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి సీఎం రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ఆమోదం తెలిపింది.

PREV
13
అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి ఆమోదం

రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల్లో బోధనా సిబ్బంది కొరతను తగ్గించడంతో పాటు ఉన్నత విద్యా వ్యవస్థను మరింత బలోపేతం చేసే దిశగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. మొత్తం 429 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులను ప్రత్యక్ష నియామకాల ద్వారా భర్తీ చేయనున్నారు. ఈ నిర్ణయంతో ఉన్నత విద్యారంగంలో ఉద్యోగ అవకాశాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు అవకాశం లభించనుంది.

23
ఏ యూనివర్సిటీలో ఎన్ని పోస్టులంటే?

తొలి విడతలో భాగంగా రాష్ట్రంలోని పలు విశ్వవిద్యాలయాలకు పోస్టులను కేటాయించారు. వీటిలో ఉస్మానియా యూనివర్సిటీలో అత్యధికంగా 252 పోస్టులను భర్తీ చేయనున్నారు. మిగిలిన పోస్టుల వివరాలు ఇలా ఉన్నాయి.

* ఉస్మానియా యూనివర్సిటీ: 252 పోస్టులు

* కాకతీయ యూనివర్సిటీ: 49 పోస్టులు

* శాతవాహన యూనివర్సిటీ: 49 పోస్టులు

* పాలమూరు యూనివర్సిటీ: 45 పోస్టులు

* అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ: 16 పోస్టులు

* తెలుగు యూనివర్సిటీ: 16 పోస్టులు

* తెలంగాణ యూనివర్సిటీ: 2 పోస్టులు

ఈ పోస్టులన్నింటినీ కలిపి మొత్తం 429 అసిస్టెంట్ ప్రొఫెసర్ నియామకాలు చేపట్టనున్నారు. యూనివర్సిటీల వారీగా ఖాళీల భర్తీ పూర్తయితే ఆయా విద్యాసంస్థల్లో బోధనా కార్యకలాపాలకు మరింత తోడ్పాటు లభించే అవకాశం ఉంది.

33
నియామక ప్రకటనల జారీకి తక్షణ చర్యలు

అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి సంబంధించి నియామక ప్రకటనలను విడుదల చేసేందుకు వెంటనే చర్యలు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. దీంతో తదుపరి దశలో నోటిఫికేషన్ల జారీ, అర్హతలు, దరఖాస్తుల స్వీకరణ, ఎంపిక విధానం వంటి అంశాలపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. అయితే దరఖాస్తుల ప్రారంభ తేదీలు, విద్యార్హతలు, వయోపరిమితి, ఎంపిక ప్రక్రియకు సంబంధించిన పూర్తి వివరాలు అధికారిక ప్రకటనల్లో వెల్లడికావాల్సి ఉంది.

Read more Photos on
click me!

Recommended Stories