June 2026 Holidays : తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల్లో జూన్ 11 తో వేసవి సెలవులు ముగియనున్నాయి.. జూన్ 12 నుండి విద్యాసంస్థలు ప్రారంభం అవుతాయి. అయితే స్కూళ్లు ప్రారంభంఅయ్యాక కూాడా కొన్ని సెలవులు రానున్నాయి. ఏరోజు ఎందుకు సెలవో ఇక్కడ తెలుసుకుందాం.
June 2026 Holidays : తెలుగు రాష్ట్రాల్లో త్వరలోనే వేసవి సెలవులు ముగిసి బడిగంటలు మోగనున్నాయి. వార్షిక పరీక్షలు ముగియగానే ఏప్రిల్ 24 మూతపడ్డ ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలు జూన్ 12న తెరుచుకోనున్నాయి. దాదాపు 48 రోజులు వేసవి సెలవులను ఎంజాయ్ చేసిన విద్యార్థులకు తిరిగి స్కూల్ కి వెళ్లడం కాస్త బాధగానే ఉంటుంది. భారంగానే బ్యాగు భుజానేసుకుని స్కూల్ బాట పడుతుంటారు. ఇలాంటి విద్యార్థులకు ఊరటనిచ్చేలా జూన్ లో భారీగా సెలవులు రానున్నాయి.
24
జూన్ లో సెలవులే సెలవులు...
తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల్లోని విద్యాసంస్థలకు ప్రస్తుతం వేసవి సెలవులు కొనసాగుతున్నాయి. ఏప్రిల్ లో ప్రారంభమైన హాలిడేస్ మే మొత్తం కొనసాగాయి. జూన్ లోనూ కొనసాగనున్నాయి. జూన్ మధ్యలో తెలుగు రాష్ట్రాల్లోని విద్యాసంస్థలు పున:ప్రారంభం కానున్నాయి. అయితే ఇలా స్కూళ్ళు ఓపెన్ అవుతాయోలేదో అలా మళ్లీ సెలవులు వచ్చేస్తున్నాయి. జూన్ నెలలో మొత్తంగా 16 రోజులు స్కూళ్లకు సెలవులు ఉన్నాయి.
34
జూన్ లో ఏరోజు ఎందుకు సెలవు?
తెలుగు రాష్ట్రాల్లో జూన్ 12న విద్యాసంస్థలు రీఓపెన్ అవుతాయి... అంటే మొదటి 11 రోజులు వేసవి సెలవులే. ఇలా స్కూళ్లు ప్రారంభమై ఓరోజు నడుస్తాయో లేదో మళ్లీ రెండ్రోజుల సెలవులు వస్తన్నాయి. జూన్ 13న రెండో శనివారం, జూన్ 14 ఆదివారం... తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ లో విద్యాసంస్థలకు సెలవులే.
ఇక జూన్ 21న ఆదివారం కాబట్టి సాధారణ సెలవు ఉంది. ఈ నెల చివరివారంలో అంటే జూన్ 26న (శుక్రవారం) మొహర్రం పండగ ఉంది. దీన్ని తెలంగాణలో ఘనంగా జరుపుకుంటారు. కాబట్టి ఈరోజు అధికారికంగా సెలవు ప్రకటించింది ప్రభుత్వం. జూన్ 27న(శనివారం) ఒక్కరోజు స్కూల్ నడుస్తుంది... తిరిగి జూన్ 28న ఆదివారం కాబట్టి సాధారణ సెలవు. ఇలా వేసవి సెలవులు ముగిశాక కూడా జూన్ లో ఐద్రోజుల సెలవులు వస్తున్నాయి... ఇది విద్యార్థులు ఎగిరిగంతేసే న్యూస్.
జూన్ 2026 లో ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులకు కూడా వరుస సెలవులు వస్తున్నాయి. అయితే ఈ సెలవులు వీకెండ్ తో కలిసిరావడంతో లాంగ్ వీకెండ్స్ రాబోతున్నాయి. జూన్ 13 రెండో శనివారం, జూన్ 14 ఆదివారం రెండ్రోజులు సెలవులు వస్తున్నాయి. ఇక జూన్ 26న (శుక్రవారం) మొహర్రం సెలవు. తెలంగాణ ప్రభుత్వం ముందురోజు (జూన్ 25, గురువారం) కూడా ఆప్షనల్ హాలిడేగా ప్రకటించింది. కొందరు ఉద్యోగులకు శని, ఆదివారం వీకెండ్ సెలవులుంటాయి... అంటే జూన్ 27,28న కూడా సెలవులే. ఇలా జూన్ చివర్లో వరుసగా నాల్రోజులు సెలవులు పొందే అవకాశం తెలంగాణ ఉద్యోగులకు వచ్చింది.