సాధారణ భక్తుడి నుంచి లగ్జరీగా ప్రయాణించాలనుకునే వారి వరకు అందరికీ అందుబాటులో ఉండేలా ఐఆర్‌సీటీసీ మూడు కేటగిరీల్లో ధరలను నిర్ణయించింది.
• ఎకానమీ క్లాస్ (Sleeper): పెద్దలకు రూ. 17,600 కాగా, 5 నుండి 11 ఏళ్ల పిల్లలకు రూ. 16,300 గా ఫిక్స్ చేశారు.
• స్టాండర్డ్ క్లాస్ (3AC): పెద్దలకు రూ. 26700, పిల్లలకు రూ. 25,200 ఉంటుంది.
• కంఫర్ట్ క్లాస్ (2AC): పెద్దలకు రూ. 34,600 కాగా, పిల్లలకు రూ. 32,800 గా నిర్ణయించారు.
ఈ ప్యాకేజీ ధరలోనే భక్తులకు ఉదయం టీ, బ్రేక్‌ఫాస్ట్, మధ్యాహ్నం, రాత్రి ప్యూర్ వెజిటేరియన్ భోజనం అందిస్తారు. దీంతో పాటు హోటల్ వసతి, లోకల్ సైట్ సీయింగ్ కోసం బస్సు సౌకర్యం, ట్రావెల్ ఇన్సూరెన్స్, గైడ్/టూర్ మేనేజర్ల సేవలు కూడా ఇంక్లూడ్ అయి ఉంటాయి. అయితే ఆలయాల్లో ఉండే అదనపు దర్శన టికెట్లు, పర్సనల్ ఖర్చులు మాత్రం భక్తులే చూసుకోవాల్సి ఉంటుంది. తక్కువ బడ్జెట్‌లో ఎలాంటి టెన్షన్ లేకుండా ఏడు జ్యోతిర్లింగాలను చుట్టి రావాలనుకునే వారికి ఇదొక బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు.